The documents included here, along with their translations, are:
ఇక్కడ పొందుపరచిన పత్రాలు, వాటి అనువాదములతో సహా ఈ క్రిందివిధంగా ఉన్నాయి:
Ikkaḍa ponduparacina patrālu, vāṭi anuvādamulatō sahā ī krindividhaṅgā unnāyi:
DOC1 – Founder and President’s Message
పత్రము 1 – వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులవారి సందేశము
Patramu 1 – vyavasthāpakulu mariyu adhyakṣulavāri sandēśamu
DOC2 – Content, Syllabus and Curriculum
పత్రము 2 – విషయాంశము, పాఠ్యాంశములు మరియు బోధనా ప్రణాళిక
Patramu 2 – viṣayānśamu, pāṭhyānśamulu mariyu bōdhanā praṇāḷika
DOC3 – Biographies
పత్రము 3 – జీవితచరిత్రలు
Patramu 3 – jīvitacaritralu
DOC4 – Frequently Asked Questions (FAQs) and Answers, Read Me First and Read Me Last—What Next?
పత్రము 4 – తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs) మరియు జవాబులు, మొదటగా నన్ను చదవండి మరియు చివరగా నన్ను చదవండి – తర్వాత ఏమిటి?
Patramu 4 – taracugā aḍigē praśnalu (FAQs) mariyu javābulu, modaṭagā nannu cadavaṇḍi mariyu civaragā nannu cadavaṇḍi – tarvāta ēmiṭi?
¶
Dr. Seshi wrote these documents originally in English.
డా. శేషి గారు ఈ పత్రాలను తొలుతగా ఆంగ్లములో వ్రాశారు.
Ḍā. Śēṣi gāru ī patrālanu tolutagā āṅglamulō vrāśāru.
They have been translated into the four languages Telugu, Hindi, Urdu and Sanskrit by native professionals/experts.
అవి తెలుగు, హిందీ, ఉర్దూ మరియు సంస్కృతము ఈ నాలుగు భాషల లోనికి స్థానిక భాషా నిపుణులు/ప్రావీణ్యులచే అనువదించబడ్డాయి.
Avi telugu, hindī, urdū mariyu sanskr̥tamu ī nālugu bhāṣala lōniki sthānika bhāṣā nipuṇulu/prāvīṇyulacē anuvadin̄cabaḍḍāyi.
¶
Translations of the project documents are presented in three different ways:
ప్రాజెక్టు పత్రాల యొక్క అనువాదములు మూడు విభిన్న మార్గాలలో సమర్పించబడుతున్నాయి:
Prājekṭu patrāla yokka anuvādamulu mūḍu vibhinna mārgālalō samarpin̄cabaḍutunnāyi:
¶
i) Continuous single-language or stand-alone format (DOCs 1-4):
నిరంతరాయ ఏక – భాష లేదా స్వతంత్ర రూపము (పత్రాలు 1-4):
Nirantarāya ēka – bhāṣa lēdā svatantra rūpamu (patrālu 1-4):
¶
- These are text files prepared using MS Word.
ఇవి ఎం.ఎస్ వర్డ్ ఉపయోగించి తయారు చేయబడిన వచన దస్త్రాలు.
Ivi eṁ.Es varḍ upayōgin̄ci tayāru cēyabaḍina vacana dastrālu.
- They consist of text of a single target-language translation without providing the original/source language (English) or transliteration of the target language.
అవి, అసలు/మూలభాష (ఇంగ్లీష్) లేదా లక్ష్యిత భాష యొక్క లిపి అంతరీకరణ ఇవ్వబడకుండా ఒకే ఒక్క లక్ష్యిత – భాష అనువాదమును కలిగి ఉంటాయి.
Avi, asalu/mūlabhāṣa (iṅglīṣ) lēdā lakṣyita bhāṣa yokka lipi antarīkaraṇa ivvabaḍakuṇḍā okē okka lakṣyita – bhāṣa anuvādamunu kaligi uṇṭāyi.
