" మీ భాషను మార్చుకోండి, అప్పుడు మీ ఆలోచనలు మారుతాయి."
కార్ల్ ఆల్‌బ్రెక్ట్

బీరెల్లి శేషి, ఎం.డి.

India’s National Symbols
భారతదేశం యొక్క జాతీయ చిహ్నములు
Bhāratadēśaṁ yokka jātīya cihnamulu

BeerelliSeshi, M.D.
బీరెల్లి శేషి, ఎం.డి.
Bīrelli śēṣi, eṁ.Ḍi.
BSeshi@multilanguaging.org
BSeshi@outlook.com

null
The Lotus flower is born in muddy water and rises to the surface to bloom.
తామర పువ్వు మురికి నీటిలో పుట్టి ఉపరితలము పైకి వచ్చి విరబూస్తుంది.
Tāmara puvvu muriki nīṭilō puṭṭi uparitalamu paiki vacci virabūstundi.
null
A male Peacock displays his charms using ornamental feathers and a majestic dance.
ఒక మగ నెమలి దానికి అలంకారయుతమైన ఈకలను ఉపయోగించి మనోహరంగా నృత్యం చేస్తూ తన మనోజ్ఞతను ప్రదర్శిస్తుంది.
Oka maga nemali dāniki alaṅkārayutamaina īkalanu upayoginchi manōharaṅgā nr̥tyaṁ cēstū tana manōjñatanu pradarśistundi.
null
The English name for the Mango fruit came from the Tamil word "mankay".
మామిడి పండు ఆంగ్లనామము "మాంకాయ్" అనే తమిళ పదం నుండి వచ్చింది.
Māmiḍi paṇḍu āṅglanāmamu "māṅkāy" anē tamiḷa padaṁ nuṇḍi vaccindi
null
The Gangetic Dolphin is India’s national aquatic animal and an endangered species.
గంగానదీ డాల్ఫిన్ భారతదేశం యొక్క జాతీయ జలచరము మరియు అంతరించిపోతున్న ఒక జాతిగా ఉంది.
Gaṅgānadī ḍālphin bhāratadēśaṁ yokka jātīya jalacaramu mariyu antarin̄cipōtunna oka jātigā undi.
null
The Cobra, when threatened, raises its menacing hood.
తాచుపాము బెదిరినప్పుడు ప్రమాదకరమైన దాని పడగను ఎత్తుతుంది.
Tācupāmu bedirinappuḍu pramādakaramaina dāni paḍaganu ettutundi
null
A Bengal Tiger’s stripes are as unique as human fingerprints.
బెంగాల్ పులి యొక్క చారలు, మనిషి వేలిముద్రలవలె విశిష్టంగా ఉంటాయి.
Beṅgāl puli yokka cāralu maniṣi vēlimudralavale viśiṣṭaṅgā uṇṭāyi
null
The Elephant is a very intelligent land animal with three times as many brain cells as in humans.
ఏనుగు మనిషి కంటే మూడు రెట్లు మెదడు కణాలు ఎక్కువగా ఉన్న చాలా తెలివైన భూచర జంతువు.
Ēnugu maniṣi kaṇṭē mūḍu reṭlu medaḍu kaṇālu ekkuvagā unna cālā telivaina bhūcara jantuvu.
null
Prince Siddhartha Gautama became the Buddha under a Banyan Tree, and the tree came to be known as the "Bodhi Vriksha".
యువరాజు సిద్ధార్థ గౌతముడు ఒక మర్రి చెట్టు కింద బుద్ధుడయ్యాడు, ఆ చెట్టు "బోధి వృక్షము" గా ప్రసిద్ధి చెందింది.
Yuvarāju sid'dhārtha gautamuḍu oka marri ceṭṭu kinda bud'dhuḍayyāḍu, ā ceṭṭu"bōdhi vr̥kṣamu" gā prasid'dhi cendindi
null
The Ganga/Ganges is India’s biggest river and is sacred to Hindus.
గంగానది భారతదేశం యొక్క అతిపెద్ద నది మరియు హిందువులకు పవిత్రమైన నది.
Gaṅgānadi bhāratadēśaṁ yokka atipedda nadi mariyu hinduvulaku ati pavitramaina nadi.
null
Kangchenjunga (Himalayas) is India’s highest and the world’s third highest mountain peak.
కాంచనజంగా (హిమాలయాలు) భారతదేశపు ఎత్తైన మరియు ప్రపంచంలో మూడవ ఎత్తైన పర్వత శిఖరము.
Kān̄canajaṅgā (himālayālu) bhāratadēśapu ettaina mariyu prapan̄canlō mūḍava ettaina parvata śikharamu.

*The opinion is divided on whether the Bodhi tree was a banyan tree ("vatavriksha" in Sanskrit) or a peepal tree ("ashvattha" in Sanskrit).
*బోధివృక్షము అనేది ఒక మర్రి వృక్షమా (సంస్కృతములో "వటవృక్ష") లేదా రావి వృక్షమా (సంస్కృతములో "అశ్వథ్థవృక్ష") అనే విషయములో భేదాభిప్రాయాలు ఉన్నాయి.
*Bōdhivr̥kṣamu anēdi oka marri vr̥kṣamā (sanskr̥tamulō "vaṭavr̥kṣa") lēdā rāvi vr̥kṣamā (sanskr̥tamulō "aśvaththavr̥kṣa") anē viṣayamulō bhēdābhiprāyālu unnāyi.