" మీ భాషను మార్చుకోండి, అప్పుడు మీ ఆలోచనలు మారుతాయి."
కార్ల్ ఆల్‌బ్రెక్ట్

బీరెల్లి శేషి, ఎం.డి.

మన భాషల గురించిన ఉల్లేఖనాలు

Mana bhāṣala gurin̄cina ullēkhanālu

తెలుగు
"భారతదేశంలో మాట్లాడే భాషలలో తెలుగు భాష పరిధి, పురాతనత్వం, మరియు సాహిత్య పరంగా ఈ భాషకు ఉన్న సంక్లిష్ట వైభవం లాంటి విశిష్టతలన్నీ గ్రీసు లేదా రోమ్ భాషల కంటే బహుశః అణువంతైనా తక్కువ కాదు. ఈ భాషలో ప్రతి అభ్యసన విభాగమునూ ఉత్సుకత మరియు సఫలతతో సాధన చేసుకొని అలవరచుకున్నట్లుగా అగుపిస్తుంది; అది కేవలం ఒక సుదీర్ఘశ్రేణి స్వంత కూర్పులను కలిగియుండడమే గాకుండా, మహాభారతం, భాగవతం మరియు సంస్కృతంలోని ప్రధానమైన పద్యాలలో అత్యధికం తెలుగు కవులచే తమ స్వంత భాషలోనికి అనువదించబడ్డాయి."
ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 1827లో వ్రాసిన తన "ది ప్రసోడీ ఆఫ్ ది తెలుగు అండ్ సంస్కృత్ లాంగ్వేజెస్ ఎక్స్ ప్లెయిన్డ్" ఉపోద్ఘాతంలో

Telugu
"Bhāratadēśanlō māṭlāḍē bhāṣalalō telugu bhāṣa paridhi, purātanatvaṁ, mariyu sāhitya paraṅgā ī bhāṣaku unna saṅkliṣṭa vaibhavaṁ lāṇṭi viśiṣṭatalannī grīsu lēdā rōm bhāṣala kaṇṭē bahuśaḥ aṇuvantainā takkuva kādu. Ī bhāṣalō prati abhyasana vibhāgamunū utsukata mariyu saphalatatō sādhana cēsukoni alavaracukunnaṭlugā agupistundi; adi kēvalaṁ oka sudīrghaśrēṇi svanta kūrpulanu kaligiyuṇḍaḍamē gākuṇḍā, mahābhārataṁ, bhāgavataṁ mariyu sanskr̥tanlōni pradhānamaina padyālalō atyadhikaṁ telugu kavulacē tama svanta bhāṣalōniki anuvadin̄cabaḍḍāyi."
Chārles philip braun 1827lō vrāsina tana "di prasōḍī āph di telugu aṇḍ sanskr̥t lāṅgvējes eks pleyinḍ" upōdghātanlō

ఇంగ్లీష్
"ఇంగ్లీషు భాష ఏ ఒక్కరికో స్వంతమైన ప్రత్యేక ఆస్తి కాదు. అది ఊహాత్మకతకు స్వంతమైన ఆస్తి; అది ఆ భాషకు మాత్రమే స్వంతమైన ఆస్తి. అతి గొప్ప ఇంగ్లీషు కవులంతటి చక్కగా వ్రాసే ప్రయత్నములో నాకు ఏదో అడ్డం పడిన భావన నేను ఎప్పుడూ ఎరగను."
సర్ డెరెక్ వాల్కాట్
Iṅglīṣ
"iṅglīṣu bhāṣa ē okkarikō svantamaina pratyēka āsti kādu. Adi ūhātmakataku svantamaina āsti; adi ā bhāṣaku mātramē svantamaina āsti. Atigoppa iṅglīṣu kavulantaṭi cakkagā vrāsē prayatnamulō nāku ēdō aḍḍaṁ paḍina bhāvana nēnu eppuḍū eraganu."
Sar ḍerek vālkāṭ

