" మీ భాషను మార్చుకోండి, అప్పుడు మీ ఆలోచనలు మారుతాయి."
కార్ల్ ఆల్‌బ్రెక్ట్
బీరెల్లి శేషి, ఎం.డి.
తక్షణ పత్రికాప్రకటన విడుదల కొరకు
(ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ మరియు సంస్కృతంలో)
సంప్రదించండి:
బీరెల్లి శేషి, ఎం.డి.
బహు∞భాషావాదం కొరకు డా. శేషి గారి అంతర్జాతీయ కేంద్రము
బహు∞భాషావాదం కొరకు శేషి అకాడమీ
"వైవిధ్యం మా పరంపర"
టెలిఫోన్: (310) 971-1810
యుఆర్‌ఎల్: www.multilanguaging.org
ఇ-మెయిల్: bseshi@multilanguaging.org
మీరు ఏకకాలములో (ఒకే సమయములో) ఐదు భాషలను నేర్చుకోగలుగుతారా?
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ మరియు సంస్కృతమే ఎందుకు?
వైల్డర్, కెవై, యుఎస్ఎ, తేదీ: 03/22/2021
గమనిక: వాస్తవానికి, ఈ పత్రికా ప్రకటన యొక్క నవీకరించబడిన సంస్కరణ, మరియు ఆంగ్లంలో మాత్రమే, 03/22/2021 న జారీ చేయబడింది; ఆంగ్లం, భారతీయ భాషల క్రింద చూడండి.
"బహు-భాషావాదం" అనేది ఒక కొత్త బహుళభాషా లేదా బహుభాషా అభ్యసన ప్రతిపాదన.
అది అనేక భాషలను ఏకకాలములో నేర్చుకోమని సలహా ఇస్తుంది మరియు అందుకు వీలు కలిగిస్తుంది.
ఏకకాలములో ఐదు భాషలను ఎలా నేర్చుకోవాలో అది చూపిస్తుంది.
అవి మూడు భారతదేశవ్యాప్త భాషలు (హిందీ, ఉర్దూ మరియు సంస్కృతం), ఒక అంతర్జాతీయ భాష (ఇంగ్లీష్) మరియు ఒక స్థానిక భాష (తెలుగు, ఇది డా. శేషి గారి మాతృభాష అయి ఉంది).
అన్నీ మొదటి తరగతి(ఉన్నతి లేదా ప్రమాణము) నుండి ప్రారంభమవుతాయి.
ఏదైనా ఒక స్థానిక భాష తెలుగును స్థానాంతరము చేయవచ్చు.
భారతదేశం యొక్క నిర్దిష్ట పరిస్థితి నుండి ఈ ప్రతిపాదన ఉత్పన్నమయింది.
ఈ పద్ధతి ఒక సాధారణ ఏర్పాటులోనూ మరియు ప్రపంచము యొక్క అన్ని భాషలకూ వర్తిస్తుంది.
బహుభాషావాదం అనేది "వరప్రసాదులు" అయిన వ్యక్తులకే ఏకైక సామ్రాజ్యం కాకూడదు.
బహు భాషావాదం పద్ధతిని ఉపయోగించడం ద్వారా ఎవ్వరైనా ఆ అవకాశాన్ని పొందవచ్చు.
ప్రతి తరగతి లోని ప్రతి పాఠం యొక్క విషయం లేదా పాఠ్యాంశము ఈ అన్ని ఐదు భాషలలోనూ ఒకేలా
అది అన్ని ఐదు భాషల యొక్క ప్రాతినిధ్య విషయసామగ్రిని చేరి ఉంటుంది.
విభిన్న విషయాంశముతో మూడు భాషలను బోధించడం భారతదేశములో ప్రస్తుతమున్న విద్యా వ్యవస్థలోని సామాన్య విధానము.
వివిధ తరగతుల స్థాయిలోని పాఠ్యాంశప్రణాళికలో విభిన్న భాషలు ప్రవేశపెట్టబడుతున్నాయి.