- For every original document in English, there is a separate translated document for Telugu, Hindi, Urdu and Sanskrit.
ఇంగ్లీష్ లో ఉన్న ప్రతి అసలు పత్రమునకూ, తెలుగు, హిందీ, ఉర్దూ మరియు సంస్కృతమునకు విడివిడిగా అనువదించబడిన పత్రము ఉంది.
Iṅglīṣ lō unna prati asalu patramunakū, telugu, hindī, urdū mariyu sanskr̥tamunaku viḍiviḍigā anuvadin̄cabaḍina patramu undi.
¶
ii) Sentence-by-sentence (triplet) format (DOCs 1-4):
వాక్యము వారీగా (త్రైతము) రూపము (పత్రాలు 1-4):
Vākyamu vārīgā (traitamu) rūpamu (patrālu 1-4):
¶
- These are also text files prepared using MS Word.
ఇవి కూడా ఎం.ఎస్ వర్డ్ ఉపయోగించి తయారు చేయబడిన వచన దస్త్రాలు.
Ivi kūḍā eṁ.Es varḍ upayōgin̄ci tayāru cēyabaḍina vacana dastrālu.
- For every original document in English, there is a separate translated document for Telugu, Hindi, Urdu and Sanskrit.
ఇంగ్లీష్ లో ఉన్న ప్రతి అసలు పత్రమునకూ, తెలుగు, హిందీ, ఉర్దూ మరియు సంస్కృతమునకు విడివిడిగా అనువదించబడిన పత్రము ఉంది.
Iṅglīṣ lō unna prati asalu patramunakū, telugu, hindī, urdū mariyu sanskr̥tamunaku viḍiviḍigā anuvadin̄cabaḍina patramu undi.
- However, they are arranged sentence by sentence and provide the original/source language (English) and transliteration of the target language.
అయినప్పటికీ, అవి వాక్యము వారీగా అమర్చబడి, మరియు అసలు/మూల భాష (ఇంగ్లీష్) మరియు లక్ష్యిత భాష యొక్క లిపి అంతరీకరణ అమరికతో ఇవ్వబడి ఉన్నాయి.
Ayinappaṭikī, avi vākyamu vārīgā amarcabaḍi, mariyu asalu/mūla bhāṣa (iṅglīṣ) mariyu lakṣyita bhāṣa yokka lipi antarīkaraṇa amarikatō ivvabaḍi unnāyi.
- A document for Sanskrit, for example, contains:
ఉదాహరణకు, సంస్కృతము కొరకు ఒక పత్రము ఈ క్రిందివాటిని కలిగియుంది.
Udāharaṇaku, sanskr̥tamu koraku oka patramu ī krindivāṭini kaligiyundi.
¶
- Original sentence in English.
ఇంగ్లీష్ లోని అసలు వాక్యము.
Iṅglīṣ lōni asalu vākyamu.
- A Sanskrit translation in Devanagari script.
దేవనాగరి లిపిలో ఒక సంస్కృత అనువాదము.
Dēvanāgari lipilō oka sanskr̥ta anuvādamu.
- Rendering of the Sanskrit sentence in the Latin alphabet.
లాటిన్ అక్షరాలలో సంస్కృత వాక్యము యొక్క ఉచ్ఛారణ/లిప్యంతరము.
Lāṭin akṣarālalō sanskr̥ta vākyamu yokka ucchāraṇa/ lipyantaramu.
¶
- Each triplet is separated by a single-space line; ends of paragraphs are indicated by the paragraph symbol, ¶.
ప్రతి త్రైత సంగ్రహము ఒక ఏకైక – స్థలపు రేఖతో వేరు చేయబడి ఉంది; పేరాగ్రాఫుల యొక్క ముగింపులు పేరాగ్రాఫు చిహ్నముతో సూచించబడి ఉన్నాయి, ¶.
Prati traita saṅgrahamu oka ēkaika – sthalapu rēkhatō vēru cēyabaḍi undi; pērāgrāphula yokka mugimpulu pērāgrāphu cihnamutō sūcin̄cabaḍi unnāyi, ¶.