"సమ్మేళనాలు ఏర్పరిచే సామర్థ్యం అన్ని ఇండో-యూరోపియన్ భాషలకూ ఉంది.
నిజానికి, జర్మన్ మరియు డచ్ ఆ పనే చేస్తాయి, చెప్పాలంటే, చాలా ఎక్కువే చేయగలవు.
కానీ, ఇతర చాలా భాషల కంటే ఇంగ్లీషు ఆ పనిని మరింత చక్కగా చేస్తుంది. ఇతర జర్మనిక్ భాషలలో కఠోరంగా అనిపిస్తూ గొంతుకు అడ్డం పడే పద సంకెళ్లను ఛేదించుకోవడంతో పాటు పద మూలకాలను పూర్వ స్థితికి తీసుకొచ్చి వాటిని నాజూకుగా మార్చిన ఇంగ్లీషు కారణంగానే హౌస్‌బోట్ మరియు బోట్‌హౌస్ మధ్య, బాస్కెట్‌వర్క్ మరియు ఒక వర్క్ బాస్కెట్ మధ్య, ఒక కేస్‌బుక్ మరియు ఒక బుక్‌కేస్ మధ్య భేదం చూపడం మనకు సాధ్యమవుతోంది. ఇతర భాషలు మనకీ సౌలభ్యాన్ని అందించడం లేదు."
బిల్ బ్రేసన్, ది మదర్ టంగ్: ఇంగ్లీష్ అండ్ హౌ ఇట్ గాట్ దట్ వే
"Sam'mēḷanālu ērparicē sāmarthyaṁ anni iṇḍō-yūrōpiyan bhāṣalakū undi.
Nijāniki, jarman mariyu ḍac ā panē cēstāyi, ceppālaṇṭē, cālā ekkuvē cēyagalavu.
Kānī, itara cālā bhāṣala kaṇṭē iṅglīṣu ā panini marinta cakkagā cēstundi. Itara jarmanik bhāṣalalō kaṭhōraṅgā anipistū gontuku aḍḍaṁ paḍē pada saṅkeḷlanu chēdin̄cukōvaḍantō pāṭu pada mūlakālanu pūrva sthitiki tīsukocci vāṭini nājūkugā mārcina iṅglīṣu kāraṇaṅgānē haus‌bōṭ mariyu bōṭ‌haus madhya, bāskeṭ‌vark mariyu oka vark bāskeṭ madhya, oka kēs‌buk mariyu oka buk‌kēs madhya bhēdaṁ cūpaḍaṁ manaku sādhyamavutōndi. Itara bhāṣalu manakī saulabhyānni andin̄caḍaṁ lēdu." Bil brēsan, di madar ṭaṅg: Iṅglīṣ aṇḍ hau iṭ gāṭ daṭ vē

హిందీ
భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ. "సింధూ లేదా ఇండస్ నది" అనే అర్థం కలిగిన "హింద్" అనే పర్షియన్ భాషా పదం నుంచి హిందీ అనే పేరు వచ్చింది. లల్లూజీ లాల్ రచించిన "ప్రేమ్ సాగర్" (అంటే, "ప్రేమ సముద్రం" అని అర్థం) లో శ్రీకృష్ణ పరమాత్ముడి లీలలు మహాద్భుతంగా వర్ణించబడ్డాయి. 1805లో ప్రచురితమైన ఈ గ్రంథాన్ని హిందీలో ప్రచురితమైన తొట్టతొలి పుస్తకంగా పేర్కొంటారు.
Hindī
bhāratadēśanlō atyadhikulu māṭlāḍē bhāṣa hindī. "Sindhū lēdā iṇḍas nadi" anē arthaṁ kaligina "hind" anē parṣiyan bhāṣā padaṁ nun̄ci hindī anē pēru vaccindi. Lallūjī lāl racin̄cina "prēm sāgar" (aṇṭē, "prēma samudraṁ" ani arthaṁ) lō śrīkr̥ṣṇa paramātmuḍi līlalu mahādbhutaṅgā varṇin̄cabaḍḍāyi. 1805Lō pracuritamaina ī granthānni hindīlō pracuritamaina toṭṭatoli pustakaṅgā pērkoṇṭāru.

