" మీ భాషను మార్చుకోండి, అప్పుడు మీ ఆలోచనలు మారుతాయి."
కార్ల్ ఆల్‌బ్రెక్ట్

బీరెల్లి శేషి, ఎం.డి.

పాఠకులకు గమనిక

ప్రియమైన పాఠకులారా:

ఈ వెబ్‌సైట్ పై ఉంచిన వివిధ పత్రాల (డాక్యుమెంట్ల)ను చదువుతున్నందుకు గాను ధన్యవాదాలు.
మీరు గుర్తించిన దోషాలు ఏవైనా ఉంటే నాకు తెలియజేస్తే వాటిని సరిచేయగలను కాబట్టి అలా చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.

ఇంగ్లీష్ నుండి తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం భాషల లోనికి అసలు పత్రాలయొక్క అనువాదాలు, సేవకు రుసుము ప్రాతిపదికన వృత్తిపరమైన అనువాదకంపెనీలచే ఏర్పాటు చేయబడిన స్థానిక వృత్తినిపుణులు/ ప్రావీణ్యులచే నిర్వర్తించబడ్డాయి.
అనువాదకులు నాకు తెలియని అజ్ఞాత వ్యక్తులు.
యదార్థమైన మరియు సందర్భోచితమైన అర్థాలతో అనువాదాలు మరియు అవసరాన్ని బట్టి ఏకభాషా, వాక్యము-వారీగా మరియు పదము-వారీగా అనువాదాలను అందజేయవలసిందిగా వారికి సూచించడమైంది.
ఈ లక్ష్యము సాధించబడిందని ఆశించడమైనది.
ఈ విషయములో అచంచలమైన సహకారము మరియు అంకితభావమును చూపినందుకు గాను అనువాదకులు మరియు కంపెనీల సిబ్బందికి నేను ధన్యవాదాలు తెలియజేయాల్సి ఉంది.
ఏవైనా మిగిలిపోయిన అనువాదాల కొరతలు మరియు/ లేదా తప్పిపోయినవాటికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను.
చేర్పులు మరియు/లేదా తొలగింపులు కలిగించిన ఏవేని అసౌకర్యాలకు సంబంధించి మీ అవగాహనను తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను.
పాఠకులుగా మీరు, అటువంటి సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చిన పక్షములో ఒక విలువైన దోహదకారులు కాగలుగుతారు; దయచేసి అందుకు వెనుకాడవద్దు.
మీ సహాయానికి ముందస్తుగా మీకు ధన్యవాదాలు.

విశ్వాసపాత్రులు,

బీరెల్లి శేషి, ఎం.డి.
feedback@multilanguaging.org