¶
iii) Word-by-word format using spreadsheets (DOCs 1, 2 and 4):
వ్యాప్తి పత్రాలు ఉపయోగించి పదము-వారీగా ఉండే అనువాద రూపము (పత్రాలు 1, 2 మరియు 4):
Vyāpti patrālu upayōgin̄ci padamu-vārīgā uṇḍē anuvāda rūpamu (patrālu 1, 2 mariyu 4):
¶
- Unlike the above, these are spreadsheet files prepared using MS Excel.
పైవాటిలాగా కాకుండా వ్యాప్తి పత్రాలు ఎం.ఎస్.ఎక్సెల్ ఉపయోగించి తయారు చేయబడ్డాయి.
Paivāṭilāgā kākuṇḍā vyāpti patrālu eṁ.Es.Eksel upayōgin̄ci tayāru cēyabaḍḍāyi.
- For every original document, there is only a single document containing the original language, word-by-word translations of all four translated languages in their respective scripts and the four corresponding transliterations in the Latin alphabet.
ప్రతి అసలు పత్రమునకూ, అసలు భాష, సంబంధిత ఆయా లిపులలో నాలుగు అనువాద భాషలన్నింటి యొక్క పదము-వారీగా అనువాదములు మరియు లాటిన్ అక్షరాలలో నాలుగు సంబంధిత భాషల లిపి అంతరీకరణలను కలిగి ఉంటూ కేవలం ఒక ఏకైక పత్రము మాత్రమే ఉంది.
Prati asalu patramunakū, asalu bhāṣa, sambandhita āyā lipulalō nālugu anuvāda bhāṣalanniṇṭi yokka padamu-vārīgā anuvādamulu mariyu lāṭin akṣarālalō nālugu sambandhita bhāṣala lipi antarīkaraṇalanu kaligi uṇṭū kēvalaṁ oka ēkaika patramu mātramē undi.
- The document is arranged as in the sentence-by-sentence translation.
ఈ పత్రము వాక్యము వారీగా చేయబడిన అనువాదముతో అమర్చబడి ఉంది.
Ī patramu vākyamu vārīgā cēyabaḍina anuvādamutō amarcabaḍi undi.
- Thus, there are nine entries/rows on a spreadsheet for each sentence, followed by the insertion of a blank row.
ఆవిధంగా, వ్యాప్తి పత్రములో ఒక్కొక్క వాక్యానికీ తొమ్మిది ప్రవేశపదాలు/వరుసలు, తదుపరి ఒక ఖాళీ వరుస జొప్పించబడి ఉన్నాయి.
Āvidhaṅgā, vyāpti patramulō okkokka vākyānikī tom'midi pravēśapadālu/varusalu, tadupari oka khāḷī varusa joppin̄cabaḍi unnāyi.
¶
It is possible that for the same word in one language (for example, for "water" in English) there may be two equally appropriate words in another language ("jal" and "udaka" in Sanskrit, in this case).
ఒక భాషలో ఒకే పదానికి (ఉదాహరణకు ఇంగ్లీషులో "వాటర్" అనే పదానికి) మరొక భాషలో సముచితమైన రెండు పదాలు ఉండగల సాధ్యత ఉంది (ఈ ఉదంతములో సంస్కృతములో "జల్" మరియు "ఉదక" అనే పదాలు).
Oka bhāṣalō okē padāniki (udāharaṇaku iṅglīṣulō"vāṭar" anē padāniki) maroka bhāṣalō samucitamaina reṇḍu padālu uṇḍagala sādhyata undi (ī udantamulō sanskr̥tamulō"jal" mariyu"udaka" anē padālu).
Similarly, for a word like "hoped" in English, there may be two equally appropriate expressions in Urdu ("tawaqqo ki jati" and "umeed ki jati").
అదే విధంగా, ఇంగ్లీషులో "హోప్డ్ (hoped)" వంటి పదానికి, ఉర్దూలో సమానంగా సముచితమైన సమాసాలు ఉండవచ్చు("తవాఖ్ఖో కీ జాతీ" మరియు "ఉమ్మీద్ కీ జాతీ").
Adē vidhaṅgā, iṅglīṣulō "hōpḍ (hoped)" vaṇṭi padāniki, urdūlō samānaṅgā samucitamaina samāsālu uṇḍavaccu("tavākhkhō kī jātī" mariyu "um'mīd kī jātī").
Correspondingly, for a word like "providence" in English there may be two equally suitable words in Telugu ("bhagavanthudu" and "devudu") and in Hindi ("ishwar" and "bhagavaan").
దానికి తగ్గట్టుగానే, ఇంగ్లీషులో "ప్రోవిడెన్స్ (providence)" వంటి పదానికి, తెలుగులో ("భగవంతుడు" మరియు "దేవుడు") మరియు హిందీలో ("ఈశ్వర్" మరియు "భగవాన్") సమానంగా సరిపోయే రెండు పదాలు ఉండవచ్చు.
Dāniki taggaṭṭugānē, iṅglīṣulō "prōviḍens (providence)" vaṇṭi padāniki, telugulō ("bhagavantuḍu" mariyu "dēvuḍu") mariyu hindīlō ("īśvar" mariyu "bhagavān") samānaṅgā saripōyē reṇḍu padālu uṇḍavaccu.
The same issue would arise if translation were to be done from one of these languages into English—for example, "hoped" has several appropriate synonyms, like "wished,""longed" and "desired."
ఈ భాషలలో ఒకదాని నుండి ఇంగ్లీష్ లోనికి గనక అనువాదం చేయవలసివచ్చినప్పుడు కూడా ఇదే సమస్య ఏర్పడవచ్చు—ఉదాహరణకు, "హోప్డ్ (hoped)" అనే పదం "విష్డ్ (wished)," "లాంగ్డ్(longed)" మరియు "డిజైర్డ్ (desired)" వంటి సముచితమైన అనేక పర్యాయ పదాలను కలిగియుంది.
Ī bhāṣalalō okadāni nuṇḍi iṅglīṣ lōniki ganaka anuvādaṁ cēyavalasivaccinappuḍu kūḍā idē samasya ērpaḍavaccu—udāharaṇaku, "hōpḍ (hoped)" anē padaṁ "viṣḍ (wished)," "lāṅgḍ(longed)" mariyu "ḍijairḍ (desired)" vaṇṭi samucitamaina anēka paryāya padālanu kaligiyundi.
Keeping this in mind, care has been taken and cross-checking has been done to maintain consistency of translation according to the context among all three formats―for a given word in each sentence in each language.
దీనిని మనసులో ఉంచుకొని, ఈ మూడు రూపాలు అన్నింటిలోనూ- ప్రతి భాషలోనూ ఇవ్వబడిన ప్రతి వాక్యములోనూ ఒక పదము కొరకు సందర్భానికి తగ్గట్టుగా అనువాదము యొక్క స్థిరత్వమును నిర్వహించడానికై తగు శ్రద్ధ తీసుకోవడమైనది మరియు పునః పరిశీలన సహా చేయడమైనది.
Dīnini manasulō un̄cukoni, ī mūḍu rūpālu anniṇṭilōnū- prati bhāṣalōnū ivvabaḍina prati vākyamulōnū oka padamu koraku sandarbhāniki taggaṭṭugā anuvādamu yokka sthiratvamunu nirvahin̄caḍānikai tagu śrad'dha tīsukōvaḍamainadi mariyu punaḥ pariśīlana sahā cēyaḍamainadi.
That some words have several meanings will be discussed in the class.
అనేక అర్థాలు ఉన్న కొన్ని పదాల గురించి తరగతిలో చర్చించబడుతుంది.
Anēka arthālu unna konni padāla gurin̄ci taragatilō carcin̄cabaḍutundi.
¶
There exist many common words or roots among some orall ofthese languages (Telugu, Hindi, Urdu and Sanskrit), but this is not evident in writing because of their different scripts.
ఈ భాషలలో (తెలుగు, హిందీ, ఉర్దూ మరియు సంస్కృతం) కొన్నింటిలో లేదా అన్నింటిలోనూ అనేక సామాన్య పదాలు లేదా మూలాలు ఉండవచ్చు,ఐతే ఆ భాషల యొక్క విభిన్న లిపిల కారణంగా ఇది అంత స్పష్టంగా కనిపించదు.
Ī bhāṣalalō (telugu, hindī, urdū mariyu sanskr̥taṁ) konniṇṭilō lēdā anniṇṭilōnū anēka sāmān'ya padālu lēdā mūlālu uṇḍavaccu,aitē ā bhāṣala yokka vibhinna lipila kāraṇaṅgā idi anta spaṣṭaṅgā kanipin̄cadu.
The purpose of the use of transliteration is to:
లిపి అంతరీకరణను ఉపయోగించడంలోని ఉద్దేశ్యము:
Lipi antarīkaraṇanu upayōgin̄caḍanlōni uddēśyamu:
- Reveal their underlying relationships.
దాగియున్న వాటి సంబంధాలను వెల్లడించుట.
Dāgiyunna vāṭi sambandhālanu vellaḍin̄cuṭa.
- Enable even individuals who are unfamiliar with these scripts to experience a sense of the target language and form a better idea of the proposed comparative language-learning method.
ఈ లిపులతో పరిచయం లేని వ్యక్తులకు సైతమూ లక్ష్యిత భాష పట్ల ఒక రకమైన స్పృహ కలిగేలా చేయుట మరియు ప్రతిపాదిత తులనాత్మక భాషా – అభ్యసన పద్ధతి పట్ల వారు ఒక మెరుగైన అవగాహన రూపొందించుకునేలా చేయుట.
Ī lipulatō paricayaṁ lēni vyaktulaku saitamū lakṣyita bhāṣa paṭla oka rakamaina spr̥ha kaligēlā cēyuṭa mariyu pratipādita tulanātmaka bhāṣā – abhyasana pad'dhati paṭla vāru oka merugaina avagāhana rūpondin̄cukunēlā cēyuṭa.
- Ultimately reach the widest possible readership for this proposal on the web so it can be evaluated to its fullest extent.
అంతిమంగా ఈ ప్రతిపాదన కొరకు అంతర్జాలము (వెబ్) పైన సాధ్యమైనంత ఎక్కువగా పాఠకలోకాన్ని చేరుకునేలా చేయుట, తద్వారా దానిని సంపూర్ణ విస్తృతి మేరకు మదింపు చేయగలుగుట.
Antimaṅgā ī pratipādana koraku antarjālamu (veb) paina sādhyamainanta ekkuvagā pāṭhakalōkānni cērukunēlā cēyuṭa, tadvārā dānini sampūrṇa vistr̥ti mēraku madimpu cēyagaluguṭa.
¶
When considering class textbook lessons as part of the "Our Languages" subject:
"మన భాషల" విషయాంశములో భాగంగా తరగతి పాఠ్యపుస్తకాల పాఠాలను తీసుకున్నప్పుడు:
"Mana bhāṣala" viṣayānśamulō bhāgaṅgā taragati pāṭhyapustakāla pāṭhālanu tīsukunnappuḍu:
- There will be no need for transliterations because students should have learned the respective scripts in preschool or nursery school.
ప్రీ స్కూల్ లేదా నర్సరీ స్కూల్ లో విద్యార్థులు సంబంధిత భాషా లిపులను బాగా నేర్చుకొని ఉంటారు కాబట్టి లిపి అంతరీకరణల యొక్క అవసరం ఉండబోదు.
Prī skūl lēdā narsarī skūl lō vidyārthulu sambandhita bhāṣā lipulanu bāgā nērcukoni uṇṭāru kābaṭṭi lipi antarīkaraṇala yokka avasaraṁ uṇḍabōdu.
- The class book can follow a five-sentence-by-five-sentence format or a full lesson in English followed by a full lesson in Telugu, Hindi, Urdu and Sanskrit, respectively.
తరగతి పాఠ్యపుస్తకము ఐదు -వాక్యాల- వాక్యము వారీ రూపములోని అనువాదమును అనుసరించవచ్చు లేదా ఒక పాఠము పూర్తిగా ఇంగ్లీష్ లోనూ దాని తర్వాత వరుసగా తెలుగు, హిందీ, ఉర్దూ మరియు సంస్కృతములో ఆ పాఠము పూర్తిగానూ ఉండవచ్చు.
Taragati pāṭhyapustakamu aidu -vākyāla- vākyamu vārī rūpamulōni anuvādamunu anusarin̄cavaccu lēdā oka pāṭhamu pūrtigā iṅglīṣ lōnū dāni tarvāta varusagā telugu, hindī, urdū mariyu sanskr̥tamulō ā pāṭhamu pūrtigānū uṇḍavaccu.
- However, the word-by-word format, to be called "Wordbook," necessarily follows a five-sentence-by-five-sentence format because its purpose is to enable the student to inspect side by side, word by word, and sentence by sentence across five languages.
అయినప్పటికీ, "పదపుస్తకము" అనబడే ప్రతి-పదానికి-పదం రూపము, తదుపరిగా ఐదు-వాక్యాలకు ఐదు-వాక్యాల అనువాద రూపమును ఆవశ్యకంగా అనుసరిస్తుంది, ఎందుకంటే, విద్యార్థులు ఐదు భాషలలోనూ పదం-పదమునూ, వాక్యం-వాక్యాన్నీ ప్రక్క ప్రక్కన ఉంచుకొని తనిఖీ చేసుకోవడానికి వీలు కలిగేలా చేయడం ఈ పద్ధతి యొక్క ఉద్దేశ్యము.
Ayinappaṭikī, "padapustakamu" anabaḍē prati-padāniki-padaṁ rūpamu, taduparigā aidu-vākyālaku aidu-vākyāla anuvāda rūpamunu āvaśyakaṅgā anusaristundi, endukaṇṭē, vidyārthulu aidu bhāṣalalōnū padaṁ-padamunū, vākyaṁ-vākyānnī prakka prakkana un̄cukoni tanikhī cēsukōvaḍāniki vīlu kaligēlā cēyaḍaṁ ī pad'dhati yokka uddēśyamu.
¶
It should be further realized that unlike class textbook lessons, DOCs 1-4 are necessarily advanced documents meant mainly for parents, educators, policy decision makers and interested citizens.
తరగతి పాఠ్యపుస్తకాల మాదిరి కాకుండా, పత్రాలు 1-4 ప్రధానంగా తల్లిదండ్రులు, బోధకులు, విధాన నిర్ణేతలు మరియు ఆసక్తి గల పౌరుల కొరకు ఉద్దేశించబడిన ఆధునిక పత్రాలు అని తదుపరిగా గుర్తించాల్సి ఉంటుంది.
Taragati pāṭhyapustakāla mādiri kākuṇḍā, patrālu 1-4 pradhānaṅgā tallidaṇḍrulu, bōdhakulu, vidhāna nirṇētalu mariyu āsakti gala paurula koraku uddēśin̄cabaḍina ādhunika patrālu ani taduparigā gurtin̄cālsi uṇṭundi.
Long sentences can become too unwieldy to read in the spreadsheet Wordbook format.
పొడవైన వాక్యాలు వ్యాప్తిపత్రమును పదపుస్తకము రూపములో చదవడానికి మరీ అతిపెద్దవిగా, కుదురుబాటు లేనివిగా మారవచ్చు.
Poḍavaina vākyālu vyāptipatramunu padapustakamu rūpamulō cadavaḍāniki marī atipeddavigā, kudurubāṭu lēnivigā māravaccu.
Also, one is not expected to go to a Wordbook to look up the word-by-word translation for a word obvious within the standard translation (five-sentence format or full lesson format).
అంతేకాక, ఒక వ్యక్తి, ప్రామాణిక అనువాదము (ఐదు-వాక్యాల రూపము లేదా పూర్తి పాఠము రూపము) లోపున స్పష్టంగా ఒక పదము యొక్క పదం-పదం అనువాదము కొరకు ఒక పదపుస్తకమును చదివితీరాలని మనం ఆశించజాలము.
Antēkāka, oka vyakti, prāmāṇika anuvādamu (aidu-vākyāla rūpamu lēdā pūrti pāṭhamu rūpamu) lōpuna spaṣṭaṅgā oka padamu yokka padaṁ-padaṁ anuvādamu koraku oka padapustakamunu cadivitīrālani manaṁ āśin̄cajālamu.
Nonetheless, these documents are being productively utilized as examples not only to illustrate the essential underlying concepts of the proposal but also to investigate the limits of the new language learning system and to meticulously document them as they are observed.
ఏది ఏమైనప్పటికీ, ఈ పత్రాలు ఈ ప్రతిపాదన యొక్క అంతర్లీనంగా దాగియున్న ఆవశ్యక భావజాలములను ప్రదర్శించుటకు మాత్రమే కాకుండా, కొత్త భాషా అభ్యసన పద్ధతి యొక్క పరిమితులను పరిశోధించుటకు మరియు గమనించినట్లుగా వాటిని అత్యంత శ్రద్ధగా గ్రంధస్థం చేయడానికి కూడా ఉదాహరణలుగా ఉత్పాదనాత్మకంగా వినియోగించుకోబడుతున్నాయి.
Ēdi ēmainappaṭikī, ī patrālu ī pratipādana yokka antarlīnaṅgā dāgiyunna āvaśyaka bhāvajālamulanu pradarśin̄cuṭaku mātramē kākuṇḍā, kotta bhāṣā abhyasana pad'dhati yokka parimitulanu pariśōdhin̄cuṭaku mariyu gamanin̄cinaṭlugā vāṭini atyanta śrad'dhagā grandhasthaṁ cēyaḍāniki kūḍā udāharaṇalugā utpādanātmakaṅgā viniyōgin̄cukōbaḍutunnāyi.
It is hoped that these insights would come in handy while devising the class textbook lessons for the students, where small, simple sentences may be the norm, but that depends on the level of the class in question.
విద్యార్థుల కొరకు చిన్న, సరళమైన వాక్యాలు సూచికగా పాఠ్యపుస్తకాల పాఠాలను రూపొందించునప్పుడు ఈ గ్రాహ్యతలు అందుబాటులోనికి రాగలవని ఆశించబడుతోంది, అయితే అది తరగతి యొక్క స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది.
Vidyārthula koraku cinna, saraḷamaina vākyālu sūcikagā pāṭhyapustakāla pāṭhālanu rūpondin̄cunappuḍu ī grāhyatalu andubāṭulōniki rāgalavani āśin̄cabaḍutōndi, ayitē adi taragati yokka sthāyini baṭṭi ādhārapaḍi uṇṭundi.
It is safe to say that it is a complex and important project, and that there is going to be much to learn and develop from the forthcoming feedback once its implementation begins.
ఇది ఒక క్లిష్టమైన మరియు ముఖ్యమైన ప్రాజెక్టు అని, మరియు దీని అమలు ప్రారంభము కాగానే, రాబోయే సూచిత సలహాల నుండి నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి పరచడానికీ ఎంతో ఎక్కువగా ఉందనీ చెప్పడం సురక్షితంగా ఉంటుంది.
Idi oka kliṣṭamaina mariyu mukhyamaina prājekṭu ani, mariyu dīni amalu prārambhamu kāgānē, rābōyē sūcita salahāla nuṇḍi nērcukōvaḍāniki mariyu abhivr̥d'dhi paracaḍānikī entō ekkuvagā undanī ceppaḍaṁ surakṣitaṅgā uṇṭundi.
¶