" మీ భాషను మార్చుకోండి, అప్పుడు మీ ఆలోచనలు మారుతాయి."
కార్ల్ ఆల్‌బ్రెక్ట్

బీరెల్లి శేషి, ఎం.డి.

మాదిరి పాఠము II

భారతీయ సంగీతభాండాగార స్వంతదారులకు ఆహ్వానము

బహు-భాషావాదం కొరకు డా. శేషి గారి అంతర్జాతీయ కేంద్రము మరియు బహు-భాషావాదంInc కొరకు శేషి అకాడమీ అనేది ఒక లాభాపేక్ష రహిత స్వచ్ఛంద సంస్థ.
భారతదేశం యొక్క సామాన్య పౌరులకు బహు-భాషా వాదం యొక్క బోధనా భావజాలాన్ని చేరువ చేయడానికై, ఎంపిక చేయబడిన బాలీవుడ్/టాలీవుడ్ గీతాలు, సంగీతం మరియు వాటి అభినయ కూర్పులను దృష్టాంతముగా ఈ వేదికపై సముచితంగా పొందుపరచడానికి మేము సంతోషిస్తాము.
అవి కేవలం ఈ సూత్రాలపై మాత్రమే పొందుపరచబడతాయి:
అ) అవి ఉచితంగా అందజేయబడాలి, మరియు
ఆ) ఈ ప్రక్రియలో మా సంస్థ ఉత్పాదన చేయబోయే ఏవేని అనువాదాలు మరియు సంబంధిత రికార్డింగులను అవి ఏర్పరచబడిన ఉద్దేశ్యానికి తప్ప, వారు ఇతరత్రా వాణిజ్య ప్రయోజనానికి గానీ మరేదేని ఇతర ఆవశ్యకతకు గానీ ఉపయోగించకుండా ఉండేందుకు స్వంతదారు అంగీకరించాలి.
ఈ పథకము యొక్క విలువను గౌరవించే మరియు దీనికి మద్దతు ఇవ్వాలని భావించే సంగీతభాండాగార స్వంతదారులకు ఇది ఒక బహిరంగ ఆహ్వానము.
వారి విలువైన అభిప్రాయాలను స్వాగతిస్తున్నాను.
ఎంపిక చేయబడిన గీతాలు/ఆడియో/వీడియో ఈ ఆహ్వాన పుట స్థానములో లేదా దీనికి జోడింపుగా ఉంచబడతాయి.
ఈ ఆతిథ్యం, భారతదేశ జాతీయ చిహ్నాలపై ఏకభాషలో, వాక్యము వారీగా, ఐదు వాక్యాల వారీగా, మరియు పదము వారీగా అనువాద రూపాలలో – "మాదిరి పాఠము-1" యొక్క పోకడకు ప్రతిరూపముగా ఉంటుంది మరియు ఐదు భాషలలోనూ సంగీత కూర్పుచే జోడింపు చేయబడి ఉంటుంది.
దీని గౌరవసూచక పంక్తులు పాట పేరు, చలనచిత్రం (సంవత్సరం), చిత్ర దర్శకులు, గీతరచయిత, సంగీత దర్శకులు మరియు గాయకులను ఉటంకిస్తాయి – అదనంగా సంగీతభాండాగార స్వంతదారుల యొక్క ఉదాత్తమైన మద్దతు పట్ల కృతజ్ఞతాపూర్వక నమస్సులు, ప్రత్యేక ధన్యవాదాలతో.

విశ్వాసపాత్రులు,

బీరెల్లి శేషి, ఎం.డి.

BSeshi@multilanguaging.org
BSeshi@outlook.com