సంస్కృతం
"సంస్కృత భాష పుట్టుపూర్వోత్తరాల సంగతి అటుంచితే, ఈ భాష నిర్మాణ శిల్పం అమోఘం;
గ్రీకు భాషను మించిన ఖచ్చితత్వం, లాటిన్ భాషను తలదన్నే విస్తృత పరిధి మరియు ఆ రెండు భాషలకూ లేని అత్యంత విశిష్టమైన పద సంపద కలిగి ఉండడమే కాకుండా సంస్కృతానికి ఆ రెండిటితో బలమైన బంధుత్వం కూడా ఉంది. క్రియల యొక్క మూలాలు మరియు వ్యాకరణము యొక్క రూపాలు రెండింటిలోనూ ఈ భాషలు ఒకేలా ఉండడం యాదృచ్ఛికమే కావచ్చు;
ఈ మూడు భాషల మూలం ఒకటేనని, బహుశా ఆ మూల భాషకు దీర్ఘాయుష్షు లేకపోయిందని బలంగా విశ్వసించలేని పక్షంలో, ఏ లాక్షణికుడూ ఈ మూడు భాషలను పరిశీలించలేడు, పరీక్షించలేడు;
అంత బలమైనది కానప్పటికీ, ఒకానొక పోలిక కలిగిన కారణంగా, గోథిక్ మరియు సెల్టిక్ భాషలు అత్యంత విభిన్న నుడికారంతో సమ్మిళతమైనప్పటికీ, అవి సంస్కృత మూలాన్నే కలిగి ఉన్నాయి; అలాగే, ప్రాచీన పర్షియన్భాషను సైతం ఇదే భాషా కుటుంబానికి జోడించవచ్చు."
1786లో ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్‌కు ఇచ్చిన అధ్యక్షోపన్యాసములో
సర్ విలియమ్ జోన్స్
Sanskr̥taṁ
"sanskr̥ta bhāṣa puṭṭupūrvōttarāla saṅgati aṭun̄citē, ī bhāṣa nirmāṇa śilpaṁ amōghaṁ;
Grīku bhāṣanu min̄cina khaccitatvaṁ, lāṭin bhāṣanu taladannē vistr̥ta paridhi mariyu ā reṇḍu bhāṣalakū lēni atyanta viśiṣṭamaina pada sampada kaligi uṇḍadamē kākuṇḍā sanskr̥tāniki ā reṇḍinṭitō balamaina bandhutvaṁ kūḍā undi. Kriyala yokka mūlālu mariyu vyākaraṇamu yokka rūpālu reṇḍiṇṭilōnū ī bhāṣalu okēlā uṇḍaḍaṁ yādr̥cchikamē kāvaccu; ī mūḍu bhāṣala mūlaṁ okaṭēnani, bahuśā ā mūlabhāṣaku dīrghāyuṣṣu lēkapōyindani balaṅgā viśvasin̄calēni pakṣanlō, ē lākṣaṇikuḍū ī mūḍu bhāṣalanu pariśīlin̄calēḍu, parīkṣin̄calēḍu; anta balamainadi kānappaṭikī, okānoka pōlika kaligina kāraṇaṅgā, gōthik mariyu selṭik bhāṣalu atyanta vibhinna nuḍikārantō sam'miḷatamainappaṭikī, avi sanskr̥ta mūlānnē kaligi unnāyi; alāgē, prācīna parṣiyan bhāṣanu saitaṁ idē bhāṣā kuṭumbāniki jōḍin̄cavaccu."
1786Lō āsiyāṭik sosaiṭī āph beṅgāl‌ ku iccina adhyakṣōpan'yāsamulō sar viliyam jōns

