" మీ భాషను మార్చుకోండి, అప్పుడు మీ ఆలోచనలు మారుతాయి."
కార్ల్ ఆల్‌బ్రెక్ట్

బీరెల్లి శేషి, ఎం.డి.

విరాళాలకు విజ్ఞప్తి

బహు-భాషా వాదము: బహుళ భాషల యొక్క సమకాలీన బోధన కొరకు ఒక ప్రతిపాదన

ప్రియమైన సంభావ్య దానశీలి:

బహుళ భాషల యొక్క సమకాలీన లేదా ఏకకాలిక బోధన యొక్క సిద్ధాంతమును ముందుకు తీసుకువెళ్ళడానికి నేను నిధులను కోరుతున్నాను.

"బహు-భాషావాదము" అనేది, బహుళ భాషలను ఒకే సమయములో అభ్యసించడానికి వీలు కల్పించే ఒక కొత్త బహుభాషా లేదా బహుళ భాషా అభ్యసన ప్రతిపాదన.
ఈ ఉదంతములో, ఏకకాలములో ఐదు భాషలను ఎలా నేర్చుకోవాలో ఇది చూపిస్తుంది.
ఇది మూడు భారతదేశ-వ్యాప్త భాషలు (హిందీ, ఉర్దూ మరియు సంస్కృతము), ఒక అంతర్జాతీయ భాష (ఇంగ్లీష్), మరియు ఒక స్థానిక వ్యావహారిక భాష (తెలుగు) అభ్యసనానికి వర్తింపజేయబడుతుంది.
అన్ని భాషలూ మొదటి తరగతి (గ్రేడ్ లేదా స్టాండర్డ్) నుండి ప్రారంభమవుతాయి.
("తరగతి", "గ్రేడ్", మరియు "స్టాండర్డ్" అనే పదాలు పరస్పరమార్పిడిగా ఉపయోగించబడతాయి.)
ఏదైనా ఒక స్థానిక భాష తెలుగును స్థానాంతరము చేయవచ్చు.
భారతదేశం యొక్క నిర్దిష్ట పరిస్థితి నుండి ఈ ప్రతిపాదన ఉత్పన్నమయింది.

ఈ ప్రతిపాదన రెండు భాగాలను కలిగియుంది, రెండూ కొత్తవే:

అ) ఉద్దేశ్యము – ఐదు భాషలను బోధించుట/నేర్చుకొనుట,
ఆ) పద్ధతి – ఆ ఉద్దేశ్యమును సాధించుట.

భాషల సంఖ్య 2, 3, లేదా 4 కాదు―అవి 5.
భారతదేశవ్యాప్తంగా జాతీయ సమగ్రతను మరియు భాషాపరమైన సమానత్వమును సాధించాలనే ఆకాంక్షలో ఆ సంఖ్య తన మూలస్థానమును కలిగియుంది.

ఐదు భాషలను నేర్చుకోవడమనేది ప్రతిపాదిత "సమకాలీన/ఏకకాలిక" పద్ధతిలోనా లేదా ప్రస్తుతమున్న "వరుసక్రమపు" పద్ధతిలో మరింత సమర్థవంతంగా ఉంటుందా అనేది ఇంకా నిర్ధారించబడవలసి ఉంది.
పరిశోధకులు ఒక కొత్త చికిత్సా పద్ధతి యొక్క సమర్థత మరియు భద్రతను మదింపు చేసేందుకు పరీక్షించే ఒక వైద్యప్రయోగాత్మక పద్ధతి వంటి ఏర్పాటును ఉపయోగించి ఆ నిర్ధారణ చేయవలసి ఉంది.

సులభంగా అర్థం చేసుకోగల 30 కి పైగా ప్రశ్నలు మరియు జవాబులతో ఈ భావజాలము విశదీకరించబడింది.
ఏక కాలిక/సహసంబంధిత అభ్యసనమును సానుకూలపరచుటకు గాను, ఇవ్వబడిన ఒక పత్రమును ఒకే భాష, ఒక్కొక్క వాక్యము-వాక్యము వారీగా, ఐదు వాక్యాలు-ఐదు వాక్యాల వారీగా మరియు పదము-పదము వారీగా అనువాదాలను అందించడం ద్వారా ఈ పద్ధతి ప్రదర్శనాత్మకం చేయబడింది.
ఈ వెబ్‌సైట్ ని సందర్శించడం ద్వారా ఈ ప్రతిపాదనను ఏ చట్రము నుండి మదింపు చేయాలనే ఒక భావరూపమును మీకు అందిస్తుందని ఆశించబడుతోంది.

indian.multilanguaging.org

ఈ సంబంధిత వెబ్‌సైట్ ని సందర్శించడం ద్వారా మీకు మీరుగా న్యాయనిర్ణయం చేయగలరు కాబట్టి ఈ పద్ధతి ఒక సాధారణ ఏర్పాటులో మరియు ప్రపంచము యొక్క అన్ని భాషలకూ వర్తిస్తుంది.

