
" మీ భాషను మార్చుకోండి, అప్పుడు మీ ఆలోచనలు మారుతాయి."
కార్ల్ ఆల్బ్రెక్ట్

బీరెల్లి శేషి, ఎం.డి.

ప్రియమైన పాఠకులారా:
ఈ వెబ్సైట్ ద్వారా ప్రయాణించడం మీకు ఆసక్తిదాయకమైన మరియు సమాచారయుతమైన అనుభూతిని కలిగించిందని నేను ఆశిస్తున్నాను.
తరచుగా అడిగే ప్రశ్నలు మరియు జవాబులతో సహా ఇందులో పొందుపరచిన పత్రాలను సమీక్షించే అవకాశం మరియు వాటి గురించి యోచించే కొంత సమయం మీకు లభించిందని నేను భావిస్తున్నాను.
ప్రతిపాదిత ఏకకాలిక బహు-భాషా బోధన భావన చాలా కొత్తది మరియు భిన్నమైనది.
ఇప్పటికీ మీకు కొన్ని ఆందోళనలు లేదా జవాబుదొరకని కొన్ని ప్రశ్నలు తప్పక ఉండి ఉంటాయి.
దయచేసి ఈ దిగువ ఇమెయిల్ చిరునామాపై నాకు వ్రాయడానికి ఏ మాత్రమూ సందేహించకండి.
ఇంకా, ఈ ప్రతిపాదన శాస్త్రీయ విచారణ యొక్క స్ఫూర్తితో సమ్మతింపజేయబడిందని మీరు గమనించి ఉంటారని కూడా నేను భావిస్తున్నాను.
ఈ ప్రతిపాదన యొక్క సమర్థతను ఇంకా పరిశోధించాల్సి ఉంటుంది మరియు నిర్ధారించాల్సి ఉంటుంది.
విభిన్న భాషలను విభిన్న తరగతుల స్థాయిలో పాఠ్యాంశ సరళి లోనికి ప్రవేశపెట్టినప్పటికీ సైతమూ విభిన్న విషయాంశముతో మూడు భాషలను బోధించడం నేటి రోజుల విద్యా వ్యవస్థలో నియమముగా ఉంది.
ఒక ప్రశ్న అడగాల్సి ఉంది, " ఒకే విషయాంశము లేదా విభిన్న విషయాంశముతో మూడు భాషలను బోధించడం- విషయంగా ముందస్తుగా నెలకొల్పుకోవలసిన కొలవదగ్గ ఫలితాంశ-పారామితుల పరంగా ఎక్కువ సమర్థవంతమైనది ఏది?"
ఏక కాలములో 4 లేదా 5 భాషలను బోధించడం పరిశోధన యొక్క తదుపరి స్థాయి అవుతుంది.
మూడు – భాషల ప్రయోగాత్మక విధానములో విద్యార్థుల పనితీరు ఫలితము ఆధారంగా అది చేపట్టబడుతుంది.
దార్శనికతగా అనేక ప్రయోగాత్మక రూపకల్పనలను చూడవచ్చు.
పరిశోధన యొక్క రూపకల్పన ఏదైనప్పటికీ, మొదట సముచితమైన పాఠ్యపుస్తకాలను తయారు చేయాల్సి ఉంటుంది.
అప్పుడు దానికి నిస్సందేహంగా బాహ్య నిధుల మద్దతు, మరియు సముచిత వ్యక్తులు, సంస్థలు మరియు ఏజెన్సీలు, ప్రభుత్వ లేదా ప్రైవేటు వ్యక్తుల సమన్వయము మరియు సహకారము అవసరమవుతుంది.
పేర్కొనబడిన ఐదు భాషల (తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ మరియు సంస్కృతం) ను చదవడానికి, ముద్రణ రూపము మరియు ఆన్-లైన్ రూపము రెండింటిలోనూ వాటి ఉప-సమ్మేళనాలు/ ఉప-గుణకాలను (మోడ్యూల్స్) ఎంచుకోవడానికి అనువైన సౌకర్యతను అందించడానికై పాఠ్యపుస్తకాలు (మరియు ఇతర వనరుల సామాగ్రి) రూపొందించి మరియు ప్రణాళిక చేయబడతాయి.
పఠనాసామాగ్రి తరగతి గది బోధనకు మరియు ఆసక్తి గల వ్యక్తులచే వయోజన అభ్యసనానికి లేదా అభిజ్ఞతా నిధి అభివృద్ధికై అధ్యయన సమూహాల కొరకు సరిసమానంగా సరిపోయే విధంగా రూపకల్పన చేయబడి, అనువుగా తీర్చిదిద్దబడుతుంది.
బహుళార్థ సాధక పాఠ్యపుస్తకాల ఉత్పాదనా నిర్ణయాలు/ ప్రాధాన్యతలు సహజంగానే వివిధ హక్కుదారుల నుండి, ప్రత్యేకించి నిధులు సమకూర్చే సంస్థలు, ప్రభుత్వ సంబంధిత మండలులు మరియు విద్యావేత్తల సలహాలచే వారి ప్రాధాన్యతల పరిగణనలో మార్గదర్శనం పొందుతుంటాయి.
ఈ ప్రాజెక్టును పరిపక్వతకు తీసుకువచ్చే ఉద్దేశ్యముతో అవసరమైన మద్దతును పొందే దిశగా మరియు సమకూర్చే దిశగా నేను పని చేస్తూ ఉంటాను.
ఒక విధమైన బోధనా సామగ్రిని రూపొందించడమనేది నిస్సంశయంగా సవాలుతో కూడిన విషయముగా ఉంటుంది.
ఇది నాలుగు విభిన్న అక్షరమాలలు/లిపులకు వర్తిస్తుందనేది ప్రత్యేకించి సత్యమైన విషయము.
ఐతే దీనిని సమర్థవంతంగా సాధించవచ్చునని నాకు ధృఢమైన విశ్వాసం ఉంది.
దీనిని సామాజికంగా ఉపయోగకరమైన కృత్యముగా చేయుటకై పాఠకుల సూచిత సలహాలు సర్వోతృష్టమైనవిగా ఉంటాయి.
మీ అభిప్రాయాలను స్వాగతిస్తాను.
శుభాభినందనలతో,
బీరెల్లి శేషి, ఎం.డి.
feedback@multilanguaging.org