" మీ భాషను మార్చుకోండి, అప్పుడు మీ ఆలోచనలు మారుతాయి."
కార్ల్ ఆల్‌బ్రెక్ట్

బీరెల్లి శేషి, ఎం.డి.

తరచుగా అడిగే ప్రశ్నలు మరియు జవాబులు

ప్రశ్నలు మరియు జవాబులు (Q&A)

బీరెల్లి శేషి, ఎం.డి.
BSeshi@multilanguaging.org
BSeshi@outlook.com

"సందేశము" (పత్రము1) మరియు "విషయాంశము, పాఠ్యాంశములు మరియు బోధనా ప్రణాళిక" (పత్రము2), ప్రతిపాదన వెనుక ఉన్న సూత్రము మరియు విశాలమైన యోచనను విశదీకరిస్తాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు నిర్దిష్టమైన వివరాలను ప్రస్తావిస్తాయి ― ప్రతిపాదన యొక్క క్షుణ్ణమైన వివరణ.
తరచుగా అడిగే ప్రశ్నలు ప్రాథమికంగా, కొంత నేపధ్యమును జోడిస్తూ, ప్రతిపాదన యొక్క సమగ్ర ముఖచిత్రమును అందజేస్తూ బహు భాషావాదం చొరవ చుట్టూనే తిరుగుతాయి.
ప్రశ్నలు మరియు జవాబుల రూపము, సమాచారమును ఎంచుకోవడం, చదవడం మరియు అర్థం చేసుకోవడాన్ని చక్కగా సానుకూలపరుస్తుంది.
లాటిన్ అక్షరాలలో లిప్యంతరీకరణను సానుకూలపరచడానికి, ప్రతి వాక్యమూ ఒక కొత్త పంక్తిపై మొదలు అయ్యేలా రూపొందించడమైనది.

క్షేత్రంలో వాడుకలో ఉన్న అత్యంత సాధారణ పదాలు బహుభాషికం లేదా బహుళభాషికం.
బహు భాషల యొక్క సహ సంబంధిత, ఉభయోపయుక్త లేదా ఏకకాలిక బోధన/ అభ్యసనము యొక్క ఒక విశాలమైన అర్థాన్ని అందించడానికి నేను “బహు-భాషావాదం” అనే పదాన్ని అలవరచుకొన్నాను.

మొదటి తరగతి (గ్రేడు లేదా స్టాండర్డ్) నుండి మొదలుకొని భారతదేశం యొక్క మూడు జాతీయ భాషలను (హిందీ, సంస్కృతం మరియు ఉర్దూ), ఒక అంతర్జాతీయ భాషను (ఇంగ్లీష్) మరియు ఒక వ్యావహారిక/ స్థానిక భాషను (తెలుగు, అది నా మాతృభాష కూడా) ఏకకాలములో ఎలా బోధించాలి/ అభ్యసించాలి అనే విషయం గురించి ఈ ప్రతిపాదన రూపొందించడమైనది.
ప్రతి తరగతిలోని మరియు ప్రతి పాఠములోని విషయాంశము లేదా పాఠ్యాంశము అన్ని ఐదు భాషల లోనూ ఒకే మాదిరిగా ఉంటూ మరియు ఐదు భాషలు అన్నింటి ప్రాతినిధ్యాత్మక లేదా ఆవృత అంశాలను చేరి ఉండటం ఈ ప్రతిపాదన యొక్క మూలాధారమై ఉన్నది.

భారతదేశము యొక్క జాతీయ లేదా భాషాపరమైన సమగ్రతను సాధించడానికై ఒక శాస్త్రీయ, రాజకీయేతర, మతేతర, భావజాలయేతర మరియు దేనికీ అనుబంధం లేని పద్ధతిని కనుక్కోవడం పట్ల నా ఆశయము ఈ ప్రతిపాదన వెనుక ప్రధానమైన ధ్యేయముగా ఉండినది.
నేను ఒక అణుసంబంధిత లేదా కణజాల సంబంధిత సమస్యను చూసినట్లుగానే భారతదేశం యొక్క వైవిధ్యమయమైన భాషలను చూశాను మరియు సంపూర్ణంగా దేనికీ అనుబంధము లేని ఒక పరిష్కారాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించాను.
తాత్విక పరమైనది అగుపించకుండానే, ప్రకృతి యొక్క వైవిధ్యము, సాధారణంగా ప్రాణుల వైవిధ్యము మరియు మనుషుల యొక్క వైవిధ్యము మరియు వారి భాషలు మరియు సంస్కృతులలో మూర్తీభవించినట్లుగా వారి మార్గాలు ఎంతో సుందరంగా మరియు మంత్రముగ్ధులను చేసేవిగా ఉన్నాయి.
ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది: అవసరమైనంత మేరకు మనము వైవిధ్యతను వేడుకగా ఎందుకు జరుపుకోలేకున్నాము?
నిజంగా వైవిధ్యమును ఆచరించడానికి, ఇతరులను అర్థం చేసుకోవడమనేది సర్వోత్కృష్టమైనది.
ఇతరుల భాషలను అర్థం చేసుకోవడం అనేది ఆ లక్ష్యం - అంటే ఈ ప్రాజెక్టు దిశగా సాధనావకాశానికి ఒక ధృఢమైన మార్గాన్ని అందజేస్తుంది.

భారతీయ భాష విషయానికి వస్తే, భారతీయులచే ఏ ఒక్క జాతీయ భాష స్వీకరించబడకపోవడం, అదీ స్వాతంత్ర్యం తర్వాత 73 సంవత్సరాలయినప్పటికీ అనేది గుర్తించదగిన విషయం.
అటువంటి అంతులేని అస్పష్టతతో ఉన్న ఈ ప్రశ్నకు ఒక జవాబును కనుక్కోవాలనే నా కోరిక రెండు అంశాలచే ప్రభావితమైంది.
అవి:
అ) నా జీవిత ప్రయాణము, పుట్టి, పెరిగి, ఇండియాలోనే నా మొదటి 30 సంవత్సరాల జీవితాన్ని గడిపి ఉండటం.
ఆ) నా విస్తృతమైన పరిశోధనా నేపధ్యము మరియు వైద్య బోధనా అనుభవాలు — ప్రత్యేకించి మనిషి ఎముక మజ్జ సూక్ష్మవాతావరణ సంబంధిత కణాలు, స్ట్రోమల్ (తోడ్పాటు కణజాల-సంబంధితం) ఫైబ్రోబ్లాస్ట్స్ లేదా కణాలు అనబడే వాటిపై నా పరిశోధనా కృత్యము.
ఈ కణాలు హిమాటోపోయటిక్ (రక్తం-రూపొందు) కాండము లేదా జన్మతః వచ్చే కణాలు లేదా పూర్వగామి కణాలకు మద్దతునిచ్చి వ్యక్తి జీవితకాలమంతటా తెల్లరక్త కణాలు, ఎర్ర రక్త కణాలు మరియు ప్లేట్ లెట్ల వంటి రక్తకణాలు తయారయ్యేలా చేస్తాయి.
ఎముక మజ్జ కణాలు నిర్దిష్ట కణ సంస్కృతి పరిస్థితుల క్రింద వ్యాకోచించినప్పుడు, ఒక ఏకైక బహుళ-విభేదమైన (ఒకే సమయములో బహు కణజాల మార్గాలలోనికి వ్యత్యాసపరచబడిన) మెసెన్చైమాల్ (అనుసంధానిత కణజాల-సంబంధిత) కణమును ఉత్పత్తి చేసినట్లుగానూ, దీర్ఘ-కాలికంగా ఉన్న ప్రముఖ నమ్మకానికి విరుద్ధంగా అవి ఐదు విభిన్న (విడిగా వ్యత్యాసం చేయబడిన) మెసెన్చైమాల్ కణ రకాలను కలిగియున్నట్లుగానూ నేను ఇంతకు మునుపు ముఖ్యమైన అన్వేషణ చేశాను.
నా పని, అదే కణము లోపున బహుళ సమలక్షణ రకాల సహ-ఉనికిని చూపింది (బయటివైపుగా రూపాలు మరియు ఆకారాలు, దాగియున్న జన్యురూపము లేదా జన్యుపరమైన ఆకారం) అది: “అనేక విభిన్నమైన ముఖాలతో ఒక కణము.”
ప్రాపంచికంగా-ధ్వనించే స్ట్రోమల్ ఫైబ్రోబ్లాస్ట్స్ వాస్తవంగా మెసెన్చైమాల్ కాండపు కణాలుగా నిరూపణ అయ్యాయి, అవి శరీరము యొక్క కండర కణాలు, ఎముక కణాలు, క్రొవ్వు కణాలు మొదలైన అనేక అనుసంధానిత కణజాలము పెరగడానికి సంభావ్యతను కలిగి ఉన్నాయి.
ఏ ఘటనలోనైనా, విభిన్న భాషలను అదే మానవ ఆలోచనా ప్రక్రియ యొక్క విభిన్న సమలక్షణ వ్యక్తీకరణలుగా చూడవచ్చు.
నా బహు-భాషావాదం ప్రతిపాదన మరియు నా మునుపటి బహుళ-విభేదిత కాండము-కణము అన్వేషణ మధ్య భావజాలపరమైన సమాంతరభావన నిరూపించబడిందని నేను భావిస్తున్నాను.

ముఖ్యమైనదిగా, నా పయనంలో మరియు నా పరిశోధనా మార్గంలో ఒక భాగంగా, నేను అనేక విశ్లేషణాత్మక నైపుణ్యాలు, పద్ధతులు మరియు సాధారణ విలువ గల ఆలోచనా ప్రక్రియలలో అనుభవజ్ఞుడనయ్యాను, మరియు అది అణుసంబంధిత మరియు కణజీవశాస్త్రమునకు అతీతంగా పొడిగించబడవచ్చు.
అది ఈ భాషా ప్రతిపాదనా భావనకు మరియు సంభావ్యతగా శక్తివంతమైన బోధనోపకరణమైన పదపుస్తక ఉత్పన్నానికి బాటలు వేసింది (తరచుగా అడిగే ప్రశ్నలు 4 క్రింద).
పై విషయాన్ని పేర్కొనడం సముచితంగా ఉంటుందని నేను భావించాను, ఎందుకంటే భారతదేశములో ఉన్న భాష వంటి ఒక సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడానికి నేను అత్యంత అవకాశరహిత వ్యక్తిగా అగుపించవచ్చు, ఐతే ఇంతకు మునుపు ఎప్పుడూ ఎవ్వరూ నడవని మార్గంలో నేను దాన్ని అనుసరించాను.

క్రోడీకరించడానికి గాను, నేను చెప్పదలచుకున్న అతి ముఖ్యమైన, అసలైన మరియు కీలకమైన అంశము ఏమిటంటే, విభిన్న భాషల మధ్య ఒకే మాదిరిగా ఉన్న విషయాంశము, విభిన్న భాషలలో విభిన్న విషయాంశము యొక్క ప్రస్తుత పద్ధతి కంటే ఎక్కువ సమర్థవంతమైనది.
పాఠాలను ఎంచుకోవడానికి మరియు పదపుస్తకం వంటి అనుబంధ విషయ సామగ్రిని ఏర్పరచుకోవడానికి నేను మార్గదర్శక సూత్రాలను కూడా అందజేస్తాను.
యొక్క సమగ్ర వీక్షణను అందిస్తూ, నేను ఈ క్రింది ప్రశ్నల శ్రేణికి జవాబులిస్తాను.

ఎం.ఎల్ పదపుస్తకం (వర్డ్ బుక్) అనే పదం కొత్తది, అయినా, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వంటి ఒక వ్యాప్తి పత్రము సాఫ్ట్ వేర్ లోని వర్క్ బుక్ లాగా అది అనురూపంగా ధ్వనిస్తుంది.
బహు భాషల యొక్క సహ సంబంధిత, ఏకకాలిక లేదా ఒకే సమయములో బోధన/అభ్యసనము అర్థమునిచ్చే పదము అయిన బహు-భాషావాదములో పాఠాలను తీసుకోవడం మరియు/లేదా అభ్యసించడం కొరకు రూపొందించిన పద్ధతిని ఇది స్పష్టంగా ఎత్తి చూపుతుంది.
పదపుస్తకం ఒక పత్రము లోని ఒక వాక్యము యొక్క పదాలను లేదా మొత్తం పత్రమును, అసలు లేదా మూల భాషలో—ఈ ఉదంతములో ఇంగ్లీషులో, ఒక వ్యాప్తిపత్రములో—ఒక ఏకైక వరుసలో, ఒక గడిలో ఒక పదంతో అందజేస్తుంది.
ఆ విధంగా, పదపుస్తకాన్ని రెండు రూపాలుగా ఏర్పరచవచ్చు: ఒక వ్యాప్తి పత్రముపై ఒక్కో వరుసకు ఒక వాక్యము, లేదా ఒక్కో వరుసకు మొత్తం పత్రమూ.
ఈ భావజాలము మరియు దీని ఉపయోగమును ప్రదర్శించుటకు, కేవలం నాలుగు వాక్యాలు మరియు మొత్తం 23 పదాలు ఉన్న ఒక చిన్న పత్రమును తీసుకోండి:

“శుభోదయం. (గుడ్ మార్నింగ్)
వైవిధ్యం మా పరంపర.
ఒకేసారి ఐదు భాషలను నేర్చుకోవడమనేది ఒక శ్రేష్టమైన ఆలోచన.
పొగత్రాగడం వ్యక్తి ఆరోగ్యానికి చెడుపు లేదా హానికరము.”

