
" మీ భాషను మార్చుకోండి, అప్పుడు మీ ఆలోచనలు మారుతాయి."
కార్ల్ ఆల్‌బ్రెక్ట్

బీరెల్లి శేషి, ఎం.డి.

అక్షరమాల శాస్త్రం: సంస్కృతం/హిందీ (దేవనాగరి), తెలుగు మరియు ఉర్దూ (నస్తలీఖ్) కొరకు లిపుల వ్యాప్తంగా అక్షరాంశ పటం చేసే ఒక ప్రయత్నము
బీరెల్లి శేషి, ఎం.డి.
ఉపోద్ఘాతము
అక్షరాంశ పటం చేయడం, అనగా నా ఉద్దేశ్యములో, భాషల (ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ మరియు సంస్కృతం వంటివి) వ్యాప్తంగా అక్షరాంశం వారీగా లేదా అక్షరం-అక్షరం వారీగా చేసే అనువాదము.
అనగా ఒక భాష యొక్క ధ్వనులను ఇతర భాషలకు మ్యాపింగ్ చేయుట.
ఇది, ఈ పథకములో అమలు చేయబడినట్లుగా పదము – పదము వారీ మరియు వాక్యము-వాక్యము వారీ అనువాదాల యొక్క ఒక విపర్యము.
సాంప్రదాయక అనువాదాలు భాషా వ్యాప్తంగా అర్ధాలను పటం చేస్తే, అక్షరమాల శాస్త్రం ధ్వనులను పటం చేస్తుంది.
భాషల మధ్య అక్షరం స్థాయి అనువాదమును లిప్యంతరీకరణగా పరస్పర వినిమయముతో చూడవచ్చు.
పదము/వాక్యము అనువాదము ఏ విధంగా నైతే అర్థాలు/భావనలు/ ఆలోచనలను పటం చేస్తుందో, అక్షరం-అక్షరం వారీ అనువాదము ఒక భాష నుండి మరో భాషకు ధ్వనులను పటం చేస్తుంది.
ఒక స్పృహలో, మునుపటిది పదములు/వాక్యములచే తెలియజేయబడే ఉద్దేశ్యాలు లేదా భావనలతో వ్యవహరించే మరింత మానసికమైన అభ్యాసము కాగా, వాటితో జత కూడే ధ్వనులతో సంబంధం లేకుండా, తదుపరిది, ఒక భావనలో, ఆ అక్షరముచే అందించబడే ధ్వని యొక్క ముద్రతో ప్రత్యేకంగా మరింత భౌతిక మరియు గ్రాహ్యతతో వ్యవహరిస్తుంది.
అది బహుశః మొదటి ఆలోచనలో, ఐదు భాషల అక్షరమాలలను నేర్చుకోవడం విద్యార్థులకు సవాలైనదిగా మరియు కఠినమైనదిగా అనిపించవచ్చు.
అయినప్పటికీ, ఒకసారి విద్యార్థులు నేర్చుకోవడం మొదలుపెట్టారంటే, మొదట్లో అనిపించినంత భయపెట్టేదిగా ఉండకపోవచ్చు.
ఈ అక్షరమాలలను నేర్చుకోవడానికి దోహదపడుతూ వాటి మధ్య సంబంధమును ఎత్తి చూపడమే ఎక్సెల్ వర్క్ షీట్లను జతపరచడం యొక్క ఉద్దేశ్యముగా ఉంది.
అనేకమంది పాఠకులకు తెలిసియున్నట్లుగా, హిందీ మరియు సంస్కృతం ఒకే లిపి, దేవనాగరిని ఉపయోగిస్తాయి.
తెలుగు ఒక భిన్నమైన లిపిని ఉపయోగించినప్పటికీ, దాని అక్షరమాల ఆవశ్యకంగా దేవనాగరిని పోలి ఉంటుంది.
ఇది వ్యత్యాసాలను అప్రధానం చేయడానికి కాదు, ఐతే తెలుగు, హిందీ, సంస్కృతం అక్షరమాలలు ఆచరణాత్మకంగా ఒకే అక్షరమాల.
వ్యత్యాసము ఏమిటంటే, సంస్కృతం మరియు హిందీ దేవనాగరి లిపిని ఉపయోగిస్తుండగా, తెలుగు వేరే లిపిని ఉపయోగిస్తుంది – అవే ధ్వనులు, ఐతే వేర్వేరు లిపులు/ ప్రాతినిధ్యాలు.
