" మీ భాషను మార్చుకోండి, అప్పుడు మీ ఆలోచనలు మారుతాయి."
కార్ల్ ఆల్‌బ్రెక్ట్

బీరెల్లి శేషి, ఎం.డి.

నన్ను మొదట చదవండి

పత్రాలు మరియు వాటి అనువాదముల గురించి వివరణాత్మకమైన ఒక గమనిక

బీరెల్లి శేషి, ఎం.డి.
BSeshi@multilanguaging.org
BSeshi@outlook.com

ఇక్కడ పొందుపరచిన పత్రాలు, వాటి అనువాదములతో సహా ఈ క్రిందివిధంగా ఉన్నాయి:
పత్రము 1 – వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులవారి సందేశము
పత్రము 2 – విషయాంశము, పాఠ్యాంశములు మరియు బోధనా ప్రణాళిక
పత్రము 3 – జీవితచరిత్రలు
పత్రము 4 – తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs) మరియు జవాబులు, మొదటగా నన్ను చదవండి మరియు చివరగా నన్ను చదవండి – తర్వాత ఏమిటి?

డా. శేషి గారు ఈ పత్రాలను తొలుతగా ఆంగ్లములో వ్రాశారు.
అవి తెలుగు, హిందీ, ఉర్దూ మరియు సంస్కృతము ఈ నాలుగు భాషల లోనికి స్థానిక భాషా నిపుణులు/ప్రావీణ్యులచే అనువదించబడ్డాయి.

ప్రాజెక్టు పత్రాల యొక్క అనువాదములు మూడు విభిన్న మార్గాలలో సమర్పించబడుతున్నాయి:

i) నిరంతరాయ ఏక – భాష లేదా స్వతంత్ర రూపము (పత్రాలు 1-4):

  • ఇవి ఎం.ఎస్ వర్డ్ ఉపయోగించి తయారు చేయబడిన వచన దస్త్రాలు.
  • అవి, అసలు/మూలభాష (ఇంగ్లీష్) లేదా లక్ష్యిత భాష యొక్క లిపి అంతరీకరణ ఇవ్వబడకుండా ఒకే ఒక్క లక్ష్యిత – భాష అనువాదమును కలిగి ఉంటాయి.
  • ఇంగ్లీష్ లో ఉన్న ప్రతి అసలు పత్రమునకూ, తెలుగు, హిందీ, ఉర్దూ మరియు సంస్కృతమునకు విడివిడిగా అనువదించబడిన పత్రము ఉంది.

ii) వాక్యము వారీగా (త్రైతము) రూపము (పత్రాలు 1-4):

  • ఇవి కూడా ఎం.ఎస్ వర్డ్ ఉపయోగించి తయారు చేయబడిన వచన దస్త్రాలు.
  • ఇంగ్లీష్ లో ఉన్న ప్రతి అసలు పత్రమునకూ, తెలుగు, హిందీ, ఉర్దూ మరియు సంస్కృతమునకు విడివిడిగా అనువదించబడిన పత్రము ఉంది.
  • అయినప్పటికీ, అవి వాక్యము వారీగా అమర్చబడి, మరియు అసలు/మూల భాష (ఇంగ్లీష్) మరియు లక్ష్యిత భాష యొక్క లిపి అంతరీకరణ అమరికతో ఇవ్వబడి ఉన్నాయి.
  • ఉదాహరణకు, సంస్కృతము కొరకు ఒక పత్రము ఈ క్రిందివాటిని కలిగియుంది.
    • ఇంగ్లీష్ లోని అసలు వాక్యము.
    • దేవనాగరి లిపిలో ఒక సంస్కృత అనువాదము.
    • లాటిన్ అక్షరాలలో సంస్కృత వాక్యము యొక్క ఉచ్ఛారణ/లిప్యంతరము.
  • ప్రతి త్రైత సంగ్రహము ఒక ఏకైక – స్థలపు రేఖతో వేరు చేయబడి ఉంది; పేరాగ్రాఫుల యొక్క ముగింపులు పేరాగ్రాఫు చిహ్నముతో సూచించబడి ఉన్నాయి, ¶.

iii) వ్యాప్తి పత్రాలు ఉపయోగించి పదము-వారీగా ఉండే అనువాద రూపము (పత్రాలు 1, 2 మరియు 4):