“ఒక్కో వరుసకు - ఒక వాక్యము” రూపములో, వచనమును వాక్యము తర్వాత వాక్యముగా ఇవ్వండి, భాషలు ఎన్ని ఉంటే అన్ని వరుసల సముదాయముగా — ఈ ఉదంతములో 5—ఒక వరుసను ఖాళీగా వదిలేస్తూ, ఈ క్రింది విధంగా:

వరుస 1 (ఇంగ్లీష్): గుడ్ మార్నింగ్.
వరుస 2 (తెలుగు): శుభోదయం
వరుస 3 (హిందీ):
వరుస 4 (సంస్కృతం):
వరుస 5 (ఉర్దూ):
ఖాళీ
వరుస 7 (ఇంగ్లీష్): వైవిధ్యం మా పరంపర
వరుస 8 (తెలుగు): “వైవిధ్యం మా పరంపర”
వరుస 9 (హిందీ):
వరుస 10 (సంస్కృతం):
వరుస 11 (ఉర్దూ):
ఖాళీ
వరుస 13 (ఇంగ్లీష్): ఒకేసారి ఐదు భాషలను నేర్చుకోవడమనేది ఒక శ్రేష్టమైన ఆలోచన.
వరుస 14 (తెలుగు):
వరుస 15 (హిందీ):
వరుస 16 (సంస్కృతం):
వరుస 17 (ఉర్దూ):
ఖాళీ
వరుస 19 (ఇంగ్లీష్): పొగత్రాగడం వ్యక్తి ఆరోగ్యానికి చెడుపు లేదా హానికరము.”
వరుస 20 (తెలుగు):
వరుస 21 (హిందీ):
వరుస 22 (సంస్కృతం):
వరుస 23 (ఉర్దూ):
ఖాళీ

పదపుస్తకం ఒక శక్తివంతమైన బోధనా సాధనముగా పని చేస్తుంది, ఎందుకంటే:

  1. అది, విస్తృతంగా అందుబాటులో ఉన్న, మరియు వాడకానికి సులువైన వ్యాప్తి పత్రము సాఫ్ట్ వేర్ అయిన ఎక్సెల్ ను చాలా సమర్థవంతమైన తీరులో ఉపయోగిస్తుంది.
  2. ఈ పదజాల పట్టికలు అసలు పత్రము నుండి అన్ని పదాలను కలిగియుండడం మాత్రమే కాకుండా, వ్యాప్తి పత్రము దస్త్రము రూపములో వాక్యనిర్మాణమును కూడా భద్రపరుస్తాయి.
    ఇది, విద్యార్థికి, ఐదు భాషల వ్యాప్తంగా పదము తర్వాత పదమును, మరియు వాక్యము తర్వాత వాక్యమును ప్రక్క ప్రక్కనే ఉంచుకొని తనిఖీ చేసుకోవడానికి వీలు కలిగిస్తుంది.
    ఇది, బహుళ భాషలను మరియు వాటి తులనాత్మక ఏక రూపతను ఒక ప్రోగ్రాముపరమైన శైలిలో ఒకే సమయములో చూసుకుంటూ, ఇంతకు మునుపు సాధ్యము కానటువంటి సహ సంబంధిత అభ్యసనమును సానుకూలపరుస్తుంది.
  3. ఈ పద్ధతిని ఎన్ని భాషలకైనా పొడిగించవచ్చు ― మనిషి కోరుకుంటే ప్రపంచము యొక్క భాషలన్నింటినీ ఒకే సారిగా.
    ఐదు - భాషల బోధన అనేది కేవలం ఒక అంశాన్ని గెంతుకుంటూ ముందుకు తీసుకువెళ్ళడమే.
    పదపుస్తకాలు 20 -30 భాషలను కలిగి ఉండవచ్చు, మరియు 3, 4 లేదా 5 భాషలను ఎంచుకోవాలనుకునే వ్యక్తులు వాటిని మాస్టర్ వర్డ్ బుక్ (బృహత్ పదపుస్తము) నుండి ఎంచుకోవచ్చు మరియు వాటిన తమ పాఠాలుగా ఉపయోగించుకోవడం ప్రారంభించవచ్చు.
  4. విభిన్న ఠావులపై విభిన్న తరగతుల పాఠాలు లేదా పుస్తక అధ్యాయాలను ఉంచవచ్చు, మరియు మొత్తం తరగతి పాఠ్యపుస్తకమును ఒక ఏకైక వ్యాప్తిపత్రపు దస్త్రముగా ఉత్పన్నం చేయవచ్చు.
పదపుస్తకం యొక్క పూర్తి శక్తిని అంచనా వేయడానికై, వేర్వేరు భాషలకు విశిష్టంగా ఉన్న ఏవైనా సమస్యలను పరిగణనలోనికి తీసుకోవడం మరియు వాటి బోధనా శక్తిని పెంపొందించడానికై వాటిని ఎలా వినియోగించుకోవచ్చునో యోచించడం అంతే సమానంగా ముఖ్యము అవుతుంది.

ఉదాహరణకు సంస్కృతం: పదానికి పదం అనువాదములో, అనేక ఇంగ్లీష్ పదాలు ఒక ఏకైక సంస్కృత పదములో కలిసిపోవచ్చు, అలా సంస్కృతం వరుసలో ఖాళీ గడులు మిగిలిపోవచ్చు.
ఉదాహరణకు, ఇంగ్లీష్ లోని “గుడ్ మార్నింగ్” అనే రెండు పదాలను సంస్కృతములో ఒకే ఒక్క పదం “సుప్రభాతం” అని అనువదించబడుతుంది.
అయినప్పటికీ, సాధ్యమైతే ఒక సంయుక్త పదమును భాగాంశాలుగా విడదీయడానికి ఒక తదేక ప్రయత్నము చేయాల్సి ఉంటుంది లేదా ఒకవేళ అనుకుంటే, ఆ భాగాంశాలను వేర్వేరు గడులలోనికి ప్రవేశపెట్టవలసి ఉంటుంది.
ప్రత్యామ్నాయంగా, వచనము అనువదించబడిన అసలు సూచిక లేదా మూల భాషతో సరిపోవడానికి అవసరమైన విధంగా ప్రక్కన ఉన్న గడులను కలిపివేయవచ్చు లేదా విడదీయవచ్చు, తద్వారా లక్ష్యిత భాషలో మామూలు వాక్య నిర్మాణమును పరిరక్షించవచ్చు.
ఈ సమస్య ప్రామాణికమైన వాక్యం-వారీ అనువాదానికి వర్తించదు.

మరొక ఉదాహరణ, ఉర్దూ: ఉర్దూ ఒక ప్రత్యేక సందర్భము ఉత్పన్నం కావడానికి అవకాశం ఇస్తుంది, ఎందుకంటే అది కుడి నుండి ఎడమకు వ్రాయబడుతుంది.
పదానికి-పదం అనువాదములో, విడి ఉర్దూ పదాలు కుడి నుండి ఎడమకు వ్రాయబడతాయి, అయితే, మొదటి వరుసలోని అసలు భాష లేదా మూల భాష (ఇంగ్లీష్) లోని పదాల యొక్క క్రమమును అనుసరిస్తూ ఒక వాక్యం యొక్క పదాలను వ్యాప్తి పత్రము గడులలో ఎడమ నుండి కుడికి వ్రాయాల్సి ఉంటుంది.
ఈ సమస్య ప్రామాణికమైన వాక్యం-వారీ అనువాదానికి వర్తించదు.

పదమునకు- పదము వారీ అనువాదము పదాల స్పష్టత మెరుగుపరచుకోవడానికి శ్రేష్టమైనది, ఐతే, వేర్వేరు భాషలలో ఉన్న పదాల క్రమములోని విభేదము ఈ "పదపుస్తకం” రూపమును కొంత అసహ్యంగా అగుపించేలా చేయవచ్చు.
అయినప్పటికీ, ప్రామాణిక అనువాదముతో పాటుగా ఈ పదపుస్తకము విద్యార్థికి అదనంగా ఒక అనుబంధముగా ఇవ్వబడుతుంది.
పదపుస్తకము అనేది ఒక అధ్యయన సాధనము; అవసరమైనట్లుగా విద్యార్థి భాషల మధ్య వాక్యనిర్మాణ వ్యత్యాసాలను అనుభవించుటకు సహాయపడేలా ఇది రూపొందించబడింది.
ఈ పద్ధతి ద్వారా ఆ వ్యత్యాసాలను ఎత్తి చూపుతుండడం అనేది ఒక ముఖ్యమైన సానుకూలాంశము.
విద్యార్థి ఐదు భాశలలోనూ తులనాత్మకంగా రూపాంతరత్వమును అధ్యయనం చేయబోతారు.
ఇంగ్లీష్ భాషను కలిగియుండే భాషల ఒక సమ్మేళనానికై, పదమునకు పదమును అనుసరిస్తూ ఇతర భాషలతో ఇంగ్లీష్ ను మొదటి వరుసలో ఉపయోగించవచ్చు.
ఇది ఒక కంప్యూటర్ దస్త్రము అయినందున, విద్యార్థి యొక్క సౌకర్యం ప్రకారము మొదటి వరుసగా ఏ భాషను అయినా అమర్చుకోవచ్చు.
ఏ భాష నుండి అయితే మిగిలిన భాషలలోనికి అనువాదం చేయాల్సి ఉందో, ఆ అసలు భాష వచనాన్ని, సూచిక లేదా మూల భాషగా మొదటి వరుసలో ఉంచడం మంచిది.
విద్యార్థులు బహుళ భాషల మధ్య జోక్యమును నిర్వహణ చేయడం లేదా ఏకరూపతలు మరియు భేదాలను వెలికి తీయడం ద్వారా ఘర్షణల గురించి నేర్చుకుంటారు.
ఆ విధంగా, బహు-భాషావాదం అనేది, ప్రత్యేకించి పదపుస్తకం ఉపయోగించి నేర్చుకోవడం విద్యార్థికి ఒక అనిర్వచనీయమైన అనుభూతి అవుతుంది.

ఆఖరుగా, ఎక్సెల్ వంటి వ్యాప్తి పత్రాలు అనేకమైన అంతర్నిర్మితంగా మాట్లాడగదిన వచనాలను కలిగి ఉంటాయి, మాట్లాడే గడులతో సహా.
విద్యార్థి ఒక బటన్ క్లిక్ చేసి మరియు వ్యాప్తి పత్రాలలోని విషయాంశమును బిగ్గరగా చదవడానికి వీలుగా ఈ అనుకూలీకృత ఐచ్ఛికాన్ని సక్రియపరచవచ్చు.
ప్రత్యామ్నాయంగా, ఈ అన్ని ఐదు భాషలకూ వచనం- నుండి- పలుకు (మాట) పనివిధానమును చేరుస్తూ కొత్త, ప్రత్యేకితం చేయబడిన సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేయవచ్చు.
తత్ఫలితంగా, బహు భాషలను ఒకే సమయములో బోధించుటకు/నేర్చుకొనుటకు పదపుస్తకం ఒక విలువైన విద్యాసంబంధిత సాధనముగా మారాలని ఆశించబడుతోంది.

ప్రతి పత్రము—పత్రము1, “సందేశము”; పత్రము2, “విషయాంశము, పాఠ్యాంశములు మరియు బోధనా ప్రణాళిక”; పత్రము4, “తరచుగా అడిగే ప్రశ్నలు మరియు జవాబులు”, “మొదటగా నన్ను చదవండి” మరియు “చివరగా నన్ను చదవండి-తర్వాత ఏమిటి?”; మరియు “మాదిరి పాఠము 1 భారతదేశము యొక్క జాతీయ చిహ్నములు” - వ్యాప్తి పత్రము యొక్క ప్రత్యేక ఠావుపై సమర్పించబడ్డాయి.
ఒక పుస్తకం యొక్క అధ్యాయాలుగా తెలియజేసే ఉదాహరణలుగా ఇక్కడ ఉపయోగించబడిన ఈ పత్రాలు, ప్రతి అధ్యాయము యొక్క అనువాదము ఒక ఠావు గా మరియు ప్రతి పుస్తకం ఒక వ్యాప్తి పత్రము దస్త్రము గా అందించేలా ఇవ్వబడ్డాయి.
పదపుస్తకమును సాంప్రదాయమైన ముద్రిత పుస్తక రూపములో కూడా ముద్రించవచ్చు.
మొత్తం మీద, బహు భాషలను నేర్చుకోవడానికై ఒక తులనాత్మక విశ్లేషణా సాధనముగా పనికి వచ్చే విధంగా పదపుస్తకమును రూపొందించడమైనది.