"అదే ధ్వని ఐతే వేర్వేరు లిపి చిహ్నము" అనే ఈ భావజాలము భారతదేశం యొక్క ధ్యేయము, "భిన్నత్వంలో ఏకత్వం"―"विविधतायामेकता"―"vividhatāyāmekatā" యొక్క మరొక దృశ్యరూపము.
పిల్లలకు చేరవేయవలసిన ముఖ్యమైన సందేశం ఏమిటంటే, బయటి వైపు రూపాలు వేరైనప్పటికీ, భావన ఒక్కటే― "a" యొక్క ఒకే ధ్వని తెలుగు, సంస్కృతం/హిందీ, మరియు ఉర్దూ భాషల లిపులలో―అ, अ/अ, మరియుا గా విభిన్నంగా వ్యక్తీకరించబడతాయి.
పిల్లల కొరకు దృశ్య మాధ్యమము, ప్రత్యేకించి వీడియోలు లేదా స్మార్ట్ ఫోన్ యాప్స్ ద్వారా ఒక ఊహాత్మకమైన మరియు వినోదాత్మకమైన తీరులో దీనిని సాధించగలము.
బాహ్యంగా విభిన్న రూపముచే అంతర్లీనంగా దాగియున్న అదే తత్వము యొక్క శక్తివంతమైన సందేశమును అందిస్తుంది కాబట్టి వయోజన అభ్యాసకులకు కూడా ఇది అంతే సమానంగా సూచనాత్మకంగా ఉంటుంది.
పైపెచ్చు, ఈ భాషలన్నియునూ తల్లీ-కూతురు లాగా గానీ లేదా అక్కచెల్లెళ్ళు/దాయాదుల లాగా గానీ పరస్పరము అనుసంధానించబడి ఉన్నాయనే వాస్తవాన్ని అది నొక్కి చెబుతుంది.
నేను 'తరచుగా అడిగే ప్రశ్నలు’ కు, ప్రత్యేకించి ప్రశ్న 3 మరియు ప్రశ్న 10 లకు సమాధానాలిచ్చేటప్పుడు కూడా ఈ సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాను.
వాస్తవానికి, అక్షరమాలలు ఈ అంశాన్ని ఈ భాషల యొక్క పదజాలము/పదముల కంటే కూడా మరింత ధృఢంగా తెలియజేస్తాయి.
కాలం గడిచిపోతున్న కొద్దీ లేదా మూలము నుండి వ్యత్యాసము కారణంగా విభిన్న భాషలలోని పదాలలో, పోలి ఉండే ఒక పదము కొన్నిసార్లు భిన్నమైన భావన లేదా మరింత సూక్ష్మమైన భావనను కలిగి ఉంటుందని మనము గ్రహిస్తాము.
అయినప్పటికీ, ధ్వనులు అలాగే ఉంటాయి, కొత్త ధ్వనులు జోడించబడవచ్చు, లేదా కొన్ని పాతవి తీసివేయబడవచ్చు, ఐతే సాధ్యమైనంత మేరకు అక్షరం, ప్రత్యేకించి తెలుగు, హిందీ, సంస్కృత భాషల్లో మార్పు చేయబడకుండా ఉంటుంది.
కాబట్టి, ఈ అక్షరమాలలను నేర్చుకోవాల్సిన మరియు భారం వహించాల్సిన ప్రాముఖ్యతను నేను అతిగా నొక్కి చెప్పలేను.
ఇంగ్లీష్ భాష లాటిన్/రోమన్ అక్షరాలను ఉపయోగిస్తుంది, దాని ప్రతిష్ట కొద్దీ అది నేర్చుకోవడానికి అత్యంత సులభము.
నేర్చుకోవడానికి కష్టం అనిపించే విషయంగా తోచేది ఉర్దూ లిపి, అది పర్షియన్-అరబిక్ అక్షరమాల ఆధారంగా ఏర్పడింది, అది లాటిన్ మరియు తెలుగు, హిందీ, సంస్కృతం అక్షరమాలలకు పూర్తిగా భిన్నమైనది.