european.multilanguaging.org

ఈ అనుబంధ వెబ్‌సైట్, ఏడు ఐరోపా భాషలను బోధన/ అభ్యసనము చేయుటలో బహు-భాషావాద పద్ధతి యొక్క సంభావ్య వర్తింపును అన్వేషిస్తుంది: ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, లాటిన్, మరియు గ్రీక్―ఏకకాలములో అన్నియునూ లేదా ఆశించిన ఒక ఉప-సమ్మేళనము.
ఈ భావజాలాన్ని ఏ భాషల సమ్మేళనానికైనా లేదా ఏ దేశపు భాషలకైనా విస్తరింపజేయవచ్చు.
ప్రపంచములో అనేక దేశాలు అధికారికంగా లేదా అనధికారికంగా ద్విభాషాపరమైనవి లేదా బహుభాషా పరమైనవిగా ఉన్నాయి.
అటువంటి ప్రతి దేశమూ లేదా ప్రాంతము దాని భాషాప్రయుక్త అసమ్మతి యొక్క చర్యచే బహుశః విడిగా ఏర్పరచబడి ఉండవచ్చు.
ప్రపంచములో ఒక దేశం లేదా ప్రాంతం కొరకు ఆశించబడినట్లుగా లేదా అవసరమైనట్లుగా భాషల సమ్మేళనాన్ని బోధించుటకు బహుభాషావాద పద్ధతి రూపొంది అమలయ్యే అవకాశం ఉంది.

స్వతంత్ర భాషలు లేదా వాటి అక్షరమాలను బోధించడానికి అసంఖ్యాకమైన పద్ధతులు ఉన్నాయి.
అయినప్పటికీ, నాకు తెలిసినంతవరకూ ఉదాహరణకు, ఐదు లేదా ఏడు భాషలను అన్నింటినీ కలిపి ఒక సహసంబంధిత లేదా సమీకృత పద్ధతిలో బోధించడానికి ఏ పద్ధతి కూడా అందుబాటులో లేదు.
సహానుబంధిత అభ్యసనము అభ్యాసకుడికి – పిల్లలు మరియు పెద్దలకు కూడా, కొత్త ఆలోచనా నైపుణ్యరాశి/శక్తిని మరియు కొత్త ఆస్వాదననూ కలుగజేస్తుందనేది నా సిద్ధాంత శోధన.
బహుళ భాషలను ఏకకాలములో బోధన/ అభ్యసన చేయడానికి ఈ క్రొత్త ప్రతిపాదన నా పరిజ్ఞానం మేరకు స్వభావము, అవకాశము మరియు సంభావ్య ప్రభావరీత్యా రూపాంతర ప్రయోగము.
భాషలను బోధించడానికి ఇది ఒక క్రొత్త విద్యా విషయక రూపావళి లేదా అభ్యాసమును ఉత్పన్నం చేస్తుందని ఆశించడమైనది.

ఇక్కడ నేను ఒక సంక్షిప్త వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నేపధ్యాన్ని ఇవ్వదలచుకున్నాను, indian.multilanguaging.org లో "జీవితచరిత్ర," క్రింద అది తదుపరి విశదీకరించబడి ఉంది.
నేను మునుపు వ్యాధినిర్ణయ శాస్త్రమును అభ్యసించి మరియు వైద్య అవగాహనాకర్తగా మరియు జీవవైద్య పరిశోధకుడిగా పనిచేసియున్న ఒక బోధనా వైద్యుణ్ణి.
నేను భారతదేశంలో హైదరాబాద్ లోని ఉస్మానియా వైద్య కళాశాల నుండి వైద్యశాస్త్రములో విశ్వవిద్యాలయ బంగారు పతకముతో వైద్య పట్టా పొందాను, ఆ తదుపరి ఇండియా, బెంగళూరు భారతీయ విజ్ఞానశాస్త్ర సంస్థ యందు 3 సంవత్సరాల పాటు జీవరసాయన శాస్త్రములో పరిశోధక విద్యార్థిగా చేసి, ఆ తర్వాత నేను అమెరికాకు తరలివచ్చి, యేల్ విశ్వవిద్యాలయములో వ్యాధినిర్ణయశాస్త్రములో నా రెసిడెన్సీని పూర్తి చేసుకున్నాను.
నేను న్యూయార్క్ లోని రోచెస్టర్ విశ్వవిద్యాలయము, దక్షిణ ఫ్లోరిడా విశ్వవిద్యాలయము (యు.ఎస్.ఎఫ్), మరియు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయము (యు.సి.ఎల్.ఎ) లాస్ ఏంజిల్స్ లలో ప్రొఫెసర్ హోదాలను పొందాను.
నేను, జాతీయ ఆరోగ్య సంస్థలచే ఆర్థిక సహాయం చేయబడిన మూల-కణ జీవశాస్త్రము మరియు ప్రోటియోమిక్స్ క్షేత్రాలలో ప్రధాన పరిశోధనాకర్తగా విధులు నిర్వర్తించాను.