పదపుస్తకం యొక్క పనివిధానమును ప్రదర్శించు ఉద్దేశ్యముతో, వెబ్‌సైట్ లో భాగంగా వివిధ పదపుస్తకాలు అందజేయబడ్డాయి.
పైన వివరించినట్లుగా అన్ని పత్రాలూ “వరుసకు-ఒక-వాక్యము” రూపములో ఉన్నాయి.

ఆ పదపుస్తకాలు ఇవి:

“ఒక వరుసలో-మొత్తం-పత్రము అంతా” రూపములో, ఒకవేళ అనుకుంటే, ఎవరైనా మొత్తం పత్రమునూ ఒకే ఒక్క వరుసలో సమర్పించవచ్చు.
ఆ తర్వాత తదుపరి నాలుగు వరుసలూ - ఒక్కొక్కటి ఒక్కొక్క భాషకు సంబంధించినదిగా ఉపయోగించుకోవచ్చు: తెలుగు, హిందీ, ఉర్దూ మరియు సంస్కృతం — ఇంగ్లీష్ నుండి పదం-వారీగా ఖచ్చితమైన అనువాదమును చూపించుటకు.
చదువుకోవడానికి సులువుగా ఉండేలా ప్రక్కన ఉండే వాక్యాల పదముల యొక్క కాలమ్ లకు ప్రత్యామ్నాయ రంగులు ఇవ్వవచ్చు.

ముగింపులో: వాక్యము వారీగా అనువాదము ఇమిడి ఉండే పద పత్రమును సువర్ణ ప్రమాణముగా పరిగణనలోనికి తీసుకోండి, ఎందుకంటే అందులో ఉపయోగించబడిన పదము ఏదైనా సరే అది అనువాదకుడి అభిప్రాయములో అత్యుత్తమ సందర్భోచితంగా ప్రయోగించబడింది.
అదేవిధంగా ఎక్సెల్ పదపుస్తకము సైతమూ సాధ్యమైనంతవరకూ దానినే ప్రతిబింబించాలి.
సాధ్యమైనంత వరకూ ప్రామాణిక అనువాదము నుండి వాస్తవ పదాలు/పద రూపాలను సంబంధిత ఎక్సెల్ గడులలోనికి ఎక్కువభాగం బదిలీ చేయడం/సంగ్రహించడం ద్వారా పదపుస్తకము రూపొందించబడింది.

ఇవ్వబడిన ఒక పదానికి, ఉదాహరణకు, 10 విభిన్న పర్యాయపదాలు ఉండవచ్చు, మరియు తత్ఫలితంగా ఒకరు 10 విభిన్న ఎక్సెల్ సరళి (తరహా) లను ఉత్పన్నం చేయవచ్చు.
అయినప్పటికీ, 10 పర్యాయపదాలలో ఒకటి మాత్రమే – సందర్భానికి అత్యంత సముచితమైనది – ప్రామాణిక అనువాదము కొరకు ఎంచుకోబడింది.
నేర్చుకొను అభ్యాసము ఐదు విభిన్న భాషల ఎదురు బదురుగా ఉండి ఒక తులనాత్మకతను ఇమిడి ఉంటుంది – ఇవ్వబడిన భాషలోనే విభిన్న పర్యాయపదాల వ్యాప్తంగా కాదు.
ఎక్సెల్ సరళిలో పర్యాయపదాల యొక్క వాడకము, ఏదైనా స్పష్టత ఆవశ్యకత కొరకు తప్ప, కలవరానికి గురి చేయవచ్చు కావున దానిని జాగ్రత్తగా నివారించడమైనది.
ఒకవేళ తమకు అవసరమని భావించినచో, పాఠకుడు/విద్యార్థి పర్యాయపదాల కొరకు ఒక పదాన్ని నిఘంటువు/పర్యాయపదకోశములో చూడవచ్చు.
పదపుస్తకము అనేది ఒక పుస్తకము/పత్రమునకు నిర్దిష్టమైనది.

ఏవేని రెండు మానవ భాషల మధ్య ఒకదాని నుండి మరొకదానికి ఖచ్చితంగా పొసగడం అనేది ఉండదనే విషయం బాగా సుపరిచితమైనది.
ఐదు విభిన్న భాషలలో ఇవ్వబడిన ఒక అర్థానికి పదాలు లేదా వాక్యాంశాల కొరకు వెతకడాన్ని ఎక్సెల్ పదపుస్తకము గొప్పగా సానుకూలపరుస్తుంది మరియు వాక్యము స్థాయిలో అభ్యసనాన్ని పెంపొందిస్తుంది.
అది వాక్యము స్థాయిలో చూస్తే సిద్ధంగా నిరూపణ లేని రీతిలో ఐదు భాషల వ్యాప్తంగా పదము స్థాయిలో ప్రశ్నాత్మక సంబంధమును లేదా సంబంధ లోపమును చూపుతుంది.
ఇది ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకు వ్రాయబడే ఐదు భాషలు మరియు నాలుగు విభిన్న లిపుల మిశ్రమమును ఇమిడి ఉంటుంది కాబట్టి ఇది ప్రత్యేకించి కఠినతరమైనది.
పదపుస్తకమును తనిఖీ చేయడం ద్వారా, ఇవ్వబడిన ఒక అర్థాన్ని ఒకటి, రెండు, మూడు, నాలుగు లేదా ఐదు భాషలు అన్నింటిలోనూ, క్షీణించే సంభావ్యతలో సైతమూ అదేవిధంగా లేదా అటువంటి పదాల ద్వారా వ్యక్తీకరించవచ్చునని పాఠకుడు/విద్యార్థి తక్షణమే గ్రహించగలుగుతారు.
అదీ, చెప్పబడినట్లుగా బహు-భాషావాదం (ఎం.ఎల్) పదపుస్తకము యొక్క కార్యవిధానము.
అది ఒక శక్తివంతమైన అధ్యయన సాధనము.

నేను ఏకీభవిస్తాను.
ఈ ఆలోచనను చాలా ఎక్కువగా స్వీకరిస్తాను, ఎందుకంటే, పైన పేర్కొన్నట్లుగా, సమాచారవినిమయ విధానము మరియు నా ప్రతిపాదన ఈ రెండూ ఖచ్చితంగా పరస్పరం అనుకూలమైనవి మరియు ఒకదానిని మరొకటి ప్రోత్సహించుకుంటాయి.
నా ప్రతిపాదన ఏకరూపత (ప్రముఖంగా పదజాలము మరియు వాక్య నిర్మాణము) పై దృష్టి సారించడమనేది సహజమే, ఐతే దానిని ఎంతో అందంగా సమాచార వినిమయ విధానముతో కలుపవచ్చు, అందుకోసమే నేను ఈ ప్రశ్నలు మరియు జవాబుల ద్వారా కృషి చేశాను.
నా ప్రతిపాదిత విధానము, వచనం నుండి స్వరము మరియు దృశ్య శ్రవణ సాధనాల వంటి సాంకేతికతలను పొందడమే కాకుండా ఒక బడి నాటికలో బహుభాషా వాదం నాటకాన్ని పోషించేలా, మరియు ఏది ఏమైనప్పటికీ అనధికారికంగానైనా, ప్రముఖ బాలీవుడ్/ టాలీవుడ్ గాన-మరియు-నృత్యము నుండి ఏకకాలములో బహుళ భాషలను బోధించడం కూడా ఉండాలని ముందుకు సాగేలా సలహా ఇస్తుంది.

అవి అనేకం:

  • సాంస్కృతిక సంబంధాలను నెలకొల్పుతుంది, ఎందుకంటే ప్రతి భాష దాని సాంస్కృతిక విలువలను కలిగి ఉంటుంది.
  • ఇతరుల పట్ల సహనము, పౌరన్యాయము మరియు గౌరవాన్ని పెంపొందిస్తుంది.
  • విద్యార్థుల ఆలోచనా శక్తి యొక్క విస్తృతి మరియు లోతుకు జోడింపునిస్తుంది.
  • ఆల్జీమర్స్ వ్యాధి (వయస్సు పెరిగే కొద్దీ వ్యక్తి యొక్క జ్ఞాపకశక్తి మరియు ఆలోచనా నైపుణ్యాలను క్రమేపీ తగ్గించివేసే మెదడు రుగ్మత) రాకడను ఆలస్యం చేస్తుంది.
  • వ్యక్తి ఎన్ని ఎక్కువ భాషలను తెలుసుకుంటే, దాని తదనంతరము ఆ జ్ఞానము, భవిష్యత్ వయోవృద్ధులు తప్పించుకోలేని ఆల్జీమర్స్ వ్యాధికి వ్యతిరేకంగా ఒక బీమా రూపము వలె సమర్థవంతంగా పని చేస్తుంది.
  • అందువల్ల, బహు భాషలను నేర్చుకోవడమనేది వ్యక్తికి స్వంత ప్రయోజనంగా ఉంటుంది.
  • చిన్నారిని సామాజికంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, మేధాపరంగా మరియు అంతిమంగా వృత్తినైపుణ్యపరంగా సాధికారపరుస్తుంది.
  • ఇది, పౌరులందరికీ సమానావకాశాలను కల్పిస్తుంది.
  • ప్రాథమికంగా చిన్నారికి ప్రయోజనం కలిగిస్తుంది; ద్వితీయంగా దేశము మరియు ప్రపంచానికి ప్రయోజనం కలిగిస్తుంది.
  • పక్షపాత రాజకీయాలు, ప్రాంతీయతత్వము మరియు మతాల నుండి స్వేచ్ఛగా ఉంటూ మరియు వాటిమీద, అవి ఉన్నది ఉన్నట్లుగా గుర్తించడానికి మరియు పర్యవసానంగా అధ్యయనం చెయగలగడానికి ఒక సంపూర్ణమైన అనువైన చోటును కల్పిస్తుంది.
  • మొత్తం మీద, వ్యక్తిగత ఆనందము, పరస్పర సామరస్యము మరియు ప్రపంచ శాంతిని పెంపొందిస్తుంది.
  • ద్వితీయ భాషా-సముపార్జన (ఎస్.ఎల్.ఎ) గురించి పుష్కలమైన పరిశోధనా సాహిత్యము ఉండగా, వాటిపై చర్చ ఈ ప్రశ్నలు మరియు జవాబుల రూపము యొక్క అవకాశమునకు అతీతమైనదిగా ఉంటుంది.
  • అయినప్పటికీ, ఒక సూచికను ఉదహరించాలంటే: ప్రవర్తనాత్మక మరియు మెదడు పనివిధానాలలో తటస్థ నిర్మాణ శాస్త్రము కొరకు బహుభాషితం యొక్క పర్యవసానాలుశ్రీ ఎస్. హయాకావా మరియు వి. మరియ చే2019 మార్చ్ 25;15(1):6. doi: 10.1186/s12993-019-0157-z.
  • కనబరచాలంటే ఆశాజనకమైన ఒక రాబోవు పుస్తకము: భాషలు మీ కోసం మంచివి – సోఫీ హార్డాచ్ గారిచే, అక్టోబర్ 1, 2020 https://headofzeus.com/books/9781789543926

ఇది చేతి చమత్కారము కాదు.
నేను పెద్ద చిత్రం లోపల దాన్ని చూసినట్లుగానే నేను పిలుస్తున్నాను.
నా “సందేశము” యొక్క వ్యాఖ్యానములో ఈ సున్నితత్వాలను నేను గుర్తిస్తాను.
అయినప్పటికీ అది ఎంత సున్నితమైనదీ లేదా మర్మమైనదీ కావచ్చు గాక, అది ఒక సత్యము.
ఒక నిష్పక్షపాత పరిశీలకుడికి, హిందీ, ఉర్దూ మరియు సంస్కృతం ఈ మూడు భాషలూ, వాటి విస్తృతి మరియు భౌగోళికంగా అవి పెనవేసుకుపోయిన విషయంలో వాటి స్థాయి ఆధారంగా మరియు/లేదా ఇతర వ్యావహారిక/ స్థానిక భాషలకు ఒక పునాదిగా, ఒక జాతీయభాషగా అర్హత పొందుతాయి.
భారతదేశ సందర్భములో “జాతీయము” ను పేర్కొనే ఒక మార్గం, భారతదేశ వ్యాప్త భారతీయుడిగా ఉంటేనే.
ఈ మూడు భాషలు అన్నీ భారతదేశ వ్యాప్త భారతీయుడిగా అర్హతనిస్తాయి; హిందీ మరియు ఉర్దూను అనేక విభిన్న రాష్ట్రాలలో మాట్లాడతారు, మరియు సంస్కృత భాష హిందీ అదే విధంగా ఇతర అనేక రాష్ట్ర భాషలకు పునాది వంటిది.

ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష అయినప్పటికీ, ఒక సమగ్రతా భావనను అందజేస్తూ, మాదిరి పుస్తకాల ముఖపుటలపై ప్రదర్శించినట్లుగా నేను చాలా ఎక్కువగా దానిని “మన భాషలు” లో ఒకటిగా పేర్కొంటున్నాను.
ఇంగ్లీష్ ని నేను ఒక “ విదేశీ” భాష అని పేర్కొనలేదు అని గమనించండి.
వాస్తవానికి, నా సందేశములో, శబ్దవ్యుత్పత్తిలో మాత్రమే కాకుండా ధ్వని ఉచ్ఛారణలలో సైతమూ, భారత-ఐరోపా కుటుంబములో భాగంగా నేను భారతీయ భాషలతో దానికి గల సంబంధబాంధవ్యాన్ని రాబట్టగలిగాను.

సంపూర్ణత్వ ఆవశ్యకత కొరకు, “జాతీయ భాష,” “అంతర్జాతీయ భాష,” “మాతృ భాష,” “ప్రథమ భాష,” “జన్మతః భాష,” “ఇంటివాడుక భాష,” “ద్వితీయ భాష,” “అధికార భాష,” లేదా “సమాచార వినిమయ భాష” వంటి ఒక సంపూర్ణ ఆతిథ్య పదజాలమును తీసుకోండి.
ఈ పదాలు చాలా విస్తృతమైనవీ మరియు ఇప్పటికీ పరిశోధకుల మధ్య చర్చించబడుతూ ఉన్నాయి.
ప్రతి పండితుడు మరియు /లేదా దేశం వారి సామాజిక - రాజకీయ సందర్భానుసారంగా నిర్వచనాలలో ఒకదానిని ఉపయోగిస్తూ ఉంటారు.
ముఖ్యంగా, ఒక భాషకు ఒక వ్యక్తి ఇచ్చే బిరుదులతో సంబంధం లేకుండా, నా ప్రతిపాదిత పద్ధతి బిరుదును విస్మరించేది మరియు ఏవైనా లేదా అన్ని భాషలు - 2, లేదా 22, లేదా అంతకు మించిన భాషల సమ్మేళనానికి వర్తిస్తుంది.
మీకు ఏవి అవసరమవుతాయో లేదా వేటిని నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ భాషలను ఎంచుకోండి మరియు ఏ పేర్లతోనైనా వాటిని పిలవండి.

పైన చెప్పిన అన్ని విషయాలతోనూ నేను అంగీకరిస్తున్నాను.
ఐతే నేడు ప్రపంచం ఒక చిన్న గ్రామమైంది, మరియు భారతదేశం అందులో ఒక పెద్ద వీధి.
అందుకనే ఇంగ్లీష్ మరే ఇతర హోదా కంటే కూడా ఒక అంతర్జాతీయ భాషగా లేదా ప్రపంచ భాషగా ఎక్కువగా పేర్కొనబడుతోంది.
అదీ నా అభిప్రాయం.

నేను భిన్నంగా ఆలోచిస్తాను.
ప్రస్తుతం దైనందిన సమాచార వినిమయములో, కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లా శివమొగ్గ నగరం సమీపాన గల మత్తూరు గ్రామములో తప్ప, దేశములో మరెక్కడా ఉపయోగించబడకపోయినప్పటికీ, అనేక భారతీయ భాషలకు సంస్కృతం ఒక పునాది భాష (మాతృక) అనే విషయం అందరికీ సుపరిచితమే.
ఆసక్తికరంగా, అలా చేసిన ఏకైన రాష్ట్రం అది ఒక్కటే అయినప్పటికీ, ఉత్తరాఖండ్ రాష్ట్రము కూడా సంస్కృత భాషను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యముతో, దానికి ద్వితీయ అధికార భాష హోదాను కల్పించింది.
అంతే సమానంగా అత్యంత ఆనందదాయకమైన వార్త ఏమిటంటే: https://www.hindustantimes.com/art-and-culture/sanskrit-india-s-ancient-language-making-gradual-comeback-in-kerala-s-karamana-village/story-q3jlJzYHgJJS1ks0nlWfCJ.html

సంస్కృతమును చేర్చడంలో నా కారణాలు రెండు విధాలుగా ఉన్నాయి:

అ) సంస్కృతములో ఒక కోర్సును కలిగి ఉండడం, తర్కములో ఒక కోర్సు కలిగియున్నదానితో సమానం.
ఆ) సంస్కృతం కేవలం ఒక భాష, అంతేకానీ ఒక హిందూ భాష కాదు.
అదే విధంగానే, ఉర్దూ కేవలం ఒక భాష, అంతేకానీ ఒక ముస్లిం భాష కాదు.
అదే మాదిరిగా, ఇంగ్లీష్ కేవలం ఒక భాష; ఎవరైతే దాన్ని నేర్చుకుంటారో వాళ్ళు ఆర్జిస్తారు.
మనం జాతీయ సమగ్రతను కోరుకోవాలంటే. ప్రాంతమును మరియు భాషను విడదీసి చూడాలి.
ఒక హిందూ చిన్నారి అనర్గళంగా ఉర్దూలో మాట్లాడుతున్న మరియు ఒక ముస్లిం చిన్నారి అనర్గళంగా సంస్కృతములో మాట్లాడుతున్న సంభాషణాత్మక దృశ్యం చిత్రించండి
అది సామెతల దేవుడిని చూసినట్లుగా అనిపిస్తుంది.
నేనొక నాస్తికుణ్ణి, అయితే అది నన్ను ఆస్తిక ఉపమానాల వినియోగము నుండి దూరంగా ఉంచదు.
భారత జాతీయ సమగ్రతను సాధించుటలో, సంస్కృతము మరియు ఉర్దూ భాషలు రెండింటినీ కలిపి బోధించడం/ నేర్చుకోవడం యొక్క ప్రభావము నిరుపమానమైనది.
పది సంవత్సరాల పాటు సంస్కృతమును నేర్చుకోవడం యొక్క ప్రయోజనము, ఒక పొరుగు రాష్ట్రము యొక్క మరియొక ప్రస్తుత భాషను నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాన్ని అధిగమిస్తుంది.
పైపెచ్చు, రాష్ట్ర సరిహద్దుల వ్యాప్తంగా ప్రజలు, వారి ప్రభుత్వాల నిర్వహణతో సంబంధం లేకుండా రెండు రాష్ట్రాల యొక్క భాషలను ఎలాగూ మాట్లాడుతూనే ఉంటారు.

బహుశః ఈ ప్రశ్నకు అత్యుత్తమ సమాధానముగా నేను, వరిష్ట సాహిత్య విమర్శకులు కులదీప్ కుమార్ గారిచే హిందీ దినపత్రిక (డిసెంబర్ 14/15, 2017) లో ప్రచురించబడిన ఒక వ్యాసమును నేరుగా ఉటంకించగలను.
ఉటంకించడానికి, “1800 సంవత్సరములో స్థాపించిన హిందీ/హైందవి/హిందూస్థానీ గృహము కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా) లోని ఫోర్ట్ విలియం కళాశాలలో విభజించబడింది మరియు అక్కడ ఒక శస్త్రచికిత్సా నిపుణుడు మరియు సంచార భాషాభిమాని అయిన జాన్ బోర్త్‌విక్ గిల్‌క్రిస్ట్ హిందూస్థానీ ఆచార్యుడుగా నియమించబడ్డారు.
కళాశాల సిబ్బందిలో ముగ్గురు భారతీయ పండితులు ఉండేవారు―సాదల్ మిశ్రా, ఇన్షా అల్లా ఖాన్ మరియు లల్లూజీ లాల్―వీరు మూడు పనులను ఉత్పత్తి చేశారు మరియు మనకు ఇప్పుడు ఉర్దూ మరియు హిందీగా తెలిసియున్న హిందూస్థానీ యొక్క రెండు రిజిస్టర్లను లేదా శైలులను రూపకల్పన చేయుటలో అత్యంత ప్రముఖమైన పాత్రను పోషించారు.
లల్లూజీ లాల్ మాట్లాడే హిందూస్థానీ నుండి వ్యావహారిక అదే విధంగా పర్షియన్ మరియు అరబిక్ పదాలను ఏరివేసి ఆధునికంగా సంస్కృతీకరించబడిన హిందీని కనుగొన్నారు, కాగా ఇన్షా మిశ్రమ భాషలో వ్రాశారు.
సంస్కృతీకరించబడిన హిందీని హిందువులతో గుర్తించింది ఫోర్ట్ విలియం కళాశాలలోనే, కాగా, పార్శీ-
అరబిక్ యొక్క పదాలను ఉపయోగించిన మరొక రిజిస్టర్ మహమ్మదీయులతో గుర్తించబడింది.”

రెండు శతాబ్దాల అనంతరం వెనక్కి తిరిగి చూస్తే, హిందుస్థానీ భాషను హిందీ మరియు ఉర్దూ లోనికి విభజించడానికి ఒక శస్త్రచికిత్సా నిపుణుడు ఆధ్వర్యం వహించాడంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
కాకతాళీయంగా, నేను ఉస్మానియా వైద్య కళాశాల నుండి పట్టా పొందిన ఒక వైద్యుడిని, యేల్-లో శిక్షణ పొందిన రోగ నిర్ధారక శాస్త్రవేత్తను, జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్.ఐ.హెచ్) చే నిధులివ్వబడిన జీవవైద్య పరిశోధనా అన్వేషకుడిని, మరియు అదే విధంగా వినూత్నమైన బహు-భాషావాదం ప్రతిపాదన రూపకల్పనచే ఆ విభజనను వెనక్కి మళ్ళించడానికి లేదా తగ్గించడానికి కృషి చేస్తున్న ఒక అసంభవ వ్యక్తిని.

సంబంధిత భాషలలోని జంటల పైకీ, హిందీ మరియు ఉర్దూ మధ్య సంబంధబాంధవ్యము విశిష్టమైనది, ఎందుకంటే అవి పుట్టిన లేదా సృష్టించబడిన విధానము అటువంటిది అనేది గమనించదగ్గ విషయము.
అవి పునాది వద్ద సంపూర్ణంగా సమ్మతించుకుంటాయి ఐతే పైన విభేదించుకుంటాయి- తెలుగు మరియు కన్నడ వంటి ఇతర సంబంధిత భాషల జంటకు పూర్తిగా వ్యతిరేకంగా.
హిందీ మరియు ఉర్దూ ఉన్నత-క్రమం పదకోశములో, హిందీని సంస్కృతం నుండి అరువు తెచ్చుకోవడం మరియు ఉర్దూను పార్శీ-అరబిక్ నుండి అరువు తెచ్చుకోవడంతో విభేదించుకుంటాయి.
మరోవైపున, తెలుగు మరియు కన్నడ పునాదిస్థాయి పదకోశములో విభేదించుకుంటాయి, ఐతే ఉన్నత క్రమం పదకోశములో దాదాపుగా సన్నిహితమైన పోలికను కలిగి ఉంటాయి రెండూ కూడా ఒకే మూలము: సంస్కృతం నుండి అరువు తెచ్చుకోబడినందువల్ల.
అలా, తెలుగు మరియు కన్నడ కలుస్తాయి (ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ లాగా), కాగా హిందీ మరియు ఉర్దూ విడిపోతాయి (ప్రసాద్ మరియు విర్క్ గారి సూచిక చూడండి).