మరో వైపున, హిందీ కంటే ఉర్దూ ఒక భిన్నమైన లిపిని ఉపయోగిస్తున్నప్పటికీ, వాటి దైనందిన భాష మరియు వ్యాకరణము ప్రాథమికంగా ఒకే పోలికతో ఉంటాయి.
పైన పేర్కొన్నట్లుగా, ఇది, ఉదాహరణకు అరబిక్, చైనీస్, దేవనాగరి, గ్రీక్, మరియు యుకాటెక్ మాయా వంటి పరస్పర సంబంధం లేని ఐదు భాషలను నేర్చుకోవడం వంటిది కాదు అనేది నా వాదన.
ఇందువెంట జతపరచియున్న"అక్షరమాల మ్యాపింగ్ పట్టికలు" విభాగము తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం అక్షరాల సంబంధమును తద్రూపముగా ఎత్తి చూపుతుంది.
కొత్త అభ్యాసకుణ్ణి ప్రోత్సహించి, అస్తవ్యస్తంగా కనిపించే ఉర్దూ లిపిచే అతడిని/ఆమెను భయపెట్టకుండా మరియు చూసుకోవడానికి గాను, ఉర్దూ అక్షరాలను వివిధ సమూహాలుగా ఏర్పాటు చేసి ప్రతి సమూహము లోపున అంతర్లీనంగా ఇమిడియున్న దృశ్యాత్మకపోకడను చూపించడానికి నేను ప్రయత్నించాను.
తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం అక్షరాల సూచిక, అభ్యసనము, జ్ఞాపకము మరియు వాడుకను సానుకూలం చేయడానికి గాను, నేను వాటిని, జతపరచియున్న "అక్షరాల కూర్పు పట్టికలు" విభాగములో, నిలువుగా కూర్పుచేసిన పది పట్టికల రూపములో ఎడమ నుండి కుడివైపుకు ఏర్పాటు చేశాను:
పట్టిక 1- దేవనాగరి మరియు తెలుగు అచ్చులు
పట్టిక 2 – దేవనాగరి మరియు తెలుగు హల్లులు
పట్టిక 3 – దేవనాగరి హల్లుల సమూహాలు
పట్టిక 4 – దేవనాగరి మరియు ఉర్దూ ప్రత్యేక హల్లులు
పట్టిక 5 – దేవనాగరి హిందీ vs. ఉర్దూ అచ్చులు
పట్టిక 6 – దేవనాగరి హిందీ vs. ఉర్దూ హల్లులు
పట్టిక 7 – దేవనాగరి vs. ఉర్దూ: ద్విత్వాక్షరాలు (ఒత్తు హల్లులు/ఒత్తు అక్షరాలు)
పట్టిక 8 – ఉర్దూ అక్షరాలు చుక్కలతో
పట్టిక 9 – ఉర్దూ అక్షరాలు చుక్కలు లేకుండా
పట్టిక 10 – అన్ని రూపాల్లోనూ సంపూర్ణ ఉర్దూ అక్షరమాల
ఇది మొత్తంగా అక్షరమాలను నేర్చుకొని, జ్ఞాపకం ఉంచుకొని మరియు వాడటానికి సులభతరం చేస్తుందని ఆశించబడుతోంది.
ఇందువెంట "పదం-స్థాయి మ్యాపింగ్ ని చూపుతున్న అక్షరమాల పట్టికలు" పై జతపరచియున్న విభాగము, ఇవ్వబడిన ఒక భాషలో, ప్రతి అక్షరానికీ, ముఖ్యంగా ఆ అక్షరముతో మొదలయ్యే ఒక ఉదాహరణ పదమును మరియు దానికి ఒక స్థిరమైన బొమ్మను చూపుతూ పిల్లలు వాటిని సాంప్రదాయంగా నేర్చుకునేలా ఐదు భాషల అక్షరమాల పట్టికలను సమకూర్చి సమర్పిస్తుంది.
లక్ష్యం చేసుకోబడే విద్యార్థులు ప్రీ-స్కూల్ పిల్లలు, 3-5 సంవత్సరాల వయస్కులై ఉంటారు.