  • పైవాటిలాగా కాకుండా వ్యాప్తి పత్రాలు ఎం.ఎస్.ఎక్సెల్ ఉపయోగించి తయారు చేయబడ్డాయి.
  • ప్రతి అసలు పత్రమునకూ, అసలు భాష, సంబంధిత ఆయా లిపులలో నాలుగు అనువాద భాషలన్నింటి యొక్క పదము-వారీగా అనువాదములు మరియు లాటిన్ అక్షరాలలో నాలుగు సంబంధిత భాషల లిపి అంతరీకరణలను కలిగి ఉంటూ కేవలం ఒక ఏకైక పత్రము మాత్రమే ఉంది.
  • ఈ పత్రము వాక్యము వారీగా చేయబడిన అనువాదముతో అమర్చబడి ఉంది.
    ఆవిధంగా, వ్యాప్తి పత్రములో ఒక్కొక్క వాక్యానికీ తొమ్మిది ప్రవేశపదాలు/వరుసలు, తదుపరి ఒక ఖాళీ వరుస జొప్పించబడి ఉన్నాయి.

ఒక భాషలో ఒకే పదానికి (ఉదాహరణకు ఇంగ్లీషులో "వాటర్" అనే పదానికి) మరొక భాషలో సముచితమైన రెండు పదాలు ఉండగల సాధ్యత ఉంది (ఈ ఉదంతములో సంస్కృతములో "జల్" మరియు "ఉదక" అనే పదాలు).
అదే విధంగా, ఇంగ్లీషులో "హోప్డ్ (hoped)" వంటి పదానికి, ఉర్దూలో సమానంగా సముచితమైన సమాసాలు ఉండవచ్చు("తవాఖ్ఖో కీ జాతీ" మరియు "ఉమ్మీద్ కీ జాతీ").
దానికి తగ్గట్టుగానే, ఇంగ్లీషులో "ప్రోవిడెన్స్ (providence)" వంటి పదానికి, తెలుగులో ("భగవంతుడు" మరియు "దేవుడు") మరియు హిందీలో ("ఈశ్వర్" మరియు "భగవాన్") సమానంగా సరిపోయే రెండు పదాలు ఉండవచ్చు.
ఈ భాషలలో ఒకదాని నుండి ఇంగ్లీష్ లోనికి గనక అనువాదం చేయవలసివచ్చినప్పుడు కూడా ఇదే సమస్య ఏర్పడవచ్చు—ఉదాహరణకు, "హోప్డ్ (hoped)" అనే పదం "విష్డ్ (wished)," "లాంగ్డ్(longed)" మరియు "డిజైర్డ్ (desired)" వంటి సముచితమైన అనేక పర్యాయ పదాలను కలిగియుంది.
దీనిని మనసులో ఉంచుకొని, ఈ మూడు రూపాలు అన్నింటిలోనూ- ప్రతి భాషలోనూ ఇవ్వబడిన ప్రతి వాక్యములోనూ ఒక పదము కొరకు సందర్భానికి తగ్గట్టుగా అనువాదము యొక్క స్థిరత్వమును నిర్వహించడానికై తగు శ్రద్ధ తీసుకోవడమైనది మరియు పునః పరిశీలన సహా చేయడమైనది.
అనేక అర్థాలు ఉన్న కొన్ని పదాల గురించి తరగతిలో చర్చించబడుతుంది.

ఈ భాషలలో (తెలుగు, హిందీ, ఉర్దూ మరియు సంస్కృతం) కొన్నింటిలో లేదా అన్నింటిలోనూ అనేక సామాన్య పదాలు లేదా మూలాలు ఉండవచ్చు,ఐతే ఆ భాషల యొక్క విభిన్న లిపిల కారణంగా ఇది అంత స్పష్టంగా కనిపించదు.
లిపి అంతరీకరణను ఉపయోగించడంలోని ఉద్దేశ్యము:

    1. దాగియున్న వాటి సంబంధాలను వెల్లడించుట.
    2. ఈ లిపులతో పరిచయం లేని వ్యక్తులకు సైతమూ లక్ష్యిత భాష పట్ల ఒక రకమైన స్పృహ కలిగేలా చేయుట మరియు ప్రతిపాదిత తులనాత్మక భాషా – అభ్యసన పద్ధతి పట్ల వారు ఒక మెరుగైన అవగాహన రూపొందించుకునేలా చేయుట.
    3. అంతిమంగా ఈ ప్రతిపాదన కొరకు అంతర్జాలము (వెబ్) పైన సాధ్యమైనంత ఎక్కువగా పాఠకలోకాన్ని చేరుకునేలా చేయుట, తద్వారా దానిని సంపూర్ణ విస్తృతి మేరకు మదింపు చేయగలుగుట.