మొత్తంగా చూస్తే, హిందీతో పాటుగా ఉర్దూ (మరియు సంస్కృతం సైతమూ), భారతదేశము యొక్క అత్యంత ఆవశ్యక జాతీయ భాష.
హిందీ మరియు ఉర్దూ భాషలను, వేర్వేరు లిపిలతో ప్రారంభమయ్యే, వేర్వేరు కుటుంబాలకు దత్తత ఇవ్వబడిన, మరియు వేర్వేరుగా వస్త్రధారణ అలవాటు చేసిన, ఒకే పోలిక కలిగియున్న ఇద్దరు కవల సోదరీమణులతో పోల్చవచ్చు.
మామూలు సంభాషణల్లో అనేకమైన సామాన్య పదాలు ఈ రెండు భాషల మధ్య వాడబడుతున్నప్పటికీ, రెండు భాషలూ జన్మతః సంబంధము కలిగియున్నాయనే విషయం విస్తృతంగా తెలియదనేది నిర్వివాదమైన అంశము; ఈ సంబంధము భారతదేశం యొక్క దైనందిన పౌరులచే సమ్మతించబడలేదు, హిందువులు మరియు మహమ్మదీయుల లాగానే.
ఈ ప్రాథమిక భాషా చరిత్రను తెలుసుకోవడం మరియు మన భాషల అనుసంధానతను గుర్తుంచుకోవడం మరియు నిక్షిప్తం చేసుకోవడం కొత్త తరాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఒక రాజకీయేతర, మతేతర మరియు అనుబందించని ఆలోచనావేత్తకు, హిందీ మరియు ఉర్దూ మధ్య ఏదేని విభేదము కృత్రిమము, దురదృష్టకరము మరియు నిస్సహాయమైనదిగా అనిపిస్తుంది.

సూచికలు:

కుల్‌దీప్ కుమార్. రేఖతాను అర్థం చేసుకొనుట: హిందీ, హైందవి, రేఖతా మరియు ఉర్దూ అనేవి ఒకే భాషాత్మక, సాహిత్య మరియు సాంస్కృతిక పరంపరకు వేర్వేరు నామములా? ది హిందూ డిసెంబర్ 14/15, 2017.

కె.వి.ఎస్. ప్రసాద్ మరియు షఫ్ఖాత్ ముంతాజ్ విర్క్. హిందీ మరియు ఉర్దూ ఒకే వ్యాకరణమును పంచుకుంటాయి కానీ పదకోశమును కాదు అనేది గణన సంబంధిత నిరూపణ.
దక్షిణ మరియు ఆగ్నేయాసియా సహజ భాషా ప్రక్రియ విధానం (ఎస్.ఎ.ఎన్.ఎల్.పి) పై 3 వ కార్యశాల యొక్క అధికారిక కార్యకలాపాలు, పేజీలు 1–14, కోలింగ్ 2012, ముంబై, డిసెంబర్ 2012.

అమృత్ రాయ్. ఒక ఇల్లు విభజించబడింది: హిందీ /హైందవి యొక్క పుట్టుక మరియు అభివృద్ధి. 320 పిపి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 1985.

క్రిస్టఫర్ ఆర్. కింగ్ . ఒక భాష, రెండి లిపిలు: ఉత్తరభారతదేశములో పంతొమ్మిదవ శతాబ్దపు హిందీ ఉద్యమము. 232 పిపి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 1994.

బహు-భాషావాదం యొక్క ఉద్దేశ్యము కొరకు రూపొందించబడిన పద్ధతి స్వాభావికంగా “గణిత సంబంధిత” లేదా “బీజగణిత సంబంధితమైనది”, దాని మూలం శాస్త్రీయమైనది, మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను నేర్పుతుంది.
ఆ ప్రభావం వరకూ, పదపుస్తకం అభివృద్ధిపరచబడింది.
విద్యార్థి ఒకే సమయములో ఒకే పాఠ్యాంశాన్ని/పాఠాన్ని ప్రతి తరగతిలోనూ ఐదు విభిన్న భాషల బహిర్గతానికి మరియు అభ్యసనానికి గురి చేయబడతారు.
పాఠ్యాంశము ఒకే మాదిరిగా ఉన్నందువల్ల, ఐదు భాషలలో సైతమూ, సమాచారము యొక్క బహుముఖత్వం గొప్పగా తగ్గుతుంది, మరియు అది విద్యార్థులకు అతి భారము కానేరదు.
50 సంవత్సరాల పూర్వం నుండి ఉంటున్న ప్రస్తుత వ్యవస్థలో లాగా సంబంధించని పాఠ్యాంశాలను మూడు భాషలలో నేర్చుకోవడం కంటే, భాషల యొక్క అటువంటి తులనాత్మక/సహసంబంధిత అభ్యసనము, సామాన్యంగా దానిని సులువైనదిగా, మరింత ఆసక్తిదాయకంగా మరియు మరింత శక్తివంతంగా చేయవచ్చునని నా అంచనా.
అందులో వైవిధ్యమైన స్థాయిల వరకూ సామాన్య మూలాలు లేదా పదజాలములు, వ్యాకరణము మరియు ధ్వని ఉచ్ఛారణల స్పష్టమైన పంపకం ఉంది.
మన భాషల అనుసంధానతను మనం నేర్చుకోవడం చాలా ముఖ్యము.
చిన్నపిల్లలు మరియు వికసిస్తున్న మనస్సులకు ఈ అనుసంధానతలను చూడడం మరియు మొదట్లోనే సహసంబంధిత ఆలోచనా విధానాన్ని అలవరచుకోవడం అత్యంత ఆసక్తిదాయకంగా ఉండవచ్చునని నేను నమ్ముతున్నాను.
అలాగే, "బహుళ భాషలు నేర్చుకోవడం వల్ల ఏయే ప్రయోజనాలు ఉన్నాయి?” అనే ప్రశ్నకు జవాబును కూడా చూడండి.

నా ప్రతిపాదనలో ఐదు భాషలు ఇమిడియున్నప్పటికీ, పైన కనబరచిన విధంగా, సమాచారము యొక్క పరిమాణ విస్తృతి ఈ ప్రతిపాదిత పద్ధతి ద్వారా చాలావరకూ తగ్గించబడింది.
ఐదు భాషలను విడిగా ఒక్కక్కటిగా నేర్చుకోవడం కంటే వాటిని సహ-సంబంధితంగా కలిపి నేర్చుకోవడం సులభంగానూ మరియు సమర్థవంతంగానూ ఉంటుందని నా అంచనా.
ఈ దిగువ కనబరచిన ఈ కారణాలు మరియు ఇతర సూచికల రీత్యా, చిన్నారికి ఇది మరింత భారం కాబోదనేదే ఈ ప్రశ్నకు నా జవాబు.

చిన్నపిల్లల మెదడు యొక్క అభ్యసన సామర్థ్యము గురించి మోంటిస్సోరీ పద్ధతి యొక్క వ్యవస్థాపకురాలు డా. మరియా మోంటిస్సోరీ గారు ఈ క్రింది విధంగా చాలా చక్కగా వివరించారు, “పిల్లలు పుట్టినప్పటి నుండి ఆరు సంవత్సరాల వరకు గ్రహణశక్తి గల మెదడు, తమ వాతావరణము లోపున సమర్థతను సాధించడానికి మరియు ఖచ్చితమైన నైపుణ్యాలు మరియు అవగాహనలకు అంతులేని ప్రేరణను కలిగి ఉంటుంది.”
ఆరు సంవత్సరాల వయసు లోపు పిల్లలు ఒక భాషకంటే ఎక్కువగా శ్రమ లేకుండా మరియు ఆనందంగా గ్రహించగలరని కూడా గుర్తించబడింది.
ఇంకా, 18 సంవత్సరాల వయస్సు వరకూ కొత్త భాషను నేర్చుకునే సామర్థ్యము అత్యధికంగా ఉంటుందనీ, ఆ తర్వాత అది తగ్గిపోతుందనీ, మరియు అనర్గళమైన అభ్యసనము 10 సంవత్సరాల లోపు వయస్సు నుండే మొదలు కావాలనీ ఇటీవలి అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఇది పురాతన కాలం నుండీ గణనీయమైన సంవాదము మరియు చర్చతో నింపబడినట్టి విషయాంశము.

సూచికలు:

ఒక బిడ్డను మీరు ఎంత త్వరితంగా ఒక ద్వితీయ భాషకు బహిర్గతం చేస్తే, వాళ్ళు అంత చక్కగా ఉంటారు, లౌరీ వాజ్‌క్వెజ్ గారిచే, https://bigthink.com/laurie-vazquez/the-sooner-you-expose-a-baby-to-a-second-language-the-smarter-theyll-be ఏప్రిల్ 8, 2016.

జన్మతః వక్త లాగా ఒక కొత్త భాషను నేర్చుకోగలిగే మన సామర్థ్యము ఏ వయస్సులో అదృశ్యమవుతుంది?సైంటిఫిక్ అమెరికన్ మే 4, 2018 లో డి.జి.స్మిత్ చే.
ఈ నివేదిక ప్రకారము, “సాంప్రదాయ పరిజ్ఞానము ఎంత ఉన్నప్పటికీ, అది యువతలోనికి బాగా వెళ్ళేవరకూ ఒక ద్వితీయ భాషలో సూక్ష్మబేధాలు వెతకడం సమసిపోదు” అని ఒక కొత్త అధ్యయనము చూపుతోంది.”

ఒక భాషను నేర్చుకోవడానికి అత్యుత్తమమైన వయసు ఏది? సూఫీ హార్డాచ్ గారిచే,
https://www.bbc.com/future/article/20181024-the-best-age-to-learn-a-foreign-language అక్టోబర్ 25, 2018.
ఈ నివేదిక ప్రకారము, “ఒక విదేశీ భాషను నేర్చుకోవాల్సివచ్చినప్పుడు, పిల్లలైతే అత్యంత చక్కగా అలవరచుకుంటారని మనము అనుకుంటూ ఉంటాము.
అయితే అది అంత సమంజసం కాకపోవచ్చు – ఒక వయోజనుడుగా ప్రారంభించడం వల్ల అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.”

నాలుగు అక్షరమాల పట్టికలను కలిపి నేర్చుకోవడం (లాటిన్, తెలుగు, దేవనాగరి మరియు ఉర్దూ) ఏదైనా ఒక్క అక్షరమాల యొక్క పట్టికను నేర్చుకున్నంత సముచితం కావచ్చు, అని నేను భావిస్తాను.
అది తప్పనిసరిగా నాలుగు రెట్లు ఎక్కువ కఠినం లేదా కష్టం మాత్రం కాకపోవచ్చు.
అందుకు విరుద్ధంగా, వాటి భేదాలు, వాటిని కలిపి నేర్చుకోవడానికి విద్యార్థులను మరింత వినోదాత్మకంగా మరియు సమర్థవంతులుగా చేయవచ్చు.
అది అక్షరమాల నుండి మొదలై తులనాత్మక/ సహ సంబంధిత ఆలోచనావిధానం మరియు అభ్యసనానికి వీలు కలిగిస్తుంది.

ఈ ప్రశ్న విద్యాబోధకుల సృజనాత్మకత యొక్క పరిమితులను పరీక్షిస్తుంది.
మనం అక్షరమాలల మధ్య పోలికలను మరియు భేదాలను ఎత్తి చూపుతూ ఒక స్మార్ట్ ఫోన్ యాప్ ను వ్రాయాల్సిన అవసరం ఏర్పడవచ్చు లేదా ఒక వీడియో తయారు చేయాల్సి రావచ్చు లేదా అక్షరాలను ఒక నాటకములోని పాత్రధారులుగా భావిస్తూ ఒక వీడియో గేమును సైతమూ సృష్టించాల్సి రావచ్చు.
ఇంకా పైపెచ్చు, అక్షరమాలపై దృష్టి సారించబడిన జోలపాటలు లేదా నర్సరీ పద్యాలను వ్రాయవచ్చు మరియు పాడవచ్చు.
పిల్లలు మరింత ఎక్కువ ఆనందించేలా అది నాలుగు అక్షరమాలల తులనాత్మక బోధనను సమర్థవంతంగా మరియు వినోదాత్మకంగా, ఉల్లాసకర ప్రభావముతో సాధించగలుగుతుంది.
ఏదో సామెత చెప్పినట్లు, అవసరం అనేది ఆవిష్కరణకు మాతృక అవుతుంది.

జతచేయబడిన అనుకూలీకృతంగా నిర్మితమైన “రాష్ట్రం వారీగా భారతదేశ భాషలు” పటం చూడండి.
ఒక్కొక్క రాష్ట్రానికీ, అది రాష్ట్రం పేరు, ప్రధాన భాష పేరు మరియు మరెన్నో అని చూపుతుంది—ఉదా., తెలంగాణ, తెలుగు & మరెన్నో.
ఒకవేళ మీరు గనక “తెలుగు & మరెన్నో,” పై క్లిక్ చేస్తే, తెలంగాణాలో మాట్లాడే భాషలన్నింటినీ మీరు చూస్తారు.
భాషా వైవిధ్యము అనేది భారతదేశము యొక్క ఘనమైన వారసత్వ సంపద, దానిని ఇంకా సంపూర్ణ విస్తృతి వరకూ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది.
వైవిధ్యతను మన పరంపరగా స్వీకరించడం మరియు ఆకళింపు చేసుకోవడం (“వారసత్వం,” “సంప్రదాయం,” “కుటుంబం,” “ఖాన్‌దాన్,” “వంశావళి,” “పరివార్,” “పరంపర” అనే భావనలో) అనేక మందికి ఒక కలగానే నిలిచిపోతుందని కూడా నాకు అవగాహన ఉంది.
భారతదేశము యొక్క వైవిధ్యతను తన పౌరులు ఇంకా పూర్తిగా ప్రతిష్టించుకోవాల్సి ఉంది, ప్రశంసించాల్సి ఉంది మరియు ఆలింగనం చేసుకోవాల్సి ఉంది.