ఉర్దూ
ఉర్దూ అనేది కవులు, లేదా షాయర్ల భాషగా ప్రత్యేకత సంతరించుకుంది. గోల్కొండ రాజవంశానికి చెందిన చక్రవర్తి మరియు భారతదేశంలోని హైదరాబాద్ నగర వ్యవస్థాపకుడైన మొహమ్మద్ కులీ కుతుబ్ షా చక్రవర్తి (1580-1611) ఒక నిష్ణాతుడు మరియు సంపూర్ణమైన కవి కూడా. పర్షియన్, తెలుగు మరియు ఉర్దూలో ఇతను కవిత్వం వ్రాశాడు. 1922 లో ప్రచురితం కావడం ద్వారా వెలుగులోకి వచ్చిన దివాన్ (పద్య సంపుటి)తో ఈయనకు మొదటి ఉర్దూ కవి అనే ఘనకీర్తి లభించింది.
Urdū
Urdū anēdi kavulu, lēdā ṣāyarla bhāṣagā pratyēkata santarin̄cukundi. Gōlkoṇḍa rājavanśāniki cendina cakravarti mariyu bhāratadēśanlōni haidarābād nagara vyavasthāpakuḍaina moham'mad kulī kutub ṣā cakravarti (1580-1611) oka niṣṇātuḍu mariyu sampūrṇamaina kavi kūḍā. Parṣiyan, telugu mariyuurdūlō itanu kavitvaṁ vrāśāḍu. 1922 Lō pracuritaṁ kāvaḍaṁ dvārā velugulōki vaccine divān (padyasampuṭi) tō īyanaku modaṭi urdū kavi anē ghanakīrti labhin̄cindi.

نا جاۓ جیا تل یک باج پیا نا جاۓ پیا پیالا باج پیا
نہ لحظہ کے بغیر نہ کے بغیر
The goblet lies deserted without my beloved,
Life is a burden without my beloved
నా ప్రియసఖి లేకుంటే మధుపాత్ర కూడా నిర్జన భూమే కదా,
నా ప్రేమతోడు లేని ఈ జీవితం భారమే కదా
Nā priyasakhi lēkuṇṭē madhupātra kūḍā nirjana bhūmē kadā,
nā prēmatōḍu lēni ī jīvitaṁ bhāramē kadā
The author does not desire food or drink in the absence of his beloved. He feels that living without his beloved is painful and burdensome.
نا جاۓ کیا اما جاۓ کھیا کروں صبوری بن پیا کہیتھے
نہ لیکن کہا بغیر کیسے
How must I endure in the absence of my love,
Where the words reassure, the action betrays
నా ప్రేమ లేని ఈ జీవితాన్ని నేనెలా భరించగలను,
మాటలు బాసలు చేసిన చోటే, చేతలు ద్రోహం చేశాయి
Nā prēma lēni ī jīvitānni nēnelā bharin̄cagalanu,
māṭalu bāsalu cēsina cōṭē, cētalu drōhaṁ cēśāyi
The author finds it impossible to persevere without his beloved. believes that it is easy for someone to ask him to be patient but acting upon such advice is out of question for him.
نا جاۓ بیسیا مل سے اس کدھیں ہے کوڑ بڑا وہ جس عشق نہیں
نہ بیٹھا کبھی جاہل کو
Benighted is one who has loved not,
Never would I prefer him as a comrade
ప్రేమ పంచలేని హృదయం ఒక అజ్ఞాన గాఢాంధకారం,
నేనెప్పుడూ అతడిని ఒక సహవర్తిగా భావించను
Prēma pan̄calēni hr̥dayaṁ oka ajñāna gāḍhāndhakāraṁ,
nēneppuḍū ataḍini oka sahavartigā bhāvin̄canu
The author views people who have not experienced love as unenlightened and would never consider their companionship.
نا جاۓ دیا پند کچ کوں دوانے پند کو دوانے مج دے نہ شہ قطب
نہ کچھ کو دیوانہ مجھ
O Qutub Shah, do not give counsel to an enamored fool such as me
For counsel cannot be given to fools
ఓ కుతుబ్ షా, ప్రేమ పిపాసి అయిన నాలాంటి మూర్ఖుడికి హితబోధ చేయవద్దు
మూర్ఖులకు చేసే హితబోధ ఎప్పటికీ వ్యర్థమే
Ō kutub ṣā, prēma pipāsi ayina nālāṇṭi mūrkhuḍiki hitabōdha cēyavaddu
mūrkhulaku cēsē hitabōdha eppaṭikī vyarthamē
The author, referring to himself in the third person, asks to stop advising him to mend his foolish ways because good counsel does not affect those who have fallen in love.