మీరు పాఠక-స్నేహపూర్వకమైన ప్రశ్నలు మరియు జవాబులను సమీక్షించాల్సిందిగా కూడా నేను మిమ్మల్ని కోరుతున్నాను.
అవి మీకు ఈ పథకము వెనుక గల చోదకశక్తుల పట్ల ఒక గ్రాహ్యతను అందజేస్తాయి.
మనం నివసించే వైవిధ్యమయమైన సమాజానికి దోహదపడాలనే ఒక పట్టుదలచే నేను ఎల్లప్పుడూ ముందుకు నడిపించబడ్డాను.
వైద్యము/జీవశాస్త్రము నుండి భాషలను బోధించే పద్ధతుల పరిశోధనకు నేను ఎందుకు మళ్ళుతున్నానని మీరు నన్ను అడగవచ్చు.
నా ఉన్నతపాఠశాల రోజుల నుండీ భాషలపట్ల నాకు అమితమైన ఆసక్తి ఉండేది, నేను నిరంతరాయంగా దాన్ని పెంచి పోషించాను.
ఈ రంగానికి ఒక బాహ్య వ్యక్తిగా ఉంటూ, మరియు నా వైవిధ్య నేపధ్యముతో, నేను ఈ భాషా పథకానికి ఒక క్రొత్త ఉత్తేజాన్ని తీసుకువస్తున్నాను, మరియు సృజనను సృష్టించడానికి ఇది నాకు వీలు కల్పిస్తోంది.

పాఠాలను ఎంచుకోవడానికి మరియు అనుబంధ విషయ సామాగ్రిని రూపొందించడానికి ఈ ప్రస్తుత ప్రతిపాదన తగు మార్గదర్శక సూత్రాలను అందిస్తుంది.
ప్రతిపాదన మరియు తత్సంబంధిత విషయాంశాల యొక్క అనేక అంశాల యొక్క సమగ్రమైన వివరణలు పాఠక-స్నేహపూర్వకమైన "ప్రశ్న మరియు జవాబు" రూపములో ఇవ్వబడ్డాయి.
అవి ఈ ప్రతిపాదన యొక్క సమగ్రమైన సమీక్షను అందజేస్తాయి.
ఈ వెబ్‌సైట్ ఈ పత్రాలను అన్ని భాషలలోనూ పొందుపరుస్తుంది―ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, మరియు సంస్కృతం―తద్వారా అవి ఈ భాషల్లో ఏ భాష మాట్లాడేవారికైనా అర్థమవుతాయి.
ముందుకు వెళుతూ, బడి-పూర్వ విద్యార్థులకు అక్షరమాలను మరియు 1 నుండి 10 వ తరగతి విద్యార్థులకు పాఠాలనూ సమకాలికంగా బోధించడానికి సముచితమైన పాఠ్యపుస్తకాలు మరియు బోధనా సామాగ్రిని రూపొందించాల్సి ఉంది.

ఈ ప్రతిపాదన శాస్త్రీయ విచారణ యొక్క స్ఫూర్తితో ఉద్భవించింది.
ఈ ప్రతిపాదన యొక్క సమర్థతను ఇంకా పరిశోధించాల్సి ఉంటుంది మరియు నిర్ధారించాల్సి ఉంటుంది.
పరిశోధన కోసం అయినప్పటికీ―సముచితమైన పాఠ్యపుస్తకాలు తయారు చేయాల్సి ఉంది.
దీనికి బాహ్య నిధుల తోడ్పాటు కావాల్సి ఉంటుంది.

ఈ పథకమును తదుపరి స్థాయికి తీసుకువెళ్ళడానికి నాకు మీ సహాయం మరియు మద్దతు అవసరము.
మీ ద్రవ్యరూప విరాళాలు ఎంతో కృతజ్ఞతతో స్వీకరించబడి గౌరవించబడతాయి.
ముందస్తుగా మీకు అనేక ధన్యవాదాలు.

విశ్వాసపాత్రులు,

బీరెల్లి శేషి, ఎం.డి.

BSeshi@multilanguaging.org
BSeshi@outlook.com




డా. శేషి గారి అంతర్జాతీయ కేంద్రము మరియు బహు–భాషావాదం Inc కొరకు అకాడమీ అనేది, ఒక యుఎస్ పన్ను-మినహాయింపు 501(సి)3 లాభాపేక్ష రహిత సంస్థ (పన్ను గుర్తింపు సంఖ్య 85-0932762).
చట్టముచే అనుమతించబడిన విధంగా విరాళాలు అన్నియునూ పన్ను తగ్గింపుకు లోబడి ఉంటాయి.