చారిత్రాత్మక సందర్భమును అందించాలంటే, మనలో చాలా మందికి సుపరిచితమైన బాలాజీ పబ్లికేషన్స్, మద్రాస్ (చెన్నై), వారి “జాతీయ సమగ్రత భాషా శ్రేణి,” “ఇంగ్లీష్ ద్వారా తెలుగును 30 రోజుల్లో నేర్చుకోండి,” “హిందీ ద్వారా తెలుగును 30 రోజుల్లో నేర్చుకోండి,” “ఇంగ్లీష్ ద్వారా సంస్కృతమును 30 రోజుల్లో నేర్చుకోండి” వంటి శీర్షికలను ప్రచురిస్తోంది.
ఈ ఒరవడి కనీసం నలభై సంవత్సరాల నుండీ నడుస్తూ వస్తోంది.
పేర్కొనబడిన జాతీయ సమగ్రత లక్ష్యాన్ని సాధించుటలో వాటి సమర్థతను మరియు ప్రభావాన్ని ఎవరైనా అధ్యయనం చేసి ప్రచురించారా అనే విషయం నాకు తెలియదు.
2019 జాతీయ విద్యా విధానము ముసాయిదాను 2019 జూన్ 1 వ తేదీన విడుదల చేసిన అనంతరము చెలరేగిన ఇటీవలి అల్లర్లను పరిగణిస్తే, 1947 లో సాధించిన స్వాతంత్ర్యం తర్వాత 73 సంవత్సరాలకు సైతమూ జాతీయ సమగ్రత లక్ష్యము ఇంకా సాధించబకుండానే మిగిలి ఉందని అర్థమవుతోంది.
ఇది ఏ విధంగా చూసుకున్నా సరే, ఒక సుదీర్ఘమైన సమయము.
భాష చుట్టూ ఇటీవలి ఆందోళన 1960 ల నుండీ పునరావృతమవుతూనే ఉంది, మరియు ఇది నాకు ఒక రకమైన 'మళ్ళీ మళ్ళీ ఇదేనా' అనే భావన కలిగించింది.
ఒక లక్ష్యమును ఏర్పరచుకోవడమనేది ఒక పని అయితే, దాన్ని సాధించడమనేది పూర్తిగా మరొక విషయం.
అయినప్పటికీ, ఇది చిన్న లక్ష్యమేమీ కాదు.
దీని సాధనకు ఒక నిత్యనూతనమైన విధానం కావాలి.

నేను ప్రతిపాదిస్తున్న బహు-భాషావాదం పద్ధతి మునుపటి నమూనాలకు భిన్నమైనది మరియు జాతీయ సమగ్రతకు అవసరమైన ఐదు భాషలు అన్నింటినీ ఒకే విడతలో సమర్థవంతంగా మరియు విశ్లేషణాత్మకంగా బోధించాలని ఆశించబడుతోంది.
కాబట్టి, బోధనకు లక్ష్యంగా చేసుకున్న భాషలు, మూడు జాతీయ భాషలు (నా అభిప్రాయములో, ఈ మూడూ: హిందీ, సంస్కృతం మరియు ఉర్దూ), ఒక అంతర్జాతీయ భాష (ఇంగ్లీష్) మరియు ఒక వ్యావహారిక/స్థానిక భాష (నా మాతృభాష అయిన తెలుగు) లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
ఏదైనా వ్యావహారిక/స్థానిక భాష తెలుగును స్థానాంతరం చేయగలుగుతుంది, ఒకవేళ దానికి భిన్నంగా ఉంటే.
ఉద్దేశ్యముపై ఆధారపడి, ఏ సంఖ్యలోనైనా లేదా జాతీయ లేదా అంతర్జాతీయ భాషల సమ్మేళనమునైనా బోధన చేయవచ్చు.
నా దృష్టి అంతా భారతదేశ సందర్భముపైనే నిలుస్తుంది.

భారతదేశము యొక్క నిర్దిష్ట సందర్భము కారణంగా ఈ ప్రతిపాదన ఉద్భవించినప్పటికీ, ఈ పద్ధతి ఒక సాధారణ అమరికకు మరియు ప్రపంచ వ్యాప్తంగా భాషలన్నింటికీ వర్తిస్తుంది.
ఉదాహరణకు చూడండి, european.multilanguaging.org.

భాషలు ఎలా నిర్వచించబడ్డాయి మరియు లెక్కింపు చేయబడ్డాయనే దానిపై ఆధారపడి ప్రపంచములో సుమారుగా 6,500 లకు పైగా అంతవరకూ భాషలు ఉన్నాయి.
అనేక భాషలు ఎందుకు ఉన్నాయంటే:
అ) ప్రజల సమాజము లేదా జనాభాలో భాష అనేది సమాచార వినిమయానికి ఒక మార్గము, మరియు
ఆ) కారణము ఏదైనా కానీ, ఒకవేళ ఒక జనాభా గనక బయటి ప్రపంచముతో ఎటువంటి సంబంధమూ లేకుండా ఒక భూభాగములో వందలు లేదా వేల సంవత్సరాల కొద్దీ బందించబడి అలాగే ఉన్నట్లయితే, ఒక కొత్త భాషకు జన్మనిస్తూ, ఒక్కొక్కటి దాని స్వంత చతురతతో సమృద్ధమై వారి సమాచార వినిమయ పద్ధతి స్ఫటికీకరణ చెందుతుంది.
మరీ ఎక్కువ కాలం కాలేదు కదా, ప్రపంచము నేడు కనిపించినంత చిన్నగా అప్పుడు కనిపించలేదు.
భూమి యొక్క ప్రతి మూల లేదా ప్రాంతము తనకు తానే ఒక ప్రపంచము లేదా ఒక లోకముగా ఉండేది.

అది భాషా పండితుల ముందు నిలుచున్న సవాలు, ఐతే అది ఖచ్చితంగా సాధించదగిందని నేను విశ్వసిస్తున్నాను.
సరళీకరించాలంటే, విషయాంశములో ఇరవై శాతము ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ మరియు సంస్కృతం ఈ ఐదు భాషలలో ఒక్కొక్కదాని నుండి ఉంటుంది.
స్పష్టమైన ఉదాహరణ ఇవ్వాలంటే, వారి వారి భాషల్లో సంబంధిత భావనాంశాలలో టెన్నిసన్, వేమన, ప్రేమ్‌చంద్, ఇఖ్బాల్ మరియు కాళిదాసు గారల పద్యాలను ఎంపిక చేసుకోవచ్చు.
నిర్దిష్ట విషయాంశము మరియు పాఠ్యప్రణాళిక యొక్క ఎంపిక మరియు తయారీ పనులు ప్రభుత్వ ఆధ్వర్యములో ప్రభుత్వము మరియు అధికారుల సహాయముతో భాషావేత్తలు మరియు భాషా నిపుణులకు అప్పగించబడతాయి.
ఐదు భాషలలోనూ ఒకే విషయాంశమును కలిగియున్న ప్రతి తరగతి యొక్క పాఠాలతో కొత్త పాఠ్యపుస్తకాలు ముద్రించబడతాయి.
కొత్త తరగతి పాఠ్యాంశము "మన భాషలు” గా పిలువబడుతుంది.
అది, ప్రస్తుతం ఉన్న మూడు భాషా పాఠ్యపుస్తకాల (ఇంగ్లీష్, తెలుగు మరియు హిందీ) సమ్మేళన పరిమాణములో ఉంటుంది.
అనుకూలత కోసం, దానిని త్రైమాసికం వారీగా, Q1-Q3 అనే మూడు సంపుటులుగా గానీ, లేదా సముచితమని భావించే మరొక కొలమానము లేదా పదజాలము దేనినైనా ఉపయోగించి గానీ విభజించుకోవచ్చు.
ఒక ధృఢమైన సంగ్రహమును లేదా సమీకృత విజ్ఞప్తి యొక్క భావనను అందించుటకు నమూనాలుగా తరగతులు 1 - 10 వరకు వర్తించే ఊహాజనిత పాఠ్యపుస్తక ముఖపత్రాలు అందించబడ్డాయి.
1 వ తరగతిని కమలముతో ప్రారంభించి 10 వ తరగతిని పట్టా యొక్క సంవత్సరముతో చిహ్నాత్మకంగా కాంచన్‌గంగా (హిమాలయాలు) తో ముగిస్తూ ప్రతియొక్క తరగతి త్రివర్ణ నేపధ్యము గల ఒక భారతీయ చిహ్నముతో గుర్తించబడుతుంది.

సాధారణంగా చెప్పాలంటే, ఉదాహరణకు తెలుగు మాట్లాడే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో, తెలుగు 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకూ బోధించబడుతుంది, ఇంగ్లీష్ 3 నుండి 10 వరకూ, మరియు హిందీ 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకూ బోధించబడుతుంది.
ప్రతి భాష, ఇతర రెండు భాషలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా బోధించబడుతుంది.

పాఠశాల యొక్క సూచనా మాధ్యమమును బట్టి గణితం, సైన్స్ మరియు సాంఘిక శాస్త్రాలు తెలుగులో లేదా ఇంగ్లీష్ లో బోధించబడతాయి.

బహు భాషా సమ్మిళితం అనేది ముఖ్యంగా ద్విభాషా విద్యతో ముడిపడి ఉండే ద్విసమ్మిళిత ప్రక్రియ, ఇందులో గణితం, సైన్స్ మరియు సాంఘిక శాస్త్రముతో సహా అన్ని పాఠ్యాంశాలనూ బోదించడానికి రెండు భాషలను ఉపయోగిస్తారు.
కెనడా దేశములో, వారికి ఇంగ్లీష్/ఫ్రెంచ్ ద్విభాషా- సమ్మిళిత వ్యవస్థ ఉండవచ్చు.
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, ఇంగ్లీష్/స్పానిష్ అత్యంత సాధారణం.
విద్యార్థులు మామూలుగా ఒక్కోసారి ఒక్కో భాషలో చదువుకుంటారు.
భాష రోజువారీగా, వారం వారీగా లేదా నెల వారీగా ప్రత్యామ్నాయం చేయబడవచ్చు, లేదా ఉదయం ఒక భాషను మరియు మధ్యాహ్నం మరో భాషను ఉపయోగించవచ్చు.
ఇతర వ్యత్యాసములు కూడా ఉండవచ్చు.

ఒక సమ్మిళిత కార్యక్రమము ఒక ద్విభాషా సన్నివేశంలో అర్థాన్ని ఇవ్వవచ్చు, ఐతే పంచ భాషల సందర్భములో అది ఆచరణీయ అర్థాన్ని కలిగిస్తుందని నేను అనుకోను.
అలాగే, గణితం అంటే గణితమే - తనకు తానుగా ఒక భాష, అంతే.
కాబట్టి, గణితమును బోధించడానికి ఏ భాషను వాడారు అనేదానితో నిమిత్తం లేకుండా విద్యార్థులు భాషా-అభ్యసన అనుభవాన్ని అనుకున్నంతగా పొందలేకపోవచ్చు.
కెనడా/యుఎస్ సమ్మిళిత కార్యక్రమాల వలె కాకుండా, ఐదు భాషలను నేర్చుకోవడానికి విద్యార్థులకు వీలు కలిగేలా మరియు అందులో లీనమయ్యేలా విషయాంశము యొక్క పరిమాణమును విచక్షణగా పరిమితి చేస్తూ నా ప్రాజెక్టు ప్రతిపాదిస్తుంది.
ఒక సమీకృత నిర్మాణముగా, ఎంచుకోబడిన ఐదు భాషలు తెలియజేస్తున్న సారూప్యతలు మరియు విభేదాలు, వాటి పదజాలము, వ్యాకరణము మరియు సంస్కృతులకు సంబంధించి వాటి అంతర అనుసంధానత యొక్క లోతైన అవగాహన పొందడం, ప్రతిపాదిత “మన భాషలు” తరగతి యొక్క ఉద్దేశ్యముగా ఉంది.
ఒక ఏకైక భాషను నేర్చుకోవడం కంటే ఎక్కువగా బహు భాషలను నేర్చుకోవడం అనేది ఒక ఆనందదాయకమైన అనుభూతిగా చేయడం నా ప్రతిపాదన యొక్క సహ సంబంధిత మరియు సమీకృత సూత్రముగా ఉంది.