"మన భాషల" విషయాంశములో భాగంగా తరగతి పాఠ్యపుస్తకాల పాఠాలను తీసుకున్నప్పుడు:

    1. ప్రీ స్కూల్ లేదా నర్సరీ స్కూల్ లో విద్యార్థులు సంబంధిత భాషా లిపులను బాగా నేర్చుకొని ఉంటారు కాబట్టి లిపి అంతరీకరణల యొక్క అవసరం ఉండబోదు.
    2. తరగతి పాఠ్యపుస్తకము ఐదు -వాక్యాల- వాక్యము వారీ రూపములోని అనువాదమును అనుసరించవచ్చు లేదా ఒక పాఠము పూర్తిగా ఇంగ్లీష్ లోనూ దాని తర్వాత వరుసగా తెలుగు, హిందీ, ఉర్దూ మరియు సంస్కృతములో ఆ పాఠము పూర్తిగానూ ఉండవచ్చు.
    3. అయినప్పటికీ, "పదపుస్తకము" అనబడే ప్రతి-పదానికి-పదం రూపము, తదుపరిగా ఐదు-వాక్యాలకు ఐదు-వాక్యాల అనువాద రూపమును ఆవశ్యకంగా అనుసరిస్తుంది, ఎందుకంటే, విద్యార్థులు ఐదు భాషలలోనూ పదం-పదమునూ, వాక్యం-వాక్యాన్నీ ప్రక్క ప్రక్కన ఉంచుకొని తనిఖీ చేసుకోవడానికి వీలు కలిగేలా చేయడం ఈ పద్ధతి యొక్క ఉద్దేశ్యము.

తరగతి పాఠ్యపుస్తకాల మాదిరి కాకుండా, పత్రాలు 1-4 ప్రధానంగా తల్లిదండ్రులు, బోధకులు, విధాన నిర్ణేతలు మరియు ఆసక్తి గల పౌరుల కొరకు ఉద్దేశించబడిన ఆధునిక పత్రాలు అని తదుపరిగా గుర్తించాల్సి ఉంటుంది.
పొడవైన వాక్యాలు వ్యాప్తిపత్రమును పదపుస్తకము రూపములో చదవడానికి మరీ అతిపెద్దవిగా, కుదురుబాటు లేనివిగా మారవచ్చు.
అంతేకాక, ఒక వ్యక్తి, ప్రామాణిక అనువాదము (ఐదు-వాక్యాల రూపము లేదా పూర్తి పాఠము రూపము) లోపున స్పష్టంగా ఒక పదము యొక్క పదం-పదం అనువాదము కొరకు ఒక పదపుస్తకమును చదివితీరాలని మనం ఆశించజాలము.
ఏది ఏమైనప్పటికీ, ఈ పత్రాలు ఈ ప్రతిపాదన యొక్క అంతర్లీనంగా దాగియున్న ఆవశ్యక భావజాలములను ప్రదర్శించుటకు మాత్రమే కాకుండా, కొత్త భాషా అభ్యసన పద్ధతి యొక్క పరిమితులను పరిశోధించుటకు మరియు గమనించినట్లుగా వాటిని అత్యంత శ్రద్ధగా గ్రంధస్థం చేయడానికి కూడా ఉదాహరణలుగా ఉత్పాదనాత్మకంగా వినియోగించుకోబడుతున్నాయి.
విద్యార్థుల కొరకు చిన్న, సరళమైన వాక్యాలు సూచికగా పాఠ్యపుస్తకాల పాఠాలను రూపొందించునప్పుడు ఈ గ్రాహ్యతలు అందుబాటులోనికి రాగలవని ఆశించబడుతోంది, అయితే అది తరగతి యొక్క స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది.
ఇది ఒక క్లిష్టమైన మరియు ముఖ్యమైన ప్రాజెక్టు అని, మరియు దీని అమలు ప్రారంభము కాగానే, రాబోయే సూచిత సలహాల నుండి నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి పరచడానికీ ఎంతో ఎక్కువగా ఉందనీ చెప్పడం సురక్షితంగా ఉంటుంది.