చెప్పదలచుకుంటున్న అతి ముఖ్యమైన, అసలైన మరియు కీలకమైన అంశము ఏమిటంటే, విభిన్న భాషల మధ్య ఒకే మాదిరిగా ఉన్న విషయాంశము, విభిన్న భాషలలో విభిన్న విషయాంశము యొక్క ప్రస్తుత పద్ధతి కంటే ఎక్కువ సమర్థవంతమైనది.
విద్యార్థులు ఐదు భాషలనూ సహ-సంబంధితంగా మరియు ఏకకాలములో తమకు తాముగా నేర్చుకోవడంలో లీనమయ్యేలా వారికి వీలు కల్పించడానికి గాను ఈ ప్రతిపాదన విషయాంశపు పరిమాణమును ఉద్దేశ్యపూర్వకంగా పరిమితి చేస్తుంది.
పాఠాలను ఎంచుకోవడానికి మరియు అనుబంధ విషయ సామగ్రిని సృష్టించుకోవడానికి ఈ ప్రతిపాదన తగు మార్గదర్శక సూత్రాలను అందిస్తుంది.
ప్రతిపాదన మరియు తత్సంబంధిత విషయాంశాల యొక్క అనేక అంశాల సమగ్రమైన వివరణ సులభంగా అర్థం కాదగిన మరియు వాడుకదారు-స్నేహపూర్వకమైన " ప్రశ్న మరియు జవాబు" రూపములో ఇవ్వబడింది.
అవి ఈ ప్రతిపాదన యొక్క సమగ్రమైన భావనను అందజేస్తాయి.
ఈవెబ్‌సైట్ ఈ పత్రాలను అన్ని భాషలలోనూ పొందుపరుస్తుంది – ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ మరియు సంస్కృతం – తద్వారా అవి ఈ భాషలో ఏ భాషనైనా మాట్లాడేవారికి అర్థమవుతాయి.
ఈ వెబ్‌సైట్, సంబంధిత బహు భాషావాదం పదపుస్తకాలను కూడా ఒక వ్యాప్తి పత్రము రూపములో పొందుపరుస్తుంది.
అది ఒక అధ్యయన సాధనము.
అవి ఈపత్రాల యొక్క పదం-వారీ అనువాదాలను ఐదు భాషలలోనూ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో అందజేస్తాయి.
అవి, ఈ ఐదు భాషల వ్యాప్తంగా పదపుస్తకము విషయాంశమును పదము తర్వాత పదమును, మరియు వాక్యము తర్వాత వాక్యమును ప్రక్క ప్రక్కనే ఉంచుకొనిపరిశీలన చేసుకోవడానికి విద్యార్థి/ పాఠకుడికి వీలు కలిగిస్తాయి.
భాషల మధ్య వాక్యనిర్మాణ వ్యత్యాసాలను విద్యార్థి తప్పనిసరిగా అనుభవించుటలో సహాయపడటానికి అవి రూపకల్పన చేయబడ్డాయి.
అవి ఈ సహ-సంబంధిత అభ్యసనశక్తి మరియు వాగ్ధాటి నిర్మాణ పద్ధతిలోనికి ఒక గ్రాహ్యతను అందిస్తాయి.
చివరగా, ఈ వెబ్‌సైట్, ఐదు భాషలలోనూ ఏకకాలములో బోధించే రెండు నమూనా పాఠములను పొందుపరుస్తుంది.
వివరాల కొరకు సందర్శించండి, www.multilanguaging.org.
బహు-భాషా వాదం పద్ధతిని సంభావ్యతగా అలవరచుకొనడాన్ని చూచుటకు, ఉదాహరణకు, ఏడు ఐరోపా భాషలను బోధించుట/నేర్చుకొనుటకు, సంబంధిత వెబ్‌సైట్‌ని, european.multilanguaging.org, సందర్శించండి.
అనేక భాషలను నేర్చుకోవడమనేది విద్యార్థి యొక్క ఆలోచనా శక్తికి జోడింపునిస్తుంది.
ఇతర బడి పాఠ్యాంశాలలో మెరుగైన పనితీరును కనబరచడంలో ఇది సహాయపడవచ్చు.