నాకు తెలిసినంతవరకూ, భారతదేశం అటువంటి విధానాన్ని ద్విభాషా సమ్మిళితంగా ఉపయోగించదు.
అటువంటి భాషా సమ్మిళితం దేనినీ నా ప్రాజెక్టు కలిగి ఉండదు.
ఎంపిక చేయబడిన ఏకరూప విషయాంశమును ఉపయోగించి ఐదు భాషలను బోధించడం పైనే నా దృష్టి నిలిచి ఉంటుంది.
గణితం, సైన్సు మరియు సాంఘిక శాస్త్రాలను భారత దేశములో ప్రస్తుతమున్న సూచనా మాధ్యమం ప్రకారమే బోధించాలి.

తులనాత్మక అంచనాలకు రావడానికి గాను, ఒక విద్యా సంవత్సరములో భాషలను బోధించడానికి ఉన్న సమయం రెండు వ్యవస్థలకూ ఒకటే అని అనుకోండి.
ఒక సంవత్సరములో 220 పని రోజులు ఉంటాయి, అందులో 20 రోజులు పరీక్షల నిర్వహణకు ఉపయోగించబడి 200 రోజులు బోధనకు అందుబాటులో ఉంటాయి.
ఉదాహరణకు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో, 200 రోజులపాటు ప్రతిరోజూ 45 నిముషాల పాటు తెలుగు బోధించబడుతుంది, మరి అదే విధంగా 200 రోజులపాటు ప్రతిరోజూ 45 నిముషాల పాటు ఇంగ్లీష్ బోధించబడుతుంది, కాగా హిందీ 133 రోజులపాటు ప్రతిరోజూ 45 నిముషాల పాటు బోధించబడుతుంది.
సంవత్సరములో తెలుగు మరియు ఇంగ్లీష్ ఒక్కొక్కటి 150 గంటల పాటు, కాగా హిందీ ఒక సంవత్సరములో 100 గంటల పాటు బోధించబడుతున్నట్లుగా లెక్కలు చూపుతున్నాయి.
ఆ విధంగా, మూడు భాషలూ కలిపి ఒక సంవత్సరములో మొత్తం 400 గంటల వ్యవధి పాటు బోధించబడుతున్నాయి.
చర్చ కోసం, సాంప్రదాయ వ్యవస్థలో సంవత్సరానికి తెలుగులో 30 విభిన్న పాఠాల అంశాలు, ఇంగ్లీషులో 30 విభిన్న పాఠాల అంశాలు, హిందీలో 20 విభిన్న పాఠాల అంశాలు, మొత్తం కలిపి భాషలకు 80 విభిన్న పాఠాల అంశాలు ఉన్నాయనుకోండి.
సగటున, ఒక్కో పాఠము యొక్క అంశము 5 గంటల పాటు బోధించబడుతుంది.

అంశమును ఒకే సమయములో ఐదు భాషలలో బోధించడానికి వీలు కలిగేలా విభిన్న పాఠాల యొక్క అంశాల సంఖ్యను 40 కి లేదా 20కి (ఐదు భాషలు ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ మరియు సంస్కృతానికి సంబంధించిన 8 లేదా 4 విషయాంశాలు) సైతమూ తగ్గిస్తామని అనుకోండి.
ఆ విధంగా, ప్రతి అంశాన్నీ ఒకే సమయములో ఐదు భాషలలో బోధించడానికి ఒక సంవత్సరములో ప్రతి అంశానికీ 10 నుండి 20 గంటలు వస్తుంది.
ఒక సంవత్సరములో భాషలను (2 ఐనా, 3 ఐనా లేదా 5 ఐనా) బోధించడానికి ఉన్న మొత్తం సమయము స్థిరంగా ఉంటుందని పరిగణిస్తూ, ఆశించిన భాషా అభ్యసన ఫలితాలను సాధించడానికి అవసరమైనట్లుగా తగ్గించవలసిన లేదా పెంచవలసిన చరరాశి (వేరియబుల్) విభిన్న పాఠ్య అంశాల సంఖ్యగా ఉంటుంది.
గుర్తుంచుకోండి, భాషా తరగతులు అనేవి అంతిమంగా భాషను నేర్చుకోవడం గురించి కానీ విషయాంశమును నేర్చుకోవడం గురించి కాదు.

ఎన్ని భాషలను (2, 3 లేదా ఎక్కువ) బోధించాలి/ నేర్చుకోవాలి అనేది స్వాతంత్ర్య స్థాపన జరిగిన రోజు నుండీ భారతదేశము యొక్క పురాతన లేదా ప్రథమ ప్రశ్నగా ఉంటూ వస్తోంది, మరియు భాషల సంఖ్య గురించి సంవాదము త్వరలో ఏ సమయములోనూ తగ్గుముఖం పట్టకపోవచ్చు.
ఐతే, నేను ప్రతిపాదిస్తున్న సహ సంబంధిత విధానము ప్రజలను ఆపి, పునరాలోచించేలా మరియు కొంతవరకూ భయాలను మరియు పక్షపాతాన్ని తొలగించేలా చేస్తుందని ఆశ.

ఐదు భాషలను నేర్చుకోవడం వల్ల మొత్తం మీద కలిగే ప్రయోజనాలు, ప్రస్తుత వ్యవస్థలో లాగా కొద్ది అదనపు, ఏకాంతమైన, అసంబంధిత యూనిట్ల సమాచారాన్ని నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలకు ఎంతో దూరములో ఉంటాయని నేను చెప్పగలను.
అందుకు బదులుగా అదనపు భాషలను నేర్చుకోవడం ద్వారా, కొత్త చోట్లకు ప్రవేశించడానికి మీరు తాళాలు లేదా సంకేత చిహ్నాలను స్వాధీనపరచుకుంటున్నారు.
మీరు ఒక భాషను నేర్చుకున్నారంటే, ఎన్ని యూనిట్ల సమాచారమునైనా నేర్చుకోవడమెలాగో మీకు మీరుగా తెలుసుకుంటారు.
ఇది నేర్చుకోవడానికి చేసే బోధన.

ఆదర్శవంతంగా, ఇద్దరు ఉపాధ్యాయులు ఒక్కొక్కరు రెండేసి భాషలను బోధించే సమర్థత మరియు అర్హత కలిగి ఉంటూ, ముగ్గురు వేర్వేరు ఉపాధ్యాయులు కలిసి ఐదు భాషల బోధనను పూర్తి చేయవచ్చు.
దశ 1: ప్రతి పాఠము యొక్క ఐదు భాషల వెర్షన్లు ఒక్కొక్కటి ఆ భాషకు చెందిన ఉపాధ్యాయుడిచే మామూలు విధానములో బోధించబడుతుంది.
దశ 2: విద్యార్థులు దానిపై పనిచేస్తారు మరియు పదపుస్తకమును తాము స్వంతంగా చదువుకుంటారు.
దశ 3: ఐదు భాషల మధ్య ఉన్న అంతర్లీన సంబంధమును విశ్లేషించి బోధించడానికి/నేర్చుకోవడానికి ముగ్గురు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులచే ఒక సహ సంబంధిత లేదా ఉమ్మడి తరగతి నిర్వహించబడుతుంది.
ఈ ప్రక్రియలో, విద్యార్థులు మాత్రమే కాకుండా, ఉపాధ్యాయులు కూడా ఇతర భాషల యొక్క ఇతర ఉపాధ్యాయుల నుండి నేర్చుకుంటారు.
ఆ విధంగా అది, అందులో పాల్గొన్నవారందరికీ ఒక అభ్యసన అనుభవం అవుతుంది.
ప్రతి పాఠం యొక్క ముగింపులో, ఐదు భాషలు అన్నింటిలోనూ, పాఠము యొక్క విషయాంశానికి సరిపోయే విధంగా ఒక చిన్న పద్యము లేదా పాటను చేర్చవలసి ఉంటుంది.
ఒక పాఠము పూర్తయిందని గుర్తించడానికి వీలుగా, ఒక ఆహ్లాదకరమైన సామాజిక సందర్భమును ఉటంకిస్తూ దానిని ఐదు భాషలన్నింటిలోనూ బృందగీతముగా పాడవచ్చు.

ఈ విధానము, విద్యార్థులు ఈ ఐదు భాషలను కేవలం చదవడం, వ్రాయడం మరియు మాట్లాడడంలో మాత్రమే గాక, వారు ఈ ఐదు భాషలలో వ్యాకరణము, చరిత్ర, సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వము మున్నగువంటి ఇతర అంశాలలో విస్తృతమైన పరిజ్ఞానము పొంది, వారు అత్యంత ప్రావీణ్యులుగా మారేందుకు కూడా దారి తీయగలుగుతుంది.
అంతే కాకుండా, వారు సంవత్సరం తర్వాత సంవత్సరం, పది సంవత్సరాల పాటు ఐదు వార్షిక పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఇది తగినంత గట్టి పునాదిగా ఉంటుంది.

పాఠ్యపుస్తకము, ప్రతి తరగతి పాఠము ముగింపులో బోధనకు గాను ముగింపు వాక్యాలు అనబడే ఒక విభాగమునుకలిగి ఉండాలని నేను సలహా ఇస్తాను.
ఈ విభాగము, పాఠమునకు సంబంధించిన విధంగా తులనాత్మక శబ్ద వ్యుత్పత్తి, వాక్యనిర్మాణము మరియు వ్యాకరణముపై సారాంశమును అందించాలి.
ప్రతిపాదిత పద్ధతి యొక్క శక్తి దాని తులనాత్మక అధ్యయనముపై నిలిచి ఉంటుంది.
ముగింపు వాక్యాలు విభాగము, ఈ ఐదు భాషలలో ఒక్కొక్కదానికి విశిష్టంగా ఉన్న సమరూపతలు, వ్యత్యాసాలు మరియు ఏవైనా వ్యాకరణ సూత్రాల గురించి సునిశితమైన దృష్టిని సారించాలి.
ప్రతి భాష మిగిలిన నాలుగు భాషలకు ఒక సూచికా చట్రమును అందిస్తుంది; విద్యార్థి ఎప్పటికీ ఒక నిర్బంధిత వాతావరణములో లేదా ఒంటరిగా పని చేయడు.
ఈ నమూనాలో, భాషల బోధన/అభ్యసనము అత్యంత సమర్థవంతంగా ఉండబోతుంది.

ఏకాంతంగా ఒక విషయాన్ని నేర్చుకోవడం నాకు ఆనందాన్ని కలిగించదు.
తర్వాతి పాఠ్యాంశానికి వెళ్ళే ముందుగా ఒకవేళ విద్యార్థులు గనక సందర్భానుసారంగా ఒక నిర్దిష్ట భాషాపరమైన అంశము యొక్క నిర్మాణమును శోధించగలిగి, దాని నిర్మాణము, ఉపయోగాలు మరియు ఉదాహరణల సారాంశమును కలిగి ఉన్నట్లయితే అది మరింత ఆసక్తిదాయకంగా, ప్రయోజనకరంగా మరియు ఉత్పాదకంగా ఉంటుంది.
ప్రతి అధ్యాయము చివరన ముగింపు వాక్యాలు ఉండడం వల్ల ఆ సందర్భములో పాఠము యొక్క విషయాంశము నుండి తలెత్తే వివిధ సమస్యలను సమర్థవంతంగా వివరించి మరియు నిర్వహించే సానుకూలతను అందిస్తుంది.

నా అభిప్రాయములో, అదంత సమస్య కాదు, పైగా ఒక ప్రయోజనం కూడా, ఎందుకంటే,

  1. వాస్తవం ఏమిటంటే ఏ భాషలోని ఏ పుస్తకాన్నయినా ఏ భాషలోనికి అయినా అనువాదం చేయవచ్చు, ఖచ్చితంగా కాకపోయినా కొంతవరకైనా.
  2. ఈ కొత్త పద్ధతి, విభిన్న భాషల మధ్య సారూప్యతలు మరియు వ్యత్యాసాలను వెల్లడి చేయడం లేదా బహిర్గతం చేయడంపై కృషి చేస్తుంది, ఆ విధంగా విద్యార్థి యొక్క విద్యాసంబంధిత ప్రావీణ్యతకు సంభావ్యతగా విస్తృతంగా దోహదపడుతుంది.
  3. ప్రాథమిక లక్ష్యము లక్ష్యిత భాషకు మరీ ఎక్కువగా సేవ చేయడం కాదు, ఐతే అందుకు బదులుగా విద్యార్థి యొక్క చదువుకు సేవ చేయడం.
విచక్షణతో కూడిన పాఠ్య ప్రణాళిక రూపకల్పన అవసరమై ఉంటుంది కాబట్టి, విద్యా బోధకులకు నిస్సంశయంగా ఇది సవాలుగానే ఉంటుంది.
ప్రపంచములో అత్యధిక ప్రాంతాల్లోని అత్యధిక అధ్యయన క్షేత్రాలలో వాడుకలో ఉన్న విధంగా, పాఠ్యప్రణాళిక, క్షేత్రస్థాయిలోని విద్యావిషయాలు మరియు విద్యావేత్తలచే సమర్థించబడే అంశాలతో పాటుగా ప్రభుత్వము యొక్క అవసరాలు మరియు దృక్కోణాలను ప్రస్తావించాలనే ఆశయాన్ని జ్ఞాపకం ఉంచుకోవడం కూడా ముఖ్యము.

మొదటి ప్రశ్నకు నా సమాధానం “లేదు” అని.
తెలుగు భాష మాట్లాడే రాష్ట్రాలతో నాకు ఎక్కువ సుపరిచితం ఉంది కాబట్టి, ఈ భావజాలమును సమర్పించడానికి నేను వాటిని ఉదాహరణగా పేర్కొన్నాను.

బోధనా నమూనా ఇతర రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది, ఐతే రెండవ ప్రశ్న చాలా సున్నితమైందనీ, అంతే కాకుండా జవాబివ్వడానికి నర్మగర్భంగా ఉందని నేను భావిస్తున్నాను.
బహు-భాషా వాదం ప్రతిపాదన అభివృద్ధిపరచబడినట్లుగా మరియు సమర్పించబడిన విధంగా, మరియు ఒక వ్యక్తి ప్రాథమికంగా తన స్వంత ప్రయోజనం కోసం, మరియు ద్వితీయంగా దేశ ప్రయోజనం కోసం ఒక భాషను నేర్చుకోవడానికి ఎంచుకున్నాడనే కారణం చేత మాత్రమే నేను దీనికి సమాధానమివ్వడానికి ముందుకు వస్తున్నాను.

నా “అద్భుతగాధ” సమాధానం ఇది:
భారతదేశ వ్యాప్తంగా 80 శాతం విషయాంశము ఒకే మాదిరిగానే ఉంటుంది; 20 శాతం విషయాంశము వ్యావహారిక/స్థానిక భాషకు కేటాయించబడి ఉంటుంది.
తెలుగు భాగము ఆయా సంబంధిత రాష్ట్రాలలో తమిళం, కన్నడ, మలయాళం మున్నగు భాషలచే మార్పిడి చేయబడుతుంది.
ప్రతి హిందీ రాష్ట్రము, ఉత్తర-దక్షిణ భాషా బంధమును నెలకొల్పుకుంటూ, రాష్ట్ర శాసనసభచే ఒక శాసనం ద్వారా, ద్రావిడ(దక్షిణ భారత) భాషలలో ఒకదానిని సోదరీ భాషగా అధికారికంగా మరియు శాశ్వతంగా దత్తత చేసుకుంటుంది.
ఒకవేళ పది హిందీ రాష్ట్రాలు/ప్రాంతాలు తమ సోదరీయ భాషగా విభిన్న దక్షిణభారత భాషలను తీసుకుంటే, ఆ భాషాపరమైన ముఖచిత్రాన్ని ఊహించండి.
పిల్లలు, ఉదాహరణకు హిమాచల్ ప్రదేశ్ లో తెలుగు, మధ్యప్రదేశ్ లో మలయాళం, ఝార్ఖండ్ లో కన్నడ, మరియు ఉత్తరప్రదేశ్ లో తమిళం నేర్చుకుంటున్నారని ఊహించండి.
ప్రతి ఏటా సహోదరీ బంధముతో ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న పరస్పర విద్యార్థి విహారయాత్రల గురించి ఊహించండి.
అది లోతైనదీ మరియు చారిత్రాత్మకమైనదీ అవుతుంది.

గతంలో, నేర్చుకోవడానికి కేవలం పట్టుదల లోపించడంగా మాత్రమే ఉండేది కాదు, ఐతే సమర్థవంతమైన విధానము లోపించడం కూడా.
ఒకవేళ ఆశిస్తే లేదా కోరుకుంటే మాత్రమే, బోధన యొక్క బహు-భాషావాద వ్యవస్థ లభ్యత అటువంటి "అద్భుతగాధ” ను నిజం చేస్తుంది మరియు ఆచరణాత్మకం చేస్తుంది.
అద్భుతగాధ అయినా లేదా కాకపోయినా, అంతిమ విశ్లేషణలో, ఇవన్నీ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సహా ఆయా సంబంధిత రాష్ట్రాలచే, ఆవశ్యకంగా చేయబడవలసియున్న రాజకీయపరమైన మరియు ప్రభుత్వపరమైన నిర్ణయాలు.

ఖచ్చితంగా, దీనిని మదింపు చేయాల్సిన అవసరం ఉంది.
ఈ మొత్తం పద్ధతి శాస్త్రీయ విచారణ యొక్క స్ఫూర్తితో ఉద్భవించింది.
ఇది నిస్సంశయంగా ఒక దీర్ఘ కాలిక ప్రాజెక్టు.

సహజంగానే, అది మొదట్లోనే సాధ్యము కాదు.
కాబట్టి, మొదటి తరగతి కొరకు పనులు చక్కబెట్టుకొని సిద్ధం కావడం సముచితమైన మార్గము కాగలదు, ఆ తర్వాత ఆ సంవత్సరములో రెండవ తరగతి కొరకు తయారు చేయడం, తద్వారా ఈ బ్యాచ్ తర్వాతి తరగతికి వెళ్ళే సమయానికి అవి సిద్ధంగా ఉంటాయి.
సాధారణంగా, అటువంటి సంక్లిష్టమైన మరియు ముఖ్యమైన ప్రాజెక్టుల కొరకు, పాల్గొన్నవారి నుండి సూచిత సలహాలు తరచుగా మెరుగుదలకు దారితీస్తాయి.

దానిని నేను సంపూర్ణంగా అంగీకరిస్తాను.
బోధనలో బహుమాధ్యమ విధానము యొక్క సమర్థత పట్ల నేను విశ్వసిస్తాను.
దీనిని ఒక అడుగు ముందుకు తీసుకువెళ్ళడానికై, భారతదేశము యొక్క భారీ చలనచిత్ర పరిశ్రమ వనరులైన బాలీవుడ్ మరియు టాలీవుడ్ రంగాలు కొన్ని అత్యుత్తమ గీతాలు మరియు అందమైన మధురగీతాలను నిర్మించాయి.
అయినప్పటికీ, ఇది సాంప్రదాయం కాదని ధ్వనించవచ్చు, స్టాండర్డు (తరగతి)కి తగిన విధంగా, విభిన్న తరాల యొక్క బాలీవుడ్ మరియు టాలీవుడ్ పాటలను జాగ్రత్తగా గుర్తించి మరియు ఎంపిక చేయడం, మరియు ఆ గీతాలను నాలుగు ఇతర భాషల లోనికి వినసొంపుగా అనువదించడం మరియు విద్యార్థులచే ఒరిజినల్ ట్యూన్ లో పాడించడాన్ని నేను హృదయపూర్వకంగా ప్రతిపాదిస్తున్నాను.
బహు భాషలను నేర్చుకోవడమనేది అత్యంత వేగంగా లేదా ఎక్కువ వినోదాత్మకంగా జరగదు.
మునుపటి సంవత్సరాలలో దీనిని ఎందుకు చేయలేదు అని మనందరమూ మనకు మనము ప్రశ్నించుకోవడానికి ముందు బహుశః ఇది సమయం యొక్క విషయంగా అనిపించవచ్చు.
 

ముగింపులో:

భారతదేశం యొక్క ప్రతి పౌరుడూ నేడుస్మార్ట్ ఫోన్లను వాడుతున్నంత సులభంగా మరియు శ్రమ రహితంగా ఐదు భాషలలో సంభాషించగలగాలన్నది భవిష్యత్ దార్శనికతగా ఉంది.
గతంలో మరీ ఎక్కువ కాలం క్రిందట కాకుండా కేవలం ప్రత్యేక గౌరవం గల అల్పసంఖ్యాక భారతీయులు మాత్రమే టెలిఫోన్ అందుబాటును కలిగి ఉండిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి.
శాస్త్రసాంకేతికత అటువంటి గౌరవాన్ని ప్రజాస్వామ్యబద్ధం చేసి పరిస్థితిని శాశ్వతంగా మార్చివేసింది.
అదే విధమైన ఒక పరిస్థితి ఉండేది, నేననుకుంటా, బహుశః ఎప్పటికీ, భారతీయులలో కేవలం ఒక గౌరవనీయ సమాజము మాత్రమే సంస్కృతం వంటి భాషా సంపదకు అందుబాటు కలిగి ఉండేవారు.
బహు- భాషావాదం ప్రతిపాదన ఈ పరిస్థితిని మార్చగల, మరియు భారతదేశం యొక్క సమాజాలన్నింటి నుండీ మరింత మంది కవులు, కళాకారులు, పండితులు మరియు శాస్త్రజ్ఞులను ఉత్పత్తి చేయగల అవకాశం ఉంది, మరియు ఈ నిపుణులు ఇంతకు మునుపెప్పుడూ లేని విధంగా గౌరవించబడే అవకాశమూ ఉంది.
సామాజిక మరియు పౌర సందర్భాల విశ్లేషణలో ఈ ప్రతిపాదన సానుకూల మార్పును కలిగిస్తుందని కూడా మీరు ఆశించవచ్చు.
కాబట్టి, ఒకప్పుడు టెలిఫోన్ కు అందుబాటు కావడం అనేదాన్ని మీరు ఎలా ఐతే హక్కుగా భావించారో, అదే విధంగా బహు-భాషావాదం విద్యకు అందుబాటు కలగడం అనేది ఒక ప్రశస్తమైన వరముగా, ఒక హక్కు మరియు గౌరవముగా మీరు పరిగణించవచ్చు.
అటువంటి విద్యాసంబంధిత అవకాశం కొరకు మీరు పోరాడుతూ మరియు దానిని నిరోధించడానికి బదులు దానితో విహరిస్తూ ఉండవచ్చు.
మొదట భాషాపరమైన సమానత్వమును నిర్ధారించుకోనిదే లేదా సాధించనిదే ఒక దేశం యొక్క పౌరుల మధ్య సమానత్వము సాధ్యమయ్యేది కాదు.
ఇది ఎంతో ప్రాథమ్యం—ఇది ఎంతో ముఖ్యం.

జై హింద్! జై ప్రపంచం!

కృతజ్ఞతలు

ఈ తరచుగా అడిగే ప్రశ్నలను తయారు చేయుటలో సహాయపూర్వకమైన మరియు ఉత్తేజపూరితమైన చర్చల కొరకు నా అనేక ధన్యవాదాలను శ్రీ. మొహమ్మద్ జానిమియా, విశ్రాంత ఉన్నతపాఠశాల ఉపాధ్యాయులు, నడిగూడెం, తెలంగాణ, మరియు ప్రొఫెసర్ నిరంజన్ వి. జోషీ, ప్రొఫెసర్ ఎమిరిటస్, భారతీయ విజ్ఞాన సంస్థ (ఐ.ఐ.ఎస్.సి), బెంగళూరు, కర్ణాటక వారికి సమర్పించాల్సి ఉంది.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతనకల్ లో మొహమ్మద్ నా సహాధ్యాయి, మరియు నిరంజన్ భారతీయ విజ్ఞాన సంస్థలో నా తోటి పరిశోధక విద్యార్థి.
నా జీవితములో ఈ ఇద్దరు వ్యక్తులు నాకు తెలిసిన సంవత్సరం నుండీ ఇంతవరకూ అనేక సంవత్సరాల పాటు వారి నుండి నేను నిరంతరాయమైన స్నేహాన్ని ఆనందించాను, ఆనందిస్తున్నాను.
సంవాదము మరియు చర్చలలో వాళ్ళు ఎల్లప్పుడూ నాకు సహాయం చేస్తూ వచ్చారు, అందుకు నేను వారికి కృతజ్ఞుడనై ఉన్నాను.
ఆఖరుగా, డా. థెరేసా వాల్డెజ్, భాషా కేంద్రము యొక్క సంచాలకులు, పోర్చుగీస్ ప్రోగ్రాము యొక్క అధిపతి, ఆధునిక భాషలు మరియు సంస్కృతుల విభాగము, రోచెస్టర్ యూనివర్సిటీ, రోచెస్టర్, ఎన్.వై వారికి నా ప్రశంసలు తెలియజేయాల్సి ఉంది.
డా. వాల్డెజ్ గారు ఎంతో దయతో మొత్తం ప్రతిపాదనను సమీక్షించారు మరియు విలువైన సలహా సూచనలు చేశారు.