ముఖ్యంగా, వారి "గ్రాహ్యతా మనస్సుల," చే తులనాత్మక/సహ అనుబంధిత ఆలోచనా విధానము మరియు అభ్యసనమునకు వీలు కల్పించడానికై, ఈ విభాగము, ప్రతి భాష నుండి మిగిలిన నాలుగు భాషల లోనికి సంబంధిత ఉదాహరణ పదాలను అనువదించడం ద్వారా వాటితో ఏకకాలములో సుపరిచితమయ్యేలా పరిచయం చేస్తోంది.
ప్రతి భాష అక్షరమును దృశ్యాత్మకంగా ప్రదర్శించుటకు ఎంపిక చేసుకున్న ఉదాహరణ పదాల అర్థాలు అతివ్యాప్తి కాకుండా ఆ భాషకు ప్రత్యేకితమైనవి.
ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ మరియు సంస్కృతం వరుసగా 26, 51, 57, 39, మరియు 49 అక్షరాంశాలు/అక్షరాలను కలిగి ఉండటాన్ని పరిగణించుకొని, అది చిరు మనస్కులు ఐదు భిన్న భాషలలో 222 బొమ్మలు/పదాలు/అర్థాల రంగరింపుతో సాంస్కృతిక విలువను నేర్చుకోవడానికి వీలు కలిగిస్తుంది.
ప్రతి అక్షరాంశము/అక్షరమునకు ఒక ఉదాహరణ పదమును నేర్చుకోవడానికి బదులుగా రెండు ఉదాహరణ పదాలను నేర్చుకోవడం ద్వారా, ఈ సంఖ్య రెట్టింపుగా పెరుగుతుంది (దాదాపుగా 440 కు చేస్తూ).
ఈ విస్తృత పరిధి అదనంగా కొత్త అర్థాలు/భావనలు/ఆలోచనల పరిచయానికి వీలు కలిగిస్తుంది, ప్రత్యేకించి అవి ఇప్పుడిప్పుడే మొగ్గతొడుగుతున్న పసి మనస్సులకు, దశాబ్దాల కొద్దీ వాడుకలో ఉన్న ప్రామాణిక పదాల జాబితాలకు తోడుగా ఈ భాషల సాంస్కృతిక, నైతిక విలువలకు సంబంధించినవై పరిచయం కావచ్చు.
సూచిక మరియు అభ్యసనమును సానుకూలపరచుటకు గాను, నేను 1 నుండి 5 వరకు ఈ ఛార్టులను ఎడమ నుండి కుడికి పొందుపరచి ఏర్పాటు చేశాను ― ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ మరియు సంస్కృతం.
భవిష్యత్తులో ఈ క్రింది విధమైన కాల్పనిక ఉపాధ్యాయుల్ని నియమించుకోవడం ద్వారా బొమ్మల రూపములోని ఉదాహరణలు, స్వర-ప్రయోక్తలు మరియు యానిమేషన్లు చిత్రీకరించబడతాయి:
శ్రీమతి సరోజ (సరోజినీ నాయుడు – ఇంగ్లీష్)
శ్రీ వేమా (వేమన – తెలుగు)
శ్రీ ప్రేమ్ (ప్రేమ్‌చంద్ – హిందీ)
శ్రీ మీర్జా (గాలిబ్ – ఉర్దూ)
శ్రీ కాళిదాస్ (కాళిదాసు – సంస్కృతం)
నేర్చుకున్న ఐదు భాషల అక్షరమాలల పరిజ్ఞానమును సమీకృతపరచు ఉద్దేశ్యముతో అక్షరాలను కలగలిపి జతచేయుట మరియు/లేదా నుడికట్టులు మరియు అభ్యాసములు రూపొందించుట చేయబడుతుంది.
పైన పేర్కొన్నట్లుగా ఒక చిన్నారిని అక్షరమాలలో ఆరితేరిన వ్యక్తిగా, సాధికారతతో, ఒక ఎదురులేని వ్యక్తి లేదా గంభీరమూర్తిగా, సంపూర్ణ ఆత్మవిశ్వాసముతో బడికి వెళుతున్నట్లు భవిష్యద్దర్శనము చేయండి.
ఈ పథకముపై మనం ముందుకు వెళ్ళే కొద్దీ, మరియు పైన చెప్పినట్లుగా మరియు తరచుగా అడిగే ప్రశ్న 13 లో చర్చించినట్లుగా, మనం అక్షరమాలల మధ్య పోలికలను మరియు భేదాలను ఎత్తి చూపుతూ ఒక స్మార్ట్ ఫోన్ యాప్ ను వ్రాయాల్సిన అవసరం ఏర్పడవచ్చు, వీడియో తయారు చేయాల్సి రావచ్చు లేదా అక్షరాలను ఒక నాటకములోని పాత్రధారులుగా భావిస్తూ ఒక వీడియో గేమును సైతమూ సృష్టించాల్సి రావచ్చు.