ఇది ఆల్జీమర్స్ వ్యాధి (వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి మరియు ఆలోచనా నైపుణ్యాలను క్రమేపీ తగ్గించివేసే మెదడు రుగ్మత) రాకడను ఆలస్యం చేస్తుంది:వ్యక్తికి ఎన్ని ఎక్కువ భాషలు తెలిసి ఉంటే, రాకడ అంత ఆలస్యం అవుతుంది.
భవిష్యత్ వృద్ధుల కొరకు అనివార్యమైన ఆల్జీమర్స్ పై ఇది బీమా లాగా పని చేస్తుంది.
ఇక ముందుకు వెళుతూ, సముచితమైన పాఠ్యపుస్తకాలను తయారు చేయాల్సిన అవసరం ఉంది.
దీనికి బాహ్య వనరుల నుండి నిధుల కేటాయింపు తోడ్పాటు కావాల్సి ఉంటుంది.
దీనికి సముచిత వ్యక్తులు, సంస్థలు మరియు ఏజెన్సీలు, ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల నుండి సమన్వయము మరియు సహకారము కూడా కావాల్సి ఉంటుంది.
అనువైన స్థితిని అందించడానికి గాను పాఠ్యపుస్తకాలు (మరియు ఇతర వనరుల సామాగ్రి) రూపొందించబడి ప్రణాళిక చేయబడతాయి.
చదువుకోవడానికి ఇది ఐదు భాషల (తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ మరియు సంస్కృతం) ఉప-సమ్మేళన పాఠ్యాంశాలు లేదా ఉప- కరదీపికలను ఎంచుకోవడంలో ఇది సహాయపడుతుంది.
అవి ముద్రిత రూపము మరియు ఆన్‌లైన్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటాయి.
పఠనాసామాగ్రి తరగతి గది బోధనకు మరియు ఆసక్తి గల వ్యక్తులచే వయోజన అభ్యసనానికి లేదా అభిజ్ఞతా నిధి అభివృద్ధికై అధ్యయన సమూహాల కొరకు సరిసమానంగా సరిపోయే విధంగా రూపకల్పన చేయబడి, అనువుగా తీర్చిదిద్దబడుతుంది.
బహుళార్థసాధక పాఠ్యపుస్తక ఉత్పత్తి నిర్ణయాలు/ ప్రాధాన్యతలు సహజంగానే వివిధ హక్కుదారుల నుండి వారి ప్రాథమ్యాలను పరిగణించుకుంటూ ఇచ్చే సలహా సూచనలచే దిశానిర్దేశం చేయబడుతుంటాయి.
అందులో నిధులను కేటాయించు సంస్థలు, ప్రభుత్వ విభాగాలు మరియు విద్యావంతులు చేరి ఉంటారు.
అనేక భాషలను ఏకకాలములో, సమర్థవంతంగా మరియు ఆనందదాయకమైన బోధన మరియు అభ్యసనమును ప్రోత్సహించుటకు గాను, బహు ∞ భాషావాదం కొరకు డా. శేషి గారి అంతర్జాతీయ కేంద్రము మరియు బహు ∞ భాషావాదం కొరకు శేషి అకాడమీ నెలకొల్పబడ్డాయి.
అవి భారతదేశం యొక్క భాషాపరమైన, సాంస్కృతిక మరియు అంతిమంగా జాతీయ సమగ్రత పురోగమనానికి దోహదపడతాయని ఆశించబడుతున్నాయి.
వైవిధ్యం మా పరంపర.
###
ఈ విషయం గురించి ఒకవేళ మీకు మరింత సమాచారం అవసరమైతే మరియు మీ ప్రశ్నలకు జవాబులు పొందాలంటే, దయచేసి సందర్శించండి www.multilanguaging.org, బీరెల్లి శేషి, ఎం.డి గారికి (310) 971-1810 పైకాల్ చేయండి లేదా bseshi@multilanguaging.org లేదా bseshi@outlook.com కి ఇమెయిల్ చేయండి.