" మీ భాషను మార్చుకోండి, అప్పుడు మీ ఆలోచనలు మారుతాయి."
కార్ల్ ఆల్‌బ్రెక్ట్

బీరెల్లి శేషి, ఎం.డి.

విషయాలు, పాఠ్యప్రణాళిక, మరియు విద్యా ప్రణాళిక

వ్యవస్థాపకుడు & అధ్యక్షుడు నుండి వచ్చిన సందేశంలో నొక్కిచెప్పబడినట్లుగా, ఇది నిర్దిష్టమైన చర్చ మరియు విశ్లేషణ అవసరమైన ఒక ప్రయోగాత్మక ఆలోచన.
ఈ ఆలోచనను నిర్దిష్టంగా మరియు తగినంత వివరంగా ప్రదర్శించడానికి జాగ్రత్త తీసుకోబడుతుంది, తద్వారా ఇది విశ్లేషణకు అనుకూలంగా ఉంటుంది.
భాషావేత్తలు మరియు సంబంధిత భాషా పండితులు ఈ ప్రతిపాదనను అన్ని కోణాల నుండి పరిశీలించి, తగిన విషయాలను, పాఠ్య ప్రణాళికలు మరియు విద్యా ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తారని భావిస్తున్నాను, ఎందుకంటే ప్రయోగం కోసమైనా అలాంటి విషయాలు అవసరం కాబట్టి.
భారతదేశం యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, దాతృత్వ సంస్థలు మరియు విద్యాసంస్థలు ఈ ప్రతిపాదనను సమర్థించి, అవసరమైన ఆర్థిక మద్దతు మరియు సహాయాన్ని అందిస్తాయని కూడా భావిస్తున్నాను.
ఈ ప్రతిపాదన యొక్క విజయాన్ని సంబంధిత భాషా నిపుణుల సహకారంతో తయారుచేయబోయే తగిన పాఠ్యపుస్తకాల మీద అంచనా వేయవచ్చు.
మరొక కోణంలో, ప్రపంచ సమాచార సాంకేతిక దిగ్గజాలు ఈ ప్రతిపాదనను తగినంత సవాలుతో కూడినదిగా చూడవచ్చు మరియు తగిన పాఠ్యపుస్తకాలు మరియు సాఫ్ట్‌వేర్ ఉపకరణాలు/యాప్స్ ను ఉత్పత్తి చేయడంలో సహాయపడటం ద్వారా ఈ పనిని ఆచరణాత్మకంగా మార్చడానికి దీనిలోకి అడుగుపెట్టాలని పరిగణించేంత విస్తృత ప్రాముఖ్యత గలదిగా చూడవచ్చు.
అవసరమైన ఉపకరణాలు మరియు కంప్యూటర్ టూల్స్ యొక్క లభ్యత ఆసక్తిగల పాఠశాలలకు ఈ బోధనా పద్ధతిలో ప్రయోగాలు చేయడానికి వీలు కల్పిస్తుంది.
ఈ వెబ్‌సైట్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే ఏమి అవసరమో అనే దానిపై అవగాహన పెంచడం మరియు అంతిమంగా దానికి ఒక వాస్తవరూపం ఇవ్వడానికి చర్చ మరియు వాదనను ఉత్తేజపరచడం.

డాక్టర్ శేషి యొక్క బహుళభాషావాదం కొరకు అంతర్జాతీయ కేంద్రం
వైవిధ్యం మా పరంపర
బీరెల్లి శేషి, ఎం.డి.

తెలుగు భాష మాట్లాడే స్థానిక వక్త (హిందీ, ఉర్దూ, సంస్కృతం) దీనిని ఆంగ్లంలో డాక్టర్ శేషి వ్రాసిన అసలు నుండి అనువదించారు.