ఇంకా పైపెచ్చు, అక్షరమాలపై దృష్టి సారించబడిన జోలపాటలు లేదా బాలల పద్యాలను వ్రాయవచ్చు మరియు ఆనందంగా పాడవచ్చు.
ఉల్లాసకరమైన రీతిలో ఈ అక్షరమాలల తులనాత్మక బోధనను సాధించడానికి ఇది సహాయపడుతుంది.
అంతిమంగా, మానవ సంస్కృతి మరియు చరిత్ర యొక్క అంతర్భాగంగా లిపులు మరియు భాషలు మూర్తీభవించి ఉన్నందున, వాటి యొక్క వైవిధ్యత అంతరించిపోకుండా పరిరక్షింపబడేందుకు ఈ బహు-భాషావాదం పథకము ప్రోత్సహిస్తుందని ఆశించబడుతోంది.
ఇప్పటికి, వాటి సన్నిహిత సంబంధము, లేదా వాటి లోపమును చూడగలిగితే చాలు.
ఈ బహు-భాషావాద పథకములోఈ క్రింది లిప్యంతరీకరణ (రోమనైజేషన్) క్రమాలు ఉపయోగించబడ్డాయి:
దేవనాగరి – సంస్కృతం: సంస్కృత లిప్యంతరీకరణ యొక్క అంతర్జాతీయ అక్షరమాల (ఐఎఎస్‌టి)
దేవనాగరి – హిందీ: లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (ఎల్ఒసి) వ్యవస్థ
తెలుగు: ఎల్ఒసి వ్యవస్థ
ఉర్దూ: ఎల్ఒసి వ్యవస్థ
ఇది, ఐఎఎస్‌టి మరియు ఎల్ఒసి వ్యవస్థలు ఒకేలా ఉంటాయని తెలుసుకోవడానికి సహాయపడవచ్చు.
పై క్షేత్రస్థాయి పని, ఏకకాలములో లిపులను బోధించాలనే మా ఆలోచన పురోగమించేకొద్దీ ఆ మార్గాన్ని సుగమం చేయగలదని ఆశించడమైనది.
పథకము యొక్క ఈ దశలో, అక్షరమాలలపై ఈ "ఉపోద్ఘాతము" ప్రాథమికంగా వయోజన అభ్యాసకులు, తల్లిదండ్రులు, ఉపధ్యాయులు/బోధకులు, సాఫ్ట్ వేర్ డెవలపర్లు, విధాన నిర్ణేతలు మరియు ఆసక్తి గల పౌరుల కొరకు లక్ష్యం చేయబడింది.
ఈ పని, ఈ లిపులను ప్రీ-స్కూల్ పిల్లలకు ఒకే సమయములో బోధించడమనే అంతిమ లక్ష్య సాధనకు అవసరమైన సముచిత సాధనాల (సాఫ్ట్ వేర్ లేదా ఇతరత్రా) తయారీకి నిస్సందేహంగా సహాయపడుతుంది.
చివరగా, మీ ముందు ఉంచబడిన సమాచారము ఏ విధంగానూ సంపూర్ణము కాదు మరియు తరగతి గదిలో నేర్చుకోవడానికి ఆశించబడిన సూక్ష్మ నైపుణ్యాలు మరియు చిక్కులను ప్రస్తావించి ఉండకపోవచ్చునని మనసులో ఉంచుకోవడం ముఖ్యము.
సవివరమైన చిత్రణ కోసం జతపరచియున్న "సూచికలు" విభాగమును చూడండి.
కృతజ్ఞతలు:
ఈ అక్షరమాలల పత్రాలను రూపొందించుటలో గట్టి ప్రోత్సాహము, కీలక సమీక్ష మరియు సహాయకర వ్యాఖ్యలను అందజేసినందుకు గాను అనామధేయ భాషావేత్తలు శ్రీ. ఎస్.ఎస్ మరియు శ్రీ. టి.ఎస